ఆగస్టు నుంచి నవంబరు వరకూ ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి



గ్రహాల వక్రగమనం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలిస్తే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలిస్తుంది. దేవగురువైన బృహస్పతి తిరోగమనం ఈ రాశులవారికి ప్రతికూల ఫలితాలనిస్తుంది..



జూలై 28న దేవగురువైన బృహస్పతి మీనంలో తిరోగమనం ప్రారంభమవుతుంది.ఈ తిరోగమన స్థితి నవంబరు 27 వరకూ ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశులవారికి అన్నీ ప్రతికూల పరిస్థితులే...



మేషం
జ్ఞాన కారకుడైన బృహస్పతి మీ రాశి నుంచి 11వ స్థానంలో సంచరించడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు తప్పవు. వ్యాపారులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటారు. కొత్త పెట్టుబడులు పెట్టొద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి.



తులా
తులా రాశికి అధిపతి శుక్రుడు. బృహస్పతికి శుక్రుడు శత్రువుగా పరిగణిస్తారు. అందుకే గురు గ్రహం సంచారం ఈ రాశివారికి ఎంతమాత్రం లాభించదు. ఈ సమయంలో శత్రువుల నుంచి అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి.



ధనస్సు
బృహస్పతి తిరోగమనం ధనస్సు రాశివారికి కూడా మంచి జరగదు. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తప్పవు. మనశ్సాంతి ఉండదు. కుటుంబంలో అనవసర తగాదాలు వచ్చే అవకాశం ఉంది. సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంకండి.



మ‌క‌రం
గురుగ్రహం వక్రగమనం వల్ల ఈ రాశివారికి తలపెట్టిన ప్రతిపనిలోనూ ఆటంకం ఏర్పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల డబ్బు కోల్పోతారు. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టొద్దు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది.



మీనం
మీన రాశివారికి కూడా గురు గ్రహ తిరోగమనం కలసిరాదు. తలపెట్టిన పనుల్లో అడ్డంకులు, అనవసర ఖర్చులు తప్పవు. ప్రతి అడుగులోనూ ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపడం వల్ల కొంతవరకూ ఒత్తిడి తగ్గుతుంది. శుభకార్యాల పర్యటన చేస్తారు.



Note: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…