Sankranti 2026 Date and Time: జనవరి 14 0r 15 మకర సంక్రాంతి ఎప్పుడు? ఈ గందరగోళానికి కారణం ఇదే?
Sankranti 2026 Dates: ఏటా భోగి, సంక్రాంతి, కనుమ... జనవరి 13, 14,15,16 ఈ నాలుగు తేదీల్లో వస్తాయి. ఒక్కోసారి సంక్రాంతి 14న అయితే ఇంకోసారి సంక్రాంతి 15న వస్తుంది. ఈ ఏడాది ఎప్పుడొచ్చింది?

Happy Sankranti 2026 Date Time: ఈ ఏడాది భోగి, సంక్రాంతి, కనుమ... 2026 జనవరి 13, 14, 15 తేదీల్లో వచ్చాయి. అయితే జనవరి 14 సంక్రాంతి అనే ప్రచారం సోషల్ మీడియాలో జరగడంతో సంక్రాంతి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి అనే విషయాలపై కొంత గందరగోళం వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం చూసుకుంటే....
జనవరి 14 బుధవారం - భోగి
జనవరి 15 గురువారం - మకర సంక్రాంతి
జనవరి 16 శుక్రవారం - కనుమ
జనవరి 17 శనివారం - ముక్కనుమ ( కొన్ని ప్రాంతాల్లో)
కొన్ని ప్రాంతాల్లో ఈ ఏడాది సంక్రాంతి జనవరి 14 బుధవారమే జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పంచాంగకర్తల ప్రకారం జనవరి 15 గురువారం మకర సంక్రాంతి.
2026 మకర సంక్రాంతి విషయంలో గందరగోళం ఎందుకు?
సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం ఏ రోజు జరుగుతుందో అదే రోజు మకర సంక్రాంతి జరుపుకుంటారు కొందరు. మరికొందరు మరుసటి రోజును...అంటే..సూర్యోదయ పుణ్యకాలాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. సాధారణంగా సాయంత్రం తర్వాత సంక్రమణం జరిగితే మరుసటి రోజు పండుగ జరుపుకోవడం సంప్రదాయం. వివిధ పంచాంగాల మధ్య వత్యాసం...అందులో పేర్కొన్న సూర్య సంక్రమణ సమయం కారణంగా ఈ ఏడాది సంక్రాంతి తేదీల విషయంలో గందరగోళం ఏర్పడింది. దృక్ పంచాంగం, తెలుగు పంచాంగం, తమిళ పంచాంగం, గుజరాతీ పంచాంగం ఇవన్నీ కొద్దిగా భిన్నంగా లెక్కిస్తాయి అందుకే కొన్ని చోట్ల జనవరి 14, మరికొన్ని చోట్ల జనవరి 15 సంక్రాంతి వచ్చింది.
సూర్య సంక్రమణం సమయం విషయానికొస్తే..
2025 డిసెంబర్ 16న ధనస్సు రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు..జనవరి 14 రాత్రి 8 గంటల 43 నిముషాలకు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే జనవరి 14 బుధవారం రాత్రి మకర సంక్రాంతి ఘడియలు..ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. తెలుగువారు పండుగలన్నీ సూర్యోదయ సమయాన్ని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి..జనవరి 15 గురువారం మకర సంక్రాంతి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజులు కానీ గుజరాత్ లో ఉత్తరాయణం, తమిళనాడులో పొంగల్, పంజాబ్ లో లోహ్రీ అని వేర్వేరు పేర్లతో జరుపుకుంటారు. పండుగకు అనుసరించే పద్ధతి ఒక్కటే
@ భోగభాగ్యాలు కలిగించే భోగి రోజు వేకువజామునే నిద్రలేచి స్నానమాచరించి భోగిమంటలు వేస్తారు. చిన్నారులకు భోగిపళ్లు పోసి దిష్టి తీస్తారు.
@ సంక్రాంతి సమయంలో దైవారాధన ఎంత ముఖ్యమో.. సూర్యుడు సంక్రమణ సమయంలో పితృదేవతలకు తర్పణాలు విడవడం అంతే ప్రాధాన్యం . ఈ రోజు చేసే దానధర్మాలకు అత్యుత్తమ ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు
@ తమ చేతికి వచ్చిన పంట కేవలం తమ కష్టంతోనే కాదు..పశువుల సహకారంతోనే అనే భావనతో రైతులు కనుమ రోజు పశువులకు పూజ చేస్తారు. ఈ రోజు పశువులతో పనిచేయించరు. అలంకరించి పసుపు కుంకుమతో పూజ చేస్తారు
@ సంక్రాంతి సమయంలో వేకువజామునే స్నానం ఆచరించి ఆదిత్య హృదయం పారాయణం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. కనుమ రోజు ఇంటి ముందు రథ ముగ్గు వేసి అందరి ఇంటి ముందూ ఉన్న రథానికి ఉన్న దారాలతో కలుపుకుంటూ ఐకమత్యాన్ని చాటుకుంటారు
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















