Image Credit: Pinterest
Hanuman Jayanti 14th May 2023: వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ - హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని చాలా వివరంగా తెలియజేశాయి. సూర్యుడితో హనుమంతుడికి ఉన్న అనుబంధం ఇంకెవ్వరికీ కనిపించదు.
హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉదయభానుడిని చూశాడు. బాగా ఆకలిగా ఉన్నాడేమో...సూర్యబింబం ఎర్రని పండులా తోచింది. అంతే తినేద్దామని ఉన్నపాటుగా ఆకాశానికి ఎగిరాడు. ఇంద్రుని వజ్రఘాతం వల్ల ఆ ప్రయత్నం విఫలమైంది. ఇదే సూర్యుడికి-ఆంజనేయుడికి మొదటి అనుబంధం.
Also Read: ఈ చిన్న చిన్న పొరపాట్లే దురదృష్టానికి, దారిద్య్రానికి కారణం..!
బాల్యంలోనే కాదు...విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకుని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి విద్య నేర్పించమని అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి చెప్పాడు. కానీ చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకుని శిష్యుడిగా చేసుకోవడానికి సూర్యుడు అంగీకరించాడు. ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేదవేదాంగాలు, ఆరు శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, 64 కళలు అభ్యసించాడని చెబుతారు. మరో కథనం ప్రకారం సూర్యుడి రథానికి ఎదురుగా వెనక్కు సంచరిస్తూ విద్యను అభ్యసించాడంటారు. సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదట కలిసినప్పుడే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించాడు. మైనాకుని వినయంతోను, సింహికను శక్తితోను, సురసను యుక్తితోను జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.
వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎలాంటి ప్రస్తావన లేదు. కానీ కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య. అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉందని చెబుతారు.
సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను, సహాయాన్ని అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే. శ్రీరామునితో పరిచయమైన నాటినుంచి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. సంజీవినిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.
Also Read: కుజుడు-శుక్రుడు సంయోగం, ఈ రాశులవారికి అన్నీ శుభఫలితాలే!
సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహావిష్ణువు అవతారం. హనుమంతుడు శివాంశ సంభూతుడు. అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశవుల అభేదానికి ప్రతీక. హనుమంతుని భవిష్యబ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొన్నాయి. కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకమైనట్టే అని చెబుతారు. సూర్యుడిని కూడా త్రిమూర్తుల స్వరూపంగా శాస్త్రాలు నిర్వచించాయి. అందుకే సూర్యంజనేయులను ద్విగుణీకృతమైన శక్తికి సంకేతంగా అబివర్ణించవచ్చు.
Chanakya Niti - చాణక్య నీతి: ఇలా సంపాదించే డబ్బు అస్సలు నిలవదు!
Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!
Hanuman Sindoor: హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక రహస్యం ఇదే
Laxmi Yog:ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం
Pitru Dosha Symptoms: మీకు ఇలా జరుగుతుంటే పితృ దోషం ఉన్నట్టే !
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
మెగాస్టార్ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ
ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల
SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?