అన్వేషించండి

Saptapadi: పెళ్లిలో వధూవరులు 7 అడుగులు ఎందుకు వేస్తారు? అంత అర్థముందా?

Saptapadi Meaning: హిందూ వివాహ వేడుకలో సప్తపది అంటే వధూవరులు పరస్పర వాగ్దానం ద్వారా వేసే 7 అడుగులకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. సప్తపదిలోని 7 అడుగులు వేటికి సంకేతం? 7 అడుగుల అర్థ‌మేమిటో తెలుసా?

Saptapadi Meaning: హిందూ సంప్ర‌దాయంలో పాటించే వివాహ ఆచారాలు ప్రపంచంలోనే అత్యంత అరుదైన‌వి, పవిత్రమైనవి. వివాహం స్వచ్ఛతకు చిహ్నం. హిందూ ధ‌ర్మంలో 16 ఆచారాలు ఉన్నాయి, వాటిలో ఒకటి వివాహం. ఒక వ్యక్తి జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలలో వివాహం ఒకటి. పసుపు కొట్ట‌డం, మెహందీ స‌హా అనేక ఇతర ఆచారాలను హిందూ వివాహాలలో పాటిస్తారు. ఇందులో ‘సప్తపది’ పరమ పవిత్రమైనది. వధూవరులు హోమ గుండం చుట్టూ 7 ప్రదక్షిణలు చేయడం ద్వారా ఒకరికొకరు బాధ్యత వహిస్తారు. సప్తపదిలో వధూవరులు తీసుకునే 7 బాధ్యతలు లేదా ప్ర‌మాణాలు ఏమిటో తెలుసుకుందాం.

మొదటి అడుగు
తాను ఇప్పటి నుంచి చేసే ఏ కర్మలోనైనా భార్య‌ను భాగస్వామిని చేస్తాన‌ని మొదటి ప్ర‌ద‌క్షిణ‌లో పెళ్లికొడుకు ప్ర‌మాణం చేస్తాడు. ప్రతి పూజా-హవనంలో ఆమెను అర్థాంగిగా చేసుకుని, తాను ఏదైనా పుణ్య‌కార్యానికి వెళితే, త‌న‌తో తీసుకెళ్లడానికి అంగీకరించాల‌ని వ‌ధువును కోర‌తాడు. ఏ రకమైన ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన పనిలోనైనా, నేను మీ ఎడమ ప‌క్క‌నే ఉంటూ, నా బాధ్యతలను పూర్తి భక్తితో, శ్ర‌ద్ధ‌తో నిర్వహిస్తానని వధువు వరుడికి మొదటి ప్ర‌మాణం చేస్తుంది. 

రెండవ అడుగు
రెండవ అడుగులో, మీరు మీ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తారో, ఈ రోజు నుంచి నా తల్లిదండ్రులను కూడా అదే విధంగా గౌరవించాలి, కుటుంబ గౌరవాన్ని జాగ్రత్తగా చూసుకోవాల‌ని వ‌రుడు వ‌ధువును కోర‌తాడు. దీనికి అంగీక‌రిస్తే, త‌న‌తో తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెబుతాడు. మీ కుటుంబాన్ని నేను చూసుకుంటానని వధువు వరుడికి మరో ప్ర‌మాణం చేస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ గౌరవం ఇస్తానని ఆమె హామీ ఇస్తుంది.

మూడవ అడుగు
ఒక వ్యక్తి జీవితంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే మూడు దశలు ఉన్నాయని, ఈ మూడు దశలలో నాతో ఉంటూ, అన్ని వేళ‌ల్లో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, నేను 3 వ అడుగు వేస్తానని వ‌రుడు వ‌ధువుకు చెబుతాడు. దానికి ప్రతిగా, నా జీవితాంతం నీకు సేవ చేస్తానని, నీకు నచ్చిన ఆహారాన్ని తయారు చేసి అందించడం నా కర్తవ్యం అని వధువు ప్ర‌మాణం చేస్తుంది.

నాలుగో అడుగు
పెళ్లి తర్వాత మా కుటుంబ బాధ్యతలన్నీ మీపైనే ఉంటాయి. మా ఇంటి బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌లో మీరు ఎల్లప్పుడూ నాతో ఉండటానికి సిద్ధంగా ఉంటే, నేను ఖచ్చితంగా నాలుగో అడుగు వేస్తాను అని వ‌రుడు వ‌ధువ‌కు ప్ర‌మాణం చేస్తాడు. వధువు 16 ఆభరణాలను ధరించి, పూర్తి అంగీకారంతో వరుడికి సంపూర్ణ మ‌ద్ద‌తు తెలుపుతూ నాలుగో ప్రదక్షిణ చేస్తుంది. మీ మనస్సుతో, మాటతో, కర్మతో చేసే అన్ని కార్య‌క్ర‌మాల్లో నేను మీకు మద్దతు ఇస్తాను అని వ‌రుడికి ప్ర‌మాణం చేస్తుంది.

ఐదవ అడుగు
మీరు చేసే వ్యాపారంలో, మీరు చేసే ప్రతి ఖర్చులో మీ భాగస్వామిగా న‌న్ను చేసుకోండి.. అంటే డబ్బుకు సంబంధించిన ఏ కార్యకలాపమైనా నేను మీకు అండ‌గా ఉంటాన‌ని వ‌రుడు వ‌ధువుకు ప్ర‌మాణం చేస్తాడు. త‌న ప్ర‌తిపాద‌నకు అభ్యంతరం లేకపోతే మీతో ఐదవ అడుగు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అడుగుతాడు. అందుకు ప్ర‌తిగా.. మీ జీవితంలో ఎలాంటి సంతోషం, విచారం జరిగినా, నేను ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తానని వ‌ధువు హామీ ఇస్తుంది. నేను మీకు దుఃఖంలో శాంతిని, ఆనందంలో నవ్వును ఇస్తానని ఐద‌వ ప్ర‌ద‌క్షిణ‌లో చెబుతుంది. మ‌రో మనిషి ముందు ఎప్పుడూ చిన్నచూపు చూడనని ప్ర‌మాణం చేస్తుంది.

ఆరవ అడుగు
ఆరవ అడుగులో వేరెవ‌రి ముందు నన్ను అవమానపరచకూడదు. పెళ్లయిన తర్వాత ఎలాంటి మత్తు పదార్థాలు, జూదం ఆడకూడదు. దీనికి మీరు అంగీకరిస్తే తదుపరి అడుగు మీతోనే వేస్తానని వ‌ధువుకు వ‌రుడు ప్ర‌మాణం చేస్తాడు. జీవితాంతం నీ తల్లిదండ్రులకు సేవ చేస్తాను. మీ ఇంటికి వచ్చిన అతిథులందరినీ నేను గౌరవిస్తాను. వారికి సేవ చేయ‌డంలో ఎలాంటి లోపం జ‌ర‌గ‌నివ్వను. నువ్వు ఎక్కడున్నా నేను నీతోనే ఉంటానని వ‌ధువు వ‌రుడికి ప్ర‌మాణం చేస్తుంది.

Also Read : పెళ్లిలో సుముహూర్తం అంటే ఏంటి - జీలకర్ర బెల్లమే ఎందుకు పెడతారు!

ఏడవ అడుగు
ఇది వివాహానికి సంబంధించిన ఏడవది, చివరి ప్ర‌మాణం. ఈ వివాహం తర్వాత మీరు ప్రపంచంలోని ఇతర పురుషులందరినీ తండ్రిగా, సోదరులుగా చూడాల‌ని వ‌ధువును కోర‌తాడు. అంటే నా స్థానంలో నువ్వు నన్ను తప్ప మరే మనిషిని చూడకూడదు. మన మధ్య బంధంలో మరెవరికీ భాగస్వామ్యం ఉండకూడదు. మీరు దీనికి అంగీకరిస్తేనే మీతో ఈ చివరి అడుగు వేస్తాన‌ని వ‌రుడు వ‌ధువుకు చెబుతాడు. ఈ సంద‌ర్భంగా వధువు తాను ఎల్లప్పుడూ మీతో ఉంటానని ధర్మం, అర్థ, కర్మ విషయాలలో మీ ఆదేశాలను పాటిస్తానని వరుడికి ప్ర‌మాణం చేస్తుంది. ఇక్కడ అగ్ని సాక్షిగా మీ తల్లిదండ్రులు, బంధువులందరి సమక్షంలో, నిన్ను నా భర్తగా అంగీకరించి, నా శరీరం, మనస్సు, సంపదను మీకు సమర్పిస్తున్నాన‌ని చెబుతుంది.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

Also Read : మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget