Horoscope Today 24th February 2022: ఈ రాశుల వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 ఫిబ్రవరి 24 గురువారం రాశిఫలాలు
మేషం
ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోక తప్పదు. పని విషయంలో జాగ్రత్తగా ఉండండి లేదంటే ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికాక తప్పదు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేయడానికి ప్రయత్నించండి. అజాగ్రత్త కారణంగా మీ సమస్య పెరుగుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోండి.
వృషభం
ఈ రోజు మీరు ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందుతారు. పెట్టుబడి నుంచి ప్రయోజనాలు పొందుతారు. మీ వ్యక్తిగత జీవితంలో పెద్ద కష్టం తొలగిపోయే అవకాశం ఉంది. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
మిథునం
ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన రోజు. మీ ఆర్థిక పరిస్థితిలో మార్పు ఉంటుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు పెరుగుతాయి. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. అదృష్టం కలిసొస్తుంది.
కర్కాటకం
స్నేహితులతో సమయం గడపగలుగుతారు. ఈరోజు, మీరు వ్యాపార సంబంధిత నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. ఏదైనా అజాగ్రత్త కారణంగా మీరు నష్టపోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏవైనా డీల్స్ కుదుర్చుకునేందుకు ఇదే సరైన సమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
Also Read: పెళ్లికానివారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆదిదంపతులు వరమిస్తారట
సింహం
కుటుంబ సభ్యుల నుంచి మీకు అవసరమైన సహాయం అందుతుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది. స్నేహితులతో అపార్థం ఏర్పడవచ్చు. ఈ రోజంతా చాలా బిజీగా ఉంటారు. ఆరోగ్యం క్షీణించవచ్చు.
కన్య
ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. పెద్ద వ్యాపారవేత్తలతో వ్యవహరించే అవకాశం లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం ఉంటుంది. గృహ జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. మీరు ఈరోజు అసంతృప్తిగా ఉంటారు. బ్యాంకుకు సంబంధించిన పనులు పూర్తి చేయండి. తెలియని వ్యక్తులతో లావాదేవీలు చేయవద్దు. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.
తుల
ఈరోజు మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోండి లేదంటే ఆ ప్రభావం మీ పనిపై పడుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పనికిరాని విషయాలపై ఎక్కువ కాన్సన్ ట్రేషన్ చేయొద్దు. సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి.
వృశ్చికం
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా పనిలో తొందరపాటు వల్ల మీకు పెద్ద నష్టం కలుగుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో మాత్రమే అవసరమైన నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. అనవసరంగా ఖర్చు పెట్టకండి. బంధువుతో విభేదాలు రావచ్చు. మీ ఆహారాన్ని నియంత్రించండి.
Also Read: దేవుడి ప్రసాదాన్ని నక్కలకు పెట్టేస్తారక్కడ
ధనుస్సు
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. అధికారులు మీ పనిని చూసి ఆకట్టుకుంటారు. వ్యాపార పరిస్థితులు చక్కగా ఉంటాయి. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఆరోగ్యం మెరుగుపడేందుకు యోగా వ్యాయామం పట్ల ఆసక్తి చూపుతాం.
మకరం
మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కార్యాలయంలో సహోద్యోగితో అభిప్రాయ భేదాలు రావచ్చు. శుభ కార్యాలలో పాల్గొంటారు. బాధ్యతను సకాలంలో నెరవేరుస్తారు.
కుంభం
ఈ రోజు మీ మనసు సంతోషంగా ఉంటుంది.లాంటి సంక్షోభం నుంచి అయినా ఉపశమనం పొందుతారు. ప్రేమికుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. బంధువుల నుంచి కొత్త సమాచారం అందుతుంది.
మీనం
స్నేహితుడితో విభేదాలు ఏర్పడే అవకాశాలున్నాయి. వ్యాపార విషయాల్లో చిక్కుకుపోవచ్చు. కుటుంబానికి సమయం కేటాయించలేరు. నిలిచిపోయిన పనులు పూర్తి కాకపోవడం వల్ల కలత చెందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.