Garuda Purana: ఈ లక్షణాలు ఉన్నవారు ఆర్థిక సమస్యలు, అనారోగ్యంతో బాధపడకతప్పదు!
Garuda Purana: గరుడ పురాణం పేదలు, దురదృష్టవంతులు, రోగుల లక్షణాలను ప్రస్తావిస్తుంది. గరుడ పురాణం ప్రకారం బీదరికంతో పాటు, సుఖ సంతోషాలు లేని వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయి.?
Garuda Purana: అష్టాదశ పురాణాల్లో ఒకటైన గరుడపురాణాన్ని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు తన సారథి అయిన గరుత్మంతునికి ఉపదేశించగా, వేదవ్యాసుడు రచించారు. ఇందులో మరణానంతరం ఆత్మప్రయాణం గురించి మాత్రమే కాదు...జీవి పుట్టుక, జీవితంలో అనుసరించాల్సిన మార్గం గురించి జ్ఞానాన్ని అందిస్తుంది. అంతే కాదు, ఒక వ్యక్తి విజయానికి దోహదపడే ఆలోచనల గురించి కూడా సమాచారం ఇస్తుంది. అదేవిధంగా గరుడ పురాణంలో పేదవాడి లక్షణాలు, దుఃఖం లేని వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలేంటో చెప్పారు. అవేంటో చూద్దాం...
వీళ్లు గొప్పవారు
గరుడ పురాణంలో శ్రీ మహా విష్ణువు గొప్ప వ్యక్తులు ఎలా ఉంటారో వర్ణించాడు. గరుడ పురాణం ప్రకారం, ఏ పరిస్థితుల్లోనైనా ఆందోళన చెందకుండా అలసటకు గురవని వ్యక్తి గొప్ప వ్యక్తి అని గరుడుడికి వివరించాడు. ఇలాంటి వ్యక్తులు కనిపిస్తే మీరు ఎలాంటి సందేహం లేకుండా సహవాసం చేయవచ్చు.
Also Read : గరుడ పురాణం ప్రకారం రోజుని ఇలా ప్రారంభిస్తే మీకు అపజయం అనేదే ఉండదు!
ఉత్తముడి లక్షణం
ఎవరి పనులు, మాటలు మృదువుగా ఉంటాయో, ఎవరి రక్తం కమలం లోపలి భాగంలా స్వచ్ఛంగా ఉంటుందో, ఎవరి వేళ్లు అందంగా ఉంటాయో, ఎవరి గోర్లు రాగి రంగులో ఉంటాయో, అలాంటి వ్యక్తిని అద్భుతమైన వ్యక్తిగా పరిగణిస్తారు. అలాంటి వ్యక్తులు ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోరు. ఎవరి పాదాలు అందంగా, పగుళ్లు లేకుండా ఉంటాయో, కాలి వేళ్లు అందంగా ఉంటాయో అలాంటి వ్యక్తిని ఉత్తములుగా పరిగణిస్తారు.
సంతోషకరమైన వ్యక్తి
మృదువైన శరీరం, ప్రశాంతమైన మనసు, మాటలు, కుదురైన ప్రవర్తన లేని వ్యక్తి సంతోషంగా ఉండడు. ఇలాంటి వారి శరీరం కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది. అలాంటి స్త్రీ లేదా పురుషుడు అసంతృప్త స్వభావం కలిగి ఉంటారని భావిస్తారు. వీలైనంత వరకు వారికి దూరంగా ఉండటం మంచిది.
ఇలాంటి వారు పేదవారు
తెల్లటి గోర్లు, అనారోగ్య సిరలు, కోణాల పాదాలు, విచిత్రమైన ఆకారంలో వేళ్లు ఉన్నవారు పేదవారిగానే ఉంటారు. ఈ వ్యక్తులు జీవితంలో నాణ్యత కూడా చాలా తక్కువ. అలాంటి లక్షణాలు ఉన్న స్త్రీ పురుషులు మీ చుట్టూ ఉండవచ్చు. వారిని ముఖ్యంగా మీ జీవితంలోకి ఆహ్వానించవద్దు.
Also Read : గరుడ పురాణం - మరణ సమయంలో స్వరం ఎందుకు పోతుందో తెలుసా?
రోగుల లక్షణాలు
బలహీనమైన కీళ్లతో, శరీరంలో కండ పుష్ఠి లేని వ్యక్తి అనారోగ్యంతో ఉన్నట్టేనని చెబుతోంది గరుడ పురాణం. అలాంటి వారి మనసులో ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన ఉంటుంది. ఎంత కష్టపడినా ఆరోగ్య సమస్యల పరిష్కారానికే డబ్బు మొత్తం వెచ్చిస్తారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.