By: ABP Desam | Updated at : 12 Mar 2022 05:54 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 మార్చి 12 శనివారం రాశిఫలాలు
మార్చి 12 శనివారం రాశిఫలాలు
మేషం
కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. మీకు అప్పగించిన బాధ్యతను సకాలంలో పూర్తిచేస్తారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. స్నేహితులను కలుస్తారు. పనికిరాని చర్చల్లో మీ సమయాన్ని వృథా చేసుకోకండి. అర్థవంతమైన పనుల్లో మీ పాత్ర మీరు పోషిస్తారు. వ్యాపారంలో మందగమనం దూరమవుతుంది.
వృషభం
ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వ్యక్తులను కలుస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఆనందం, సంపద పెరుగుతుంది. తెలియని వ్యక్తుల పట్ల మీ పనికి ఆటంకం కలగవచ్చు. మీ జీవితభాగస్వామితో సమయం గడిపే సమయం మీకు దొరుకుతుంది. ఇంట్లో ఉన్న వృద్ధుల ఆరోగ్యం క్షీణించవచ్చు.
మిథునం
ఈ రోజు మీకు కష్టతరంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు. డబ్బులు జాగ్రత్తగా దాచండి. మీ జీవిత భాగస్వామికి బహుమతులు ఇవ్వొచ్చు. మాటను అదుపులో ఉంచుకోవాలి. అసభ్యంగా మాట్లాడొద్దు.
కర్కాటకం
గత కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. చికిత్స కోసం ఖర్చు కావొచ్చు. వ్యాపారానికి సంబంధించి విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అధిక వేగంతో వాహనాన్ని నడపకూడదు.
Also Read: మీ ఇంట్లో ద్వారాలెన్ని, ఈ నంబర్ ఉంటే మాత్రం గండం తప్పదు
సింహం
మీరు అసమతుల్యత కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి షికారుకి వెళతారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. ఒత్తిడికి లోనుకావొద్దు.
కన్య
ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మందులు తీసుకోవడంలో అజాగ్రత్త వహించకండి. ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేయవచ్చు. వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. పాత మిత్రులను కలుస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి.
తుల
ఈ రోజు మీరు కొన్ని పనిలు త్వరగా పూర్తి చేయాలనే ప్రయత్నంలో తప్పులు చేస్తారు. కార్యాలయంలో ఎవరితోనైనా మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. మీరు స్నేహితుల మద్దతు పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. యాత్రను వాయిదా వేయండి.
వృశ్చికం
స్నేహితుడి వల్ల టెన్షన్ పడతారు. ఏదైనా నష్టానికి బాధ్యత ఇతరులకు అప్పగించవద్దు.మీ పని తీరులో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించండి. యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమికులకు మంచి రోజు. ఈరోజు బంధువు రావచ్చు.
ధనుస్సు
ఈరోజు మీరు విమర్శల పాలవుతారు..కానీ..కోప్పడకండి. మాట్లాడేటప్పుడు తప్పుడు పదాలు వాడొద్దు. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది. మార్గనిర్ధేశం చేసే వ్యక్తిని కలుస్తారు. పాతసమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు మంచి కెరీర్ కోసం మరింత కష్టపడాలి.
Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి
మకరం
ఉపయోగం లేని విషయాలకు ఎక్కువ సమయం కేటాయించవద్దు. పనికిరాని చర్చల్లో పాల్గొనవద్దు. ఈరోజు మీ మనస్సు కలవరపడవచ్చు. బంధువుల నుంచి విచారకరమైన సమాచారం అందుతుంది. సన్నిహితుల ఆరోగ్యం క్షీణించవచ్చు. కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు పెద్ద నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.
కుంభం
ప్రేమికులకు ఈరోజు ఆహ్లాదకరమైన రోజు. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. చాలా కాలం తర్వాత బంధువులను కలుస్తారు. మీ ఆఫీసు పనులు సులువుగా పూర్తవుతాయి. విహారయాత్రకు వెళ్లాల్సి రావొచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. కొత్త వ్యవహారాలు ప్రారంభమవుతాయి. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి.
మీనం
మీ అలవాట్ల కారణంగా మీరు ఈ రోజు బాధపడాల్సి రావొచ్చు. కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోండి. మీరు మీ పిల్లలతో గొడవ పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కలత చెందుతారు. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు. ఆఫీసులో మరింత బాధ్యత ఉంటుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.
Tirumala Brahmotsavam 2022 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రెండేళ్ల తర్వాత అత్యంత వైభవంగా
Horoscope 2nd July 2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Panchang 2nd July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఏలినాటి, అష్టమ, అర్దాష్టమ శనిదోష నివారణ స్తోత్రం
Jagannath Rath Yatra 2022: పూరి జగన్నాథుడి విగ్రహాల్లో ఓ బ్రహ్మపదార్థం ఉంటుంది, అదేంటో తెలుసా!
Transfers In AP: దేవాదాయ శాఖలో సామూహిక బదిలీలు- అర్థరాత్రి జీవో విడుదల
Defence Ministry: ఆర్మీ, నేవీలో అగ్నిపథ్ నియామకాలు ప్రారంభం, ఎయిర్ పోర్స్ లో 2.72 లక్షల దరఖాస్తులు
Pavithra Lokesh: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్
The warriorr Trailer: రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్
BJP PLenary Plan On TRS : తెలంగాణలో కాషాయజెండా పాతడమే లక్ష్యం ! బీజేపీ అత్యున్నత భేటీ వెనుక అసలు వ్యూహం ఇదే