అన్వేషించండి

Dreaming Temple: క‌ల‌లో ఆల‌యం క‌నిపించిందా - మీ జీవితంలో క‌లిగే మార్పులు ఇవే!

Dreaming Temple: ఆలయ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత, మనస్సు స్వచ్ఛంగా మారుతుంది. మనకు కలలో గుడి, గుడిలో పూజలు, గంటలు మోగడం, మంత్రోచ్ఛారణ వంటివి కనిపిస్తే వాటి అర్థం ఏమిటి? అలాంటి కలలు మనకు మంచి సంకేతమా?

Dreaming Temple: కలలు కనడం ఒక సాధారణ ప్రక్రియ. కలలలో కనిపించే విషయాలు ప్రత్యేక ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. కలలు మనకు గతం, భవిష్యత్తు గురించి సమాచారాన్ని ఇస్తాయని స్వ‌ప్న శాస్త్రం చెబుతోంది. అందుకే ప్రాచీన కాలంలో రాజులు స్వప్న పండితులను తమ‌ ఆస్థానంలో ఉంచుకునేవారు. దీని ద్వారా రాజులు తమ కలలకు అర్థాన్ని తెలుసుకునేవారు. కొన్ని కలలను మనం మరచిపోలేము, కొన్నింటిని గుర్తుంచుకోలేము. తరచుగా మీరు మీ కలలో గుడి లేదా గుడి గంటలు మోగడం చూసి ఉండవచ్చు. దేవాలయం మన ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు కేంద్రం. అటువంటి పరిస్థితిలో, కలలో గుడి లేదా గుడి గంట మోగించడం అంటే ఏమిటి? కలలో గుడి, గుడి గంటలు కనిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా?

Also Read: పెళ్లిలో వధూవరులు 7 అడుగులు ఎందుకు వేస్తారు? అంత అర్థముందా?

కలలో దేవాలయం క‌నిపిస్తే
స్వ‌ప్న శాస్త్రం ప్రకారం, మీకు కలలో దేవాలయం కనిపిస్తే, అది శుభసూచకంగా పరిగణిస్తారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మీ పని త్వరగా పూర్తవుతుందని అర్థం. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు కలలో దేవాలయం కనిపిస్తే, మరుసటి రోజు ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు చేసి, దానం చేయండి, ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి.

పురాత‌న ఆలయం క‌నిపిస్తే
మీకు కలలో పురాత‌న‌ దేవాలయం కనిపిస్తే భయపడాల్సిన పనిలేదు. కలలో పురాత‌న‌ ఆలయాన్ని చూడటం మంచిదని చెబుతారు. మీ పాత స్నేహితుడు అకస్మాత్తుగా మీ ముందు కనిపిస్తారని అలాంటి కలలు సూచిస్తాయి. ఆ స్నేహితుడిని క‌ల‌వ‌డం ద్వారా మీరు అదృష్టవంతులు అవుతారు. మీరు చేప‌ట్టిన‌ అనేక పనులు అతని సహాయంతో పూర్తి చేస్తారు.

కలలో ఆలయ పూజ
స్వప్న శాస్త్రం ప్రకారం మీరు దేవాలయంలో పూజలు చేస్తున్నట్లు కనిపిస్తే అది శుభసూచకంగా పరిగణించాలి. మీరు ఎన్ని క‌ష్టాల్లో కూరుకుపోయి ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు, భగవంతుని దయతో మీకు త్వ‌రలోనే ఊహించ‌ని మంచి జరుగుతుంద‌ని ఈ క‌ల సంకేతం.

కలలో గుడి గంట
కలలో గంటను మోగించడం లేదా గంటను చూడడం లేదా గంట శబ్దం వినడం శుభ సంకేతంగా పరిగణించాలి. ఈ కల చేస్తున్న‌ ప్రయత్నాల్లో విజయానికి సూచిక. త్వరలో మీకు శుభవార్త అందుతుందని అర్థం. మీరు ఏ పని కోసం ప్రయత్నిస్తారో, ఆ పనిలో మీరు గొప్ప విజయాన్ని పొందుతారు.

కలలో గుడికి వెళ్లడం
మీరు మీ కలలో ఆలయానికి వెళ్లడం లేదా ఆలయ మెట్లు ఎక్కడం చూసినట్లయితే, అలాంటి కలలు కూడా మంచి సంకేతంగా పరిగణించాలి. మీ సమీప భవిష్యత్తులో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయ‌ని దీని అర్థం. మరోవైపు, మీరు క‌ల‌లో మంత్రాలు కూడా విన్న‌ట్ల‌యితే, మీరు ఇప్ప‌టివ‌ర‌కు ఏదైనా మొక్కు నెరవేర్చకుండా ఉంచినట్లయితే, త్వరగా చెల్లించండి.

Also Read : మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? లక్ష్మీదేవి కటాక్షించబోతోందని అర్థం!

కలలో ఆలయం నుండి కింద పడటం
మీరు వెళ్లిన ఆలయాన్నే కలలో కూడా చూసినట్లయితే, దేవుడు మిమ్మల్ని అనుగ్రహించాడని అర్థం. అందుకే మళ్లీ ఆ గుడికి వెళ్లి పూజ చేయండి. మరోవైపు, మీరు మీ కలలో ఆలయం నుండి కింద పడటం చూస్తే, అది మంచి సంకేతం కాదు. మీ తప్పుడు పనుల వల్ల మీరు జీవితంలో సమస్యలను ఎదుర్కోవచ్చు అని దీని అర్థం.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Embed widget