Thiruppavi pasuralu: తిరుప్పావై డిసెంబర్ 22, 23, 24...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
Dhanurmasam Special: డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ నెలరోజులు వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై పారాయణ జరుగుతుంది. అందులో మొత్తం 30 పాశురాలుంటాయి.. 7,8,9 పాశురాలు వాటి అర్థం ఇక్కడ తెలుసుకోండి

Dhanurmasam Special Thiruppavi pasuram : ధనుర్మాసం నెలరోజులు ఆలయాల్లో పాశురాలు ఆలపిస్తారు.. గోదాదేవి రాసిన ఈ 30 పాశురాలు తిరుప్పావై అని పిలుస్తారు. ఇప్పటికే 1 నుంచి 6 పాశురాల గురించి కథనాలు ఇచ్చాం. ఈ కథనంలో 7, 8, 9పాశురాలు - వాటి భావం తెలుసుకుందాం..
తిరుప్పావై ఏడోరోజు పాశురం ( డిసెంబర్ 22 ఆదివారం)
కీశు కీశెన్ఱెజ్గు మానైచ్చాత్త జ్గలన్దు
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయా పేయ్ ప్పెణ్ణే!
కాశుమ్ పిఱప్పుమ్ కలగలప్పక్కై పేర్తు
వాశ నరుజ్గళ లాయ్ చ్చియర్; మత్తినాల్
ఓశైప్పడుత్త త్తయిరరవమ్ కేట్టిలైయో
నాయకప్పెణ్పిళ్లాయ్! నారాయణన్ మూర్తి
కేశవనైప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
తేశముడై యాయ్! తిఱ వేలోరెమ్బవాయ్
భావం: భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న అందమైన ధ్వని వినపడడం లేదా..అదిగో సువాసనలు వెదజల్లే కురులున్న ఆ గోప కాంతలు ధరించిన ఆభరణాల సవ్వడి చేస్తూ పెరుగు చిలుకుతున్నారు..అవి వినపడలేదా...ఇంకా నిద్రపోతున్నావా.. ఇకనైనా లేచిరామ్మా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేందుకు అని ఓ గోపకన్యను లేపుతోంది ఆండాళ్..
Also Read: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ సందడి .. 5 రోజుల పాటూ ఆర్జిత సేవలు రద్దు - భక్తులకు ఉచిత అన్న ప్రసాదం!
తిరుప్పావై ఎనిమిదోరోజు పాశురం ( డిసెంబర్ 2౩ సోమవారం పాశురం)
కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱు వీడు
మేయ్ వాన్ పరన్దనకాణ్! మిక్కుళ్ళపిళ్ళైగళుమ్
పోవాన్ పొగిన్ఱారై ప్పోగామల్ కాత్తున్నై
కూవువాన్ వన్దు నిన్ఱోమ్; కోదుకల ముడైయ
పావాయ్! ఎళున్దిరాయ్, పాడిప్పఱై కొణ్డు
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాది దేవనైచ్చెన్ఱు నామ్ శేవిత్తాల్
ఆవా వెన్ఱారాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్.
భావము: తూర్పు దిక్కునున్న ఆకాశం మొత్తం వెలుగొచ్చేసింది. పశువులు మేతకు బయలుదేరుతున్నాయ్. గోపికలంతా శ్రీకృష్ణుడిని దర్శనభాగ్యం కోసం తరలివెళుతున్నారు. అందరం కలసి గోష్టిగ వెళ్లడం మంచిదని ఎరిగి నిన్ను కూడా పిలుద్దామని వచ్చాం. నీక్కూడా శ్రీ కృష్ణుడిని చూడాలన్న కుతూహలం ఉంది కదా..ఇంకా ఆలస్యం ఎందుకు? లెమ్ము.. శ్రీ కృష్ణుని రాకకముందే మనం ఆయన సన్నిధికి పోదాం. అయ్యో మీరు నాకన్నా ముందుగానే వచ్చారే అంటూ మన అభీష్టములు వెంటనే నెరవేర్చును..
Also Read: మహా కుంభమేళా కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు .. ఉచిత రైలు ప్రయాణం నిజమా!
తిరుప్పావై తొమ్మిదో రోజు పాశురం (డిసెంబర్ 24 మంగళవారం పాశురం)
తూమణి మాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ
తూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై యెళుప్పీరో! ఉన్ మగళ్ దాన్
ఊమైయో? అన్ఱిచ్చెవిడో? ఆనన్దలో
ఏమప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో?
"మామాయన్, మాదవన్; వైగున్దన్" ఎన్ఱెన్ఱు
నామమ్ పలవుమ్ నవి న్ఱేలో రెమ్బావాయ్!
భావము: నిర్దోషమలైన మాణిక్యాలతో నిర్మించిన భవనంలో చుట్టూ దీపాలు వెలుగుతుండగా అగరు ధూపాల పరిమళాలను వెదజల్లుచుండగా హంసతూలికా తల్పంపై నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా.. మణులతో వెలిగిపోతున్న నీ భవనపు ఘడియలు తీయవమ్మా ... ఏవమ్మా మేనత్తా ఆమెను నిద్రలేపు..నీ పుత్రిక మూగదా, చెవిటిదా, బద్ధకస్తురాలా..ఇంత మైమరిచి నిద్రపోతోంది ఏమైనా మంత్రం వేశారా అంటూ నిద్రిస్తున్న ఓ కన్యను ధనుర్మాస వ్రతానికి మేల్కొలుపుతోంది ఆండాళ్!
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
8వ పాశురంలో గోపికలను నిద్రలేపుతున్న గోదాదేవి.. 9 నుంచి 12 పాశురాల్లో ప్రకృతి గొప్పదనం, ధ్యానం విశిష్టత గురించి వివరిస్తుంది. ఎప్పుడూ శ్రవణం , మననం వల్ల మనస్సు పవిత్రం అవుతుంది, నిర్మలం అవుతుందని పాశురాల్లో వివరణ ఉంది. మాలిన్యం తొలగినప్పుడే కదా జ్ఞానం..ఆ జ్ఞానమే జీవికి కవచంగా మారుతుంది.




















