News
News
X

Horoscope 9th August 2022: ఈ రాశివారు ప్రమాదంలో చిక్కుకోవచ్చు, జాగ్రత్త!

మీ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయని గమనించండి.

FOLLOW US: 

మేషం - మీరు మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ రోజు దానికి మంచి రోజు. మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. కోపాన్ని నివారించండి, అది మీ అనారోగ్యానికి కారణమవుతుంది. జీవిత భాగస్వామితో సమస్యలేవీ ఉండవు. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది.

వృషభం - ఈ రోజు మీ వ్యాపార ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇందుకు మీరు వ్యాపారానికి తగిన ప్రచారం చేపట్టాలి. వాహన ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వల్ల మీరు ఆసుపత్రిపాలు కావచ్చు. కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది.

మిథునం - అధికారుల సహాయం మీకు లభిస్తుంది. తెలియని వ్యక్తులకు సహాయం చేస్తారు. ఇంట్లో అనారోగ్యానికి గురైన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.

కర్కాటకం - ఉద్యోగాలు చేసే వ్యక్తులు, సహోద్యోగులను నిశితంగా గమనించండి. ఈ వ్యక్తులు మిమ్మల్ని విమర్శించవచ్చు. మీ ఇమేజ్‌ను పాడు చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు ఈరోజు ఏదో ఒక మోసానికి గురయ్యే అవకాశం ఉంది. లగ్జరీ వస్తువుల వ్యాపారులు లాభపడగలరు. షుగర్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి.

సింహం - అందరితో కలసి పని చేస్తేనే విజయం లభిస్తుంది. వృద్ధులను, స్త్రీలను గౌరవించండి. ఎవరితోనూ పరుషమైన మాటలు మాట్లాడవద్దు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు ఉండవచ్చు. వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదు. పూర్వీకుల ఆస్తి కలిసివస్తుంది.

కన్య - విద్యార్థుల్లో పోటీతత్వం కనిపిస్తుంది. మీరు కొన్ని పనుల నిమిత్తం బయటకు వెళ్లవలసి రావచ్చు. ఎవరినీ దుర్భాషలాడవద్దు. వ్యాపారంలో లాభం ఉంటుంది. అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. అధిక పని అలసటకు కారణమవుతుంది. మీరు స్నేహితుల మద్దతు పొందవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడతారు.

తుల - ప్రస్తుతం వ్యాపారంలో భాగస్వామ్యం అంత మంచిది కాదు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో పనిచేసేవారు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో ఏదైనా భాగానికి గాయమయ్యే అవకాశం ఉంది. అహంభావాన్ని వదులుకోండి. కొంతమంది స్నేహితుల మధ్య దూరం పెరుగుతుంది. మీ నైపుణ్యం, నాయకత్వ సామర్థానికి ప్రశంసలు లభిస్తాయి. 

వృశ్చికం - ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆఫీసు వాతావరణం సాధారణంగా ఉంటుంది. చిల్లర వ్యాపారులు లాభపడతారు. వ్యాధిని నిర్లక్ష్యం చేయవద్దు, అజాగ్రత్తగా ఉండకండి. కార్యాలయ బాధ్యతలు నిర్వర్తించకపోతే అధికారులు అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. స్త్రీలకు బహుమతులు ఇవ్వండి.

ధనుస్సు - ప్రమోషన్ కోసం వేచి చూడాల్సి వస్తుంది. మందుల వ్యాపారులకు లాభాలు వస్తాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నవారు గుడ్ న్యూస్ వింటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం - మాటలను అదుపులో ఉంచుకోండి, ఎవరితోనైనా వివాదాలు తలెత్తవచ్చు. వ్యాపారంలో నిర్లక్ష్యం మీపై భారంగా ఉంటుంది. అవసరమైన పత్రాలను తమ వద్ద ఉంచుకునే ఎలక్ట్రానిక్ వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. వెన్నునొప్పి, కండరాలు పట్టే అవకాశం ఉంది. బరువులు ఎత్తడం మానుకోండి.

కుంభం -  సోమరితనం వద్దు. అది మీ కెరీర్‌కు అడ్డంకిగా మారుతుంది. ఇంజనీర్లు ప్రమోషన్ పొందవచ్చు. బీమా రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి కస్టమర్లను పొందుతారు. హై బీపీ ఉన్నవారు అజాగ్రత్తగా ఉండకూడదు. ఇంటి మరమ్మతులకు ఖర్చులు ఉంటాయి. 

మీనం - ఇంటి బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఎగుమతి-దిగుమతి వ్యాపారాలు చేసే వారికి అదృష్టం తోడ్పడుతుంది. మీకు అలసటగా, బలహీనంగా అనిపించవచ్చు. పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోండి. వృత్తిలో పురోగతి ఉంటుంది.

Also Read: రక్షా బంధన్ కుడిచేతికి కట్టడం వెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Also Read: పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన వరలక్ష్మీ వ్రత కథ

Published at : 09 Aug 2022 08:20 AM (IST) Tags: Horoscope 9th August 2022: Astrological prediction for Libra Aries and Other Zodiac Signs check Astrological Prediction

సంబంధిత కథనాలు

Navratri 2022:   జ్ఞానానికి అధిపతి అయిన స్కందుడి తల్లి, ఐదోరోజు కాలస్వరూపిణి 'స్కందమాత' దుర్గ

Navratri 2022: జ్ఞానానికి అధిపతి అయిన స్కందుడి తల్లి, ఐదోరోజు కాలస్వరూపిణి 'స్కందమాత' దుర్గ

Navratri 2022: సకల శుభాలను కలిగించే శ్రీ లలితా చాలీసా

Navratri 2022: సకల శుభాలను కలిగించే శ్రీ లలితా చాలీసా

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారు అనుకున్న పనులు పూర్తిచేస్తారు, సెప్టెంబర్‌ 30 న్యూమరాలజీ

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారు అనుకున్న పనులు పూర్తిచేస్తారు, సెప్టెంబర్‌ 30 న్యూమరాలజీ

Horoscope Today 30th September: ఈ రాశులవారిపై లలితా త్రిపుర సుందరి కరుణా కటాక్షాలుంటాయి

Horoscope Today 30th September: ఈ రాశులవారిపై లలితా త్రిపుర సుందరి కరుణా కటాక్షాలుంటాయి

ఈ రాశివారు స్నేహమంటే ప్రాణమిస్తారు, మీ రాశికి ఏ రాశివారితో స్నేహం కుదురుతుందో చూసేయండి

ఈ రాశివారు స్నేహమంటే ప్రాణమిస్తారు, మీ రాశికి ఏ రాశివారితో స్నేహం కుదురుతుందో చూసేయండి

టాప్ స్టోరీస్

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం -  కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ