వారఫలాలు: మే 8 నుంచి మే 14 వరకూ రాశిఫలాలు



మేష రాశి
వారం ప్రారంభంలో మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారాలతో సంబంధం ఉన్నవారికి అకస్మాత్తుగా లాభాలొస్తాయి. వ్యాపారం విస్తరిస్తారు.ఉద్యోగులు పదోన్నతి లేదా జీతం పెరుగుదలకు సంబంధించి శుభవార్త వింటారు. వారం మధ్యలో ప్రయాణం చేయాల్సిన అవసరం రావొచ్చు.



వృషభ రాశి
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. జీవితంలో కొన్ని ఆకస్మిక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో, మీరు అవసరానికి మించి విశ్వసించే వ్యక్తుల వల్ల నిరాశ చెందుతారు. అనుకున్న సమయానికి పని పూర్తవదు. ఉద్యోగులకు వారం ప్రారంభంలో అధిక పనిభారం



మిథున రాశి
ఈ వారం ఓ మోస్తరుగా లాభదాయకంగా ఉంటుంది. ఈ వారం మీరు మీ తెలివితేటలు, మాటని సరిగ్గా ఉపయోగించుకోవాలి. పని ప్రాంతంలో వ్యక్తులతో మమేకం అయ్యేందుకు ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాలను విస్మరించడమే మంచిది. ఉద్యోగులు ఈవారం మరింత శ్రమించాల్సి ఉంటుంది.



కర్కాటక రాశి
ఈ వారం శుభఫలితాలు పొందుతారు. కొన్ని ఆందోళనలు తొలగిపోతాయి. ఒక పెద్ద సమస్య నుంచి బయటపడడంతో ఉపశమనం పొందుతారు. కొత్త శక్తితో మీ లక్ష్యాన్ని సాధించడానికి దూసుకుపోతారు. విదేశాల్లో చదువులు, వ్యాపారాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం చివరి నాటికి శుభవార్త అందుతుంది.



సింహ రాశి
ఈ రాశివారికి ఈ వారం శుభదాయకం. వారం ప్రారంభంలో వృత్తి-వ్యాపారానికి సంబంధించిన ఏదైనా పెద్ద విజయం లేదా దానికి సంబంధించిన మంచి సమాచారం లభిస్తుంది. ఆరోగ్యం, ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది



కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ వారం అదృష్టం కలిసొస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు కలిసొస్తాయి. సమర్థవంతమైన వ్యక్తి సహాయంతో మీరు కెరీర్ పరంగా ఓ అడుగు ముందుకువేస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది



తులా రాశి
ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. మీ శ్రేయోభిలాషులను సంప్రదించకుండా వృత్తి, వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగస్తులకు పనిభారం ఎక్కువగా ఉన్నప్పుడు వారం ప్రారంభంలో కొంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది.తులా రాశి

తులా రాశి జాతకులకు ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. మీ శ్రేయోభిలాషులను సంప్రదించకుండా వృత్తి, వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగస్తులకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీకు శారీరక మరియు మానసిక అలసట ఉంటుంది.



వృశ్చిక రాశి
ఈ వారం కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వారం ప్రారంభంలో గృహ, వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఒక పనిలో జాప్యం మీలో కోపాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మందగమనం ఉండవచ్చు



ధనుస్సు రాశి
వారం ప్రారంభంలో మీరు మీ వృత్తి-వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు. మీ స్థానం, పేరుప్రఖ్యాతులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీరు కొంత కాలంగా ఒక సమస్యతో బాధపడుతుంటే అది ఈ వారం పరిష్కారం అవుతుంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఫలిస్తాయి.







కుంభ రాశి
ఈ వారం కుంభ రాశి వారికి శుభాలు కలుగుతాయి. మీరు ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడం లేదా ప్రత్యేక అవకాశం పొందడం కోసం కొంతకాలంగా వేచి ఉంటే, ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది. ఈ వారం మీరు మీ తెలివితేటలు మరియు విచక్షణాబలంతో అతిపెద్ద పనిని సులభంగా చేయగలుగుతారు.



మీన రాశి

ఈ రాశివారు ఈ వారం తమ వృత్తి లేదా వ్యాపారంలో మార్పు గురించి ఆలోచిస్తుంటే జాగ్రత్తగా అడుగేయాలి. తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత బాధపడక తప్పదు. ఉద్యోగస్తులు శారీరక, మానసిక అలసటకు గురవుతారు. పూర్వీకుల ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు ఎదురవుతాయి.