News
News
X

Horoscope Today 24 August 2022: ఈ రాశివారు నమ్మినవారి చేతిలో మోసపోతారు, ఆగస్టు 24 రాశిఫలాలు

Horoscope 24th August : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

Horoscope Today 24th August 2022

మేషం
ఈ రోజు మీకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోపోవడమే మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఖాళీగా కూర్చుని టైమ్ పాస్ చేసేకన్నా చదువుపై దృష్టి సారించడం మంచిది. కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో బాధపడతారు. ఆస్తి సంబంధిత విషయాల ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది.

వృషభం
ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల సహకారం లభిస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేయడంలో ఇబ్బంది ఉండదు. మీ స్నేహితులకు అప్పు ఇవ్వాల్సి వస్తుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ఆలోచనలో ఉంటారు.

మిథునం
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు అవుతుంది. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఆదాయంతోపాటు పలుకుబడి పెరుగుతుంది. మీరు ఎవరినైనా గుడ్డిగా విశ్వసిస్తే...ఆ వ్యక్తి మీ నమ్మకాన్ని వమ్ము చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. 

కర్కాటకం
కార్యాలయంలోని సీనియర్ అధికారులు మీ పనిలో అడ్డంకులు సృష్టించవచ్చు..కానీ వివాదానికి దిగకుండా చాకచక్యంతో పరిస్థితిని చక్కదిద్దుకోండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. శత్రువులు కూడా మీకు వ్యతిరేకంగా వ్యూహాన్ని రూపొందించడంలో విఫలమవుతారు. మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. కొత్త వ్యాపార ప్రణాళికలను ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజు.

Also Read: కన్యారాశిలోకి బుధుడు, ఈ 6 రాశుల ఉద్యోగులు-వ్యాపారులకు విశేష ఫలితం, ఆ రాశులవారికి ఆర్థిక నష్టం

సింహం
ఈ రోజు మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబంలోని ఒక సభ్యుడు బయట ఎక్కడికో ఉద్యోగం కోసం వెళ్లవలసి వస్తుంది. మీరు తల్లిదండ్రులకు చేసిన వాగ్దానాలను సకాలంలో నెరవేర్చండి. పిల్లల అవసరాలు సమయానికి తీర్చండి. కార్యాలయంలో మీదే పైచేయి. 

కన్య
ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. ఇతరులు చెప్పింది ఓపికగా వినండి. కుటుంబంలో కొత్త అతిథి రాకతో కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు పరీక్షల కోసం కష్టపడతారు. ఇతరులను మీ మాటలతో ఆకర్షించడంలో సక్సెస్ అవుతారు. ఇంటి పెద్దలను గౌరవించడం ద్వారా మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి.

తుల
ఈ రోజు మీ ఖర్చులు పెరగడం వల్ల ఆందోళనలు కూడా పెరుగుతాయి. మీ విరోధులు పనిలో అడ్డంకులు సృష్టించవచ్చు. మీ వ్యాపారంలో కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయి. మతపరమైన పనులపై చాలా ఆసక్తిని కనబరుస్తారు. కుటుంబంలో  సమస్యల కారణంగా కార్యాలయంలో పనిపై దృష్టి పెట్టలేరు.మీ శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించనివ్వకండి.

వృశ్చికం
ఆర్థిక పరంగా ఈరోజు మంచి రోజు అవుతుంది. ఆకస్మిక ద్రవ్య లాభాల కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు స్నేహితుని సహాయంతో కొన్ని వ్యాపార ప్రణాళికలను పూర్తి చేస్తారు. ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ రోజు మంచిది. స్టాక్ మార్కెట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు కొన్ని అకస్మాత్తుగా వచ్చి చేరుతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలను వేసుకోవచ్చు.

Also Read: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం

ధనస్సు
ఈ రోజు మీకు మంచి ప్రారంభం అవుతుంది. మీరు కార్యాలయంలో మీ సానుకూల ఆలోచనను సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారం చేసే వ్యక్తులు చాలా కష్టపడి పని చేయాలి. మీ కుటుంబ సభ్యులలో ఎవరితోనైనా వివాదాలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. మీ జీవిత భాగస్వామితో భాగస్వామ్యంతో వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నవారు ఆచితూచి అడుగేయాలి.

మకరం
ఈ రోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది. కొంతమంది మంది వ్యక్తులతో పరిచయాలు వ్యాపారంలో ప్రయోజనం చేకూరుస్తాయి. మీ భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోండి. ప్రైవేట్ ఉద్యోగాల్లో పని చేసే వ్యక్తులు బయట పనులపైనా శ్రద్ధ పెట్టాలి. ఈ రోజు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది.

కుంభం
మీ రంగంలో మార్పులకు ఈ రోజు మంచి రోజు. కార్యాలయంలో మీపై కొంత వ్యతిరేకత ఉండొచ్చు. అధికారులు మీపై కోపంగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వ్యక్తులు ఏదైనా పరీక్ష రాసేందుకు ప్లాన్ చేసుకోండి...మంచి ఫలితం ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తే పెద్ద అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే. స్నేహితుడికి ఇచ్చిన మాటను సకాలంలో నెరవేరుస్తారు.

మీనం
ఈ రోజు మీరు మీ స్నేహితుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ మీ కఠినమైన ప్రవర్తన ఇంట్లో మంచి వాతావరణాన్ని డిస్టబ్ చేస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అనుకూలమైన రోజు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు ప్రశంసలు అందుకుంటారు. మీ పురోగతిని చూసి మీ శత్రువులు కొందరు కలత చెందుతారు. 

Published at : 24 Aug 2022 05:53 AM (IST) Tags: astrology in telugu horoscope today Zodiac Signs aaj ka rashifal 24August 2022 aaj ka rashifal 24th August 2022 astrological prediction for 24 August 2022

సంబంధిత కథనాలు

Kotakonda Durgamma : శ్రీకాకుళం జిల్లాలో దొరల దసరా, వేపచెట్టు వద్ద తురాయి పువ్వు ఎటుపడితే అటు సుభిక్షం!

Kotakonda Durgamma : శ్రీకాకుళం జిల్లాలో దొరల దసరా, వేపచెట్టు వద్ద తురాయి పువ్వు ఎటుపడితే అటు సుభిక్షం!

Ayudha Pooja 2022 : విజయ దశమికి ఆయుధ పూజ ఎందుకు చేస్తారు

Ayudha Pooja 2022 : విజయ దశమికి ఆయుధ పూజ ఎందుకు చేస్తారు

Vijayawada Teppotsavam : కృష్ణానదిలో దుర్గా మ‌ల్లేశ్వర‌స్వామి న‌దీ విహారానికి బ్రేక్, వరుసగా మూడో ఏడాది!

Vijayawada Teppotsavam  : కృష్ణానదిలో దుర్గా మ‌ల్లేశ్వర‌స్వామి న‌దీ విహారానికి బ్రేక్, వరుసగా మూడో ఏడాది!

Tirumala News: తిరుమలలో వైభవంగా ఎనిమిదోవ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Tirumala News: తిరుమలలో వైభవంగా ఎనిమిదోవ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Dussehra Ravan Dahan 2022: దసరా రోజు రావణదహన వేడుకలు ఎందుకు చేస్తారు, దశకంఠుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

Dussehra Ravan Dahan 2022: దసరా రోజు రావణదహన వేడుకలు ఎందుకు చేస్తారు, దశకంఠుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

టాప్ స్టోరీస్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్