By: RAMA | Updated at : 07 Apr 2023 07:34 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pixabay
Good Friday 2023: క్రైస్తవులు జరుపుకునే ప్రధాన వేడుకల్లో గుడ్ ఫ్రైడే ఒకటి. క్రీస్తు జీవన క్రమంలో ప్రధానంగా మూడు వేడుకలు. క్రిస్మస్ ... క్రీస్తు జననానికి సంబంధించినది. ఆ తరువాత నిర్వహించుకునే వేడుక గుడ్ ఫ్రైడే - ఇది క్రీస్తు మరణానికి సంబంధించినది. మూడోది ఈస్టర్ - మరణించిన క్రీస్తు పునరుత్థానం పొందిన రోజు. ఈ మూడూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు నిర్వహించుకునే ప్రధాన మహోత్సవాలు..ఈ రోజు గుడ్ ఫ్రైడే....
'గుడ్ 'అని ఎందుకంటారు
లోకానికి కావలసిందేమిటో ఏసు ప్రభువు బోధించాడు. చెప్పినా అర్థం కాదేమోనని వాటిని తాను స్వయంగా ఆచరించి చూపాడు. ఇంకా అర్థం కాలేదని అద్భుతాలు చేశాడు. అయినా అర్థం కానివారి కోసం తన మహిమలేవీ ప్రకటించకుండా... సాదా సీదా మనిషిలా ప్రాణాలు అర్పించాడు. అదే ఈ గుడ్ ఫ్రైడే. ఆ తరువాత తనదైన సహజ దైవశక్తితో మరణం నుంచి తిరిగి లేచాడు..అంటే పునరుత్థానం పొందాడు...అదే ఈస్టర్. ఏసు మరణానికి సంబంధించినది కదా..‘బ్యాడ్ ఫ్రైడే’ కావాలి కదా! మరి అశుభాన్ని... ‘గుడ్’ అని ఎందుకు అంటారని అడగొచ్చు..నిజమే కాని.. గుడ్ ఫ్రైడే తరువాత వచ్చే ఆదివారం... అంటే ఈస్టర్ నాటి శుభోదయాన క్రీస్తు పునరుత్థానం చెంది తన మహిమను లోకానికి వెల్లడించడానికి దోహదపడిన రోజు. ఆయన త్యాగపూరిత మరణానికి కారణమైన రోజు కనుకే ఈ శుక్రవారం శుభకరమైంది. ‘గుడ్ ఫ్రైడే’ అంటున్నారు కానీ వాస్తవానికి ‘గాడ్ ఫ్రైడే’ అంటారు.
Also Read: మానసిక ఇబ్బందులు, వైవాహిక జీవితంలో వివాదాలు - శుక్రుడి సంచారం ఈ 6 రాశులవారికి అస్సలు బాలేదు
అయితే అన్ని పండుగలకు హ్యాపీ ఉగాది, హ్యాపీ రంజాన్, హ్యాపీ కిస్ట్రమస్ చెప్పినట్టు గుడ్ ఫ్రైడే రోజు శుభాకాంక్షలు చెప్పరు. కారణం గుడ్ ఫైడే ఆనందంతో జరుపుకునే వేడుక కాదు, తమ దేవుడు యేసుకు సంతాపాన్ని తెలియజేసే పవిత్ర దినం. అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించరు. బైబిల్ ప్రకారం దేవుని బిడ్డ అయిన యేసును కొట్టి, శిలువ వేశారు. ఆయన శిలువపైన మరణించారు. ఒక పెద్ద అరుపుతో తన చివరి శ్వాసన విడిచిపెట్టారు. అప్పుడు లోకమంతా చీకటిగా మారిపోయిందని, పెద్ద భూకంపం వచ్చినట్టు భూమి కంపించిందని చెప్పుకుంటారు. యేసును శిలువ వేసిన ఏ రోజు ఏరోజన్నది కచ్చితంగా ఏకాభిప్రాయం లేదుకానీ శుక్రవారమే ఇది జరిగిందని చెబుతారు.
గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులంతా చర్చిని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఉపవాసాలు పాటిస్తారు. కొన్నిచోట్ల క్రీస్తు శిలువ ఘటనను స్క్రిట్ రూపంలో ప్రదర్శిస్తారు. ఇది యేసు జీవితంలోని చివరి ఘట్టం కనుక దీన్ని ‘పాషన్ ఆఫ్ జీసస్’ అని కూడా పిలుస్తారు. గుడ్ ఫ్రైడేను హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు.
Also Read: వృషభ రాశిలో ప్రవేశించిన శుక్రుడు, ఈ 6 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
పాపభూయిష్టమైన నరుడి దుష్ప్రవర్తన త్యాగపూరితం కావాలి. ప్రేమభరితం కావాలి. సేవారూపంలోకి పరిణామం చెందాలి. తమలోని చెడును తొలగించుకుని పరిపూర్ణ మానవుడిగా పునరుత్ధానం చెందాలి. ఏసు త్యాగానికి గుడ్ ఫ్రైడేకి అదే సార్థకత.
Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!
జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం
జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!
Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!
Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు