News
News
వీడియోలు ఆటలు
X

Daily Horoscope 30 November 2021: ఈ రాశులవారు పనులు వాయిదా వేయకండి... మీ రాశి ఫలితం ఎలా ఉందో తెలుసుకోండి...

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 
Share:

మేషం
మీ కెరీర్‌కు సంబంధించి కొత్త ప్రణాళికలు వేసుకోవచ్చు. బంధువులతో సమావేశమవుతారు. ఈరోజంతా బాగానే ఉంటుంది. కోపం తెచ్చుకోకండి. ఒత్తిడిని నివారించడానికి ఇష్టదైవాన్ని ప్రార్థించండి.  ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. పిల్లల వైపు నుంచి మంచి సమాచారం అందుతుంది. 
వృషభం
ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించండి. వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త అవకాశాలు పొందుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.  మీ బంధువుల నుంచి శుభవార్త అందుకుంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొత్త పెట్టుబడుల ప్రతిపాదన ప్రస్తుతానికి వాయిదా వేయండి.
మిథునం
తలపెట్టిన పనులు వాయిదా వేయవద్దు. ఏ చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.  గతంలో  కృషికి ఈ రోజు ఫలితం దక్కే అవకాశం ఉంది. కొన్ని పనుల్లో  పెట్టుబడి పెడతారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది.
కర్కాటకం
ఆఫీసులో ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు రావొచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీకు మీరు బలహీనంగా ఫీలవుతారు.  వ్యాపారస్తులు తమ పనులపై  ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త.
సింహం
మీ ప్రణాళికలు నెరవేరుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. మీరు కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే కుటుంబ సభ్యుల నుంచి సలహా తీసుకోండి. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. భగవంతుడిని ఆరాధించడానికి సమయం కేటాయించండి. పనిలో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. జీర్ణకోశ వ్యాధులు రావచ్చు.
కన్య
ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలొచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు విజయం సాధిస్తారు.  ప్రత్యర్థులతో వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.  శుభవార్త వింటారు. మొదలుపెట్టిన పనిని   అసంపూర్తిగా ఉంచవద్దు. ఆఫీసు వాతావరణం బాగుంటుంది.
తుల
ఉద్యోగం మారాలనుకుంటే ఇదే మంచిసమయం.  రోజంతా బాగానే ఉంటుంది. వ్యాపారులకు ఆర్థికంగా కలిసొస్తుంది. ఎవరినీ సులభంగా నమ్మవద్దు. ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెడతారు.  రుణ విముక్తి పొందుతారు.
వృశ్చికం
డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చట్టపరమైన విషయాలకు సంబంధించి కొత్త సమాచారం లభిస్తుంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పిల్లలతో సంతోషంగా ఉంటారు.  మీ దినచర్యలో ఆరాధనను చేర్చుకోండి. ఈరోజు మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు 
పిల్లల వైపు నుంచి మంచి సమాచారం అందుతుంది. మీరు ఈరోజు వ్యాపారంలో చాలా లాభాలను పొందవచ్చు.  యువత ముందుకు కొత్త అవకాశాలు వస్తాయి. మీరు కొన్ని పనిలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఎవరితోనూ వ్యక్తిగత విషయాలు చర్చించవద్దు. మీ జీవిత భాగస్వామితో కలిసి నడకకు వెళ్లండి.
మకరం
కుటుంబ సమస్యల కారణంగా ఇబ్బంది పడతారు. అనవసర ఖర్చు పెట్టవద్దు. వ్యాపారానికి సంబంధించి కొన్ని కొత్త ప్రణాళికలను రూపొందించవచ్చు. పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలు పరిశీలించి సానుకూలంగా స్పందించండి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి.
కుంభం
బయటకు వెళ్లే ముందు పెద్దల ఆశీస్సులు తీసుకోండి. మీరు కార్యాలయంలో పెద్ద బాధ్యతను పొందవచ్చు.  వ్యాపారస్తులు లాభపడతారు. తెలియని వ్యక్తి పట్ల జాగ్రత్త వహించండి. ఎవరైనా మీకు హాని చేయవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 
మీనం
వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి  ఇది సరైన సమయం కాదు. యువత ఉద్యోగావకాశాలు పొందవచ్చు. కుటుంబంలో కొన్ని సమస్యల కారణంగా మీరు ఆందోళన చెందుతారు. అయితే ఇంటి పెద్దల పట్ల శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
Also Read: పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...
Also Read: చాణక్యుడు, కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు... ఈ మూడు పేర్లు తెలుసా.. అందుకే కన్ఫూజనా..!
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 30 Nov 2021 06:19 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Free Horoscope 30 November horoscope Astrology ASTROLOGY TODAY 30 November 2021Daily Horoscope 30 November 2021

సంబంధిత కథనాలు

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి

చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి

Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!

Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !