Horoscope Today 16th February 2022: మాఘ పూర్ణిమ రోజు ఈ ఐదు రాశులపై శివుడి అనుగ్రహం ఉంటుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 ఫిబ్రవరి 16 బుధవారం రాశిఫలాలు
మేషం
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. ఓ వైపు శుభవార్తలు, మరోవైపు దుర్వార్తలు రెండూ వినే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఖర్చు చేసేటప్పుడు నెలవారీ బడ్జెట్‌ను గుర్తుంచుకోండి.
వృషభం
విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. దంపతుల మధ్య ప్రేమ బంధం బలంగా ఉంటుంది. మీరు ప్రయాణానికి ప్రణాళికలు వేసుకోవచ్చు. అనవసర వివాదాల్లో తలదూర్చకండి. బంధువుల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఉన్నతాధికారులతో పదోన్నతి గురించి ఉద్యోగులు మాట్లాడేందుకు ఇదే సరైన సమయం.
మిథునం
మిథున రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం. ఇనుము వ్యాపారులు లాభపడతారు. స్వీయ అధ్యయనంలో ఎక్కువ సమయం గడపండి. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
Also Read: ఫిబ్రవరి నెలలో ఈ నాలుగు రాశులవారి జాతకమే మారిపోతుంది..మీరున్నారా ఇందులో...
కర్కాటకం
మీ సామాజిక, ఆర్థిక స్థితి బలపడుతుంది. తెలియని వ్యక్తుల వల్ల మీరు గందరగోళానికి గురవుతారు. ప్రయాణంలో అవసరమైన పత్రాలను మీతో తీసుకెళ్లండి. కోర్టు వ్యవహారాల్లో పురోగతి అవకాశాలు తక్కువ. మాటపై సంయమనం పాటించండి. ఎవ్వరికీ సలహాలు ఇవ్వకండి.
సింహం
మీరు మీ స్నేహితులతో వ్యాపారం గురించి చర్చిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పనికిరాని విషయాలలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేయకండి.బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులకు కొన్ని ఆటంకాలు ఉండొచ్చు.
కన్య
ఈరోజు మీ ప్రవర్తనలో చిరాకు ఉంటుంది. ఎవరితోనైనా గొడవ పడిన తర్వాత మీరు మానసికంగా ఆందోళన చెందుతారు. న్యాయపరమైన విషయాల్లో మీకు వ్యతిరేకంగా నిర్ణయం రావచ్చు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. దంపతుల మధ్య కొంత గందరగోళం ఏర్పడవచ్చు. విద్యార్థులు శ్రమించవలసి ఉంటుంది.
తుల
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి, పౌష్టికాహారం తీసుకోండి. వృద్ధుల ఆరోగ్యం క్షీణించవచ్చు. మహిళలకు శుభసమయం.
వృశ్చికం
మీరు కార్యాలయంలో ఎవరితోనైనా గొడవపడే అవకాశం ఉంది. రోజంతా చికాకుగా ఉంటారు. భగవంతుని ఆరాధనలో నిమగ్నమై ఉంటారు. పెండింగ్ పనులు పూర్తిచేయనందుకు పై అధికారుల ఆగ్రహానికి గురవుతారు. వ్యాపారం మందకొడిగా ఉంటాయి. యువత ఉద్యోగాలు పొందవచ్చు.
Also Read: ఈ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది, ఈ వారంలో ఏ రాశిఫలితం ఎలా ఉందంటే
ధనుస్సు
ఈరోజు ఏదో పనిపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ పనిలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. మీరు మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించండి. ఆధ్యాత్మిక ప్రదేశ సందర్శనకు వెళతారు. సంతోషంగా ఉంటారు.
మకరం
ఈరోజు మకరరాశి వారకి కలిసొస్తుంది. పాత మొత్తం తిరిగి రావడంతో వ్యాపారంలో కొత్త ఒప్పందాలు పూర్తవుతాయి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పెద్దల అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి.
కుంభం
ఈ రాశివారు ఈ రోజు చాలా బిజీగా ఉంటారు. తప్పుడు మాటలు వ్యతిరేకించండి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి కి తగ్గట్టే ఖర్చులుంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
మీనం
స్నేహితులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. మీ వాయిస్‌ని అదుపులో ఉంచుకోండి. మీ ప్రవర్తనలో కోపం ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయానికి ఆవేశపడటం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు గ్యాస్ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతారు.