By: ABP Desam | Updated at : 02 May 2023 07:06 AM (IST)
దీర్ఘాయుష్షు కోసం గరుడ పురాణంలోని ఈ 2 మంత్రాలను జపించండి (Representational Image/freepik)
Also Read: ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసా, ఎప్పటికీ గొడవపడకూడనిది వీరితోనే!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గరుడ పురాణంలో పేర్కొన్న మంత్రాలను క్రమం తప్పకుండా జపించడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. దీన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల రోగాల నుంచి విముక్తులవుతారని, దీర్ఘాయుష్షును పొందుతారని, ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందవచ్చని చెబుతారు.
ఒక వ్యక్తి ఎప్పుడూ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ, పేదరికాన్ని ఎదుర్కొనే స్థితిలో ఉంటే, అటువంటి పరిస్థితిలో మీరు గరుడ పురాణంలో ప్రస్తావించిన 'ఓం జూమ్ సః' అనే శక్తివంతమైన మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించాలి. నిత్యం ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడతారని చెబుతారు. దీనితో పాటు, మీరు ప్రతిరోజూ 6 నెలల పాటు శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. దీనితో, వ్యక్తి డబ్బుకు సంబంధించిన అనేక సమస్యల నుంచి త్వరలో ఉపశమనం పొందుతాడు.
మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కావాలంటే, మీరు గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు చెప్పిన "యక్షి ఓం స్వాహా" అనే మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి. ఇది గరుడ పురాణంలోని సంజీవిని మంత్రం. దీన్ని పారాయణం చేయడం వల్ల మీ ఆరోగ్య సమస్యలన్నీ నయమవుతాయి. మీరు మంచి ఆరోగ్యం కూడా పొందుతారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనిషికి దీర్ఘాయుష్షు కూడా లభిస్తుంది. అయితే, ఈ మంత్రాన్ని చదివేటప్పుడు గురువుల సలహాను స్వీకరించి, ఆపై మంత్రాన్ని పఠించడం మంచిది.
Also Read: మహాభారతం నేర్పే ఐదు జీవిత పాఠాలు
గరుడ పురాణంలో పేర్కొన్న ఈ రెండు సాధారణ మంత్రాలలో ఒకటి మీ డబ్బు సమస్యలను తొలగిస్తే, మరొక మంత్రం మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును ప్రసాదించడంలో సహాయపడుతుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించగలరు.
Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!
Chanakya Neeti In Telugu: కష్టకాలంలోనే వీరి నిజ స్వరూపం తెలుస్తుంది..!
Jyeshta Maas Food: జ్యేష్ఠ మాసంలో ఇలాంటి ఆహారం తీసుకుంటే కష్టాలే!
జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం
Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్