Horoscope Today 22th February 2022: ఈ రాశుల కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ఈ రోజు మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
ఫిబ్రవరి 22 మంగళవారం రాశిఫలాలు
మేషం
మేష రాశి వారికి ఈ రోజు కష్టతరమైన రోజు అనిపిస్తుంది. స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు రావచ్చు. ఏదైనా తప్పుడు నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. దంపతులు ప్రయాణానికి ప్రణాళిక వేస్తారు.
వృషభం
ఈ రోజు మీ వైఖరిలో మార్పు ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక వ్యక్తి సహవాసం వల్ల ప్రయోజనం పొందుతారు. మతపరమైన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. అనవసరమైన పనులపై మీ సమయాన్ని వృధా చేయడం మానుకోండి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.
మిథునం
ఈరోజు ఎవరితోనైనా వివాదాలు రావచ్చు. న్యాయపరమైన విషయాల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు విషయంలో అలసత్వం కారణంగా ఇబ్బంది పడతారు. ప్రయాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. మీ సంపద పెరుగుతుంది.
కర్కాటకం
పిల్లల తప్పుడు చర్యలను ప్రోత్సహించవద్దు. మీరు తర్వాత పశ్చాత్తాప పడవలసి రావచ్చు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. మీరు వ్యాపారం గురించి ఆందోళన చెందుతారు. పూర్వీకుల ఆస్తి విషయంలో బంధువుల ఒత్తిడి ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.
Also Read: మూఢం అంటే ఏంటి, ఈ టైమ్ లో శుభకార్యాలు ఎందుకు చేయొద్దంటారు..
సింహం
మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆఫీసులో శుభవార్తలు అందుకుంటారు. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. ఓ స్నేహితుడి కారణంగా పనికిరాని పనుల్లో చిక్కుకుంటారు. జాగ్రత్తగా ఖర్చు చేయండి.
కన్య
కుటుంబ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈరోజు మీరు తొందరగా అలసిపోతారు. సోదరులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాల మార్పు నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసి ఉంటుంది. వ్యాపారంలో మందగమనాన్ని ఎదుర్కోవచ్చు. పొదుపుని ప్రోత్సహించండి.
తుల
మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతను పొందుతారు. అధికారులు మీతో సంతోషంగా ఉంటారు. పదోన్నతి పొందే అవకాశం ఉంది. కొన్ని పనుల నిమిత్తం విహారయాత్రకు వెళ్తారు. మీరు మీ స్నేహితుల సర్కిల్‌తో సమయం గడపవచ్చు. ఒక పనిని పూర్తి చేయడంలో వైఫల్యం సమస్యలు తెస్తుంది.
వృశ్చికం
కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల కుటుంబ సభ్యులపై భారం పడుతుంది. రిస్క్ తీసుకోవద్దు. కష్టాలు గడిచే వరకు వేచి ఉండండి. ఉద్యోగంలో సహోద్యోగితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆలోచనలను ఉన్నతంగా ఉంచండి.
Also Read: అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే
ధనుస్సు
ఈరోజు భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. వివాదాన్ని పరిష్కరించేందుకు కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవలసి ఉంటుంది. మీరు ఈ రోజు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మకరం
ఇప్పుడే కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించే ప్రణాళికను అమలు చేయవద్దు. నష్టం జరగవచ్చు. కొన్ని సంక్షోభాల కారణంగా మీ పని ప్రభావితం కావచ్చు. పిల్లల పక్షాన విజయం వల్ల సంతోషానికి అవకాశాలు వస్తాయి. విద్యార్థులు పరీక్షల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
కుంభం
ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయవద్దు. డాక్టర్‌ని సంప్రదించకుండా మందులు తీసుకోవద్దు. రాజకీయ వ్యక్తులకు వ్యతిరేకత రావచ్చు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
మీనం
ఈ రోజు మీకు ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. ఆర్థిక పరిస్థితి మారుతుంది. మీ రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించగలరు. ఏదైనా పనులపై సమీపంలో నగరానికి వెళ్లాల్సి ఉంటుంది. కోర్టుకు సంబంధించిన కేసులు వేగవంతమవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. తెలియని వ్యక్తుల మాటలు నమ్మవద్దు.