అన్వేషించండి

దసరా వేడుకల్లో గార్బా, దాండియా డ్యాన్సుల ప్రత్యేకతలు తెలుసా? రెండిటికీ తేడా ఇదే!

ఈ రోజుల్లో పెళ్లిల్లు, వేడుకల్లో ప్రదర్శిస్తున్న దాండియా, గర్బా డ్యాన్సుల వెనుక పెద్ద కథే ఉంది. మరి, ఆ డ్యాన్సుల ప్రత్యేకతలు ఏమిటో చూసేయండి మరి.

మన దేశంలో నవరాత్రి తొమ్మిది రోజుల పాటు సాగే పండగ. ఈ పండగ కోసం ఏడాదంతా వేచి ఉంటారు భారతీయులు. దేశమంతా వివిధ సంస్కృతుల్లో, వివిధ పద్ధతుల్లో నవరాత్రి జరుపుకుంటారు. ఉత్తర భారతదేశం అంతా కూడా చాలా కోలాహలంగా దేవి మంటపాలు నెలకొలిపి తొమ్మిదిరోజుల పాటు శోభాయమానంగా పండగ చేస్తారు. దేవీ పూజతో పాటు ఆటపాటలూ ఉంటాయి.

గార్బా, దాండియాలుగా పిలిచే ఈ జానపద నృత్యాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అందమైన రంగురంగుల ఎంబ్రాయిడరీతో ఉండే దుస్తులు ధరించి యువతీ యువకులు చేసే ఈ నృత్యాలు కన్నుల పండువగా ఉంటాయి.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ నృత్య రీతులు చాలా క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. ఇప్పుడు ప్రాంతాలకు అతీతంగా అందరూ ఈ నృత్యాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరి వీటి మధ్య ఉండే తేడా తెలుసా? అవేమిటో ఇక్కడ తెలుసుకుందాం. గార్బా, దాండియా రెండూ కూడా గుజరాతి నృత్యాలే. మహిషాసురుడిని వధించే క్రమంలో తొమ్మిదిరోజుల పాటు సాగిన ఆమె యుద్ధ రీతిని వివరించేవిగానే సాగుతాయి.  

గార్బా గుజరాతి గ్రామాల్లో పుట్టిన కళ. ఇప్పుడు దేశమంతా విస్తరించింది. ముఖ్యంగా గుజరాతీ కమ్యూనిటీలు ఉన్న ప్రతిచోజా ఈ నృత్యాలు చేస్తుంటారు. పెద్ద దీపపు సెమ్మె లేదా దేవి విగ్రహం చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ ప్రదర్శిస్తుంటారు. ఒకరినొకరు దాటు కుంటూ తిరుగుతూ చేసే బృంద నృత్యం ఇది. అయితే, ఇప్పుడు పెళ్లిల్లు, ఇతర వేడుకల్లో కూడా చేస్తున్నారు. భాషా, ప్రాంతంతో సంబంధం లేకుండా అంతా దాండియా, గార్బా డ్యాన్సులు చేస్తున్నారు.

గార్బా స్త్రీ శక్తిని, ఫెర్టిలిటిని ఆరాధిస్తూ సాగే నృత్యం. తల్లిదుర్గాదేవి లోని మాతృత్వపు తొమ్మిది రూపాలను కొలిచే నృత్య రీతి.

లయబద్ధమైన దాండియా కర్రలతో దరువు వేస్తూ వృత్తాకారంలో తిరుగుతూ ప్రదర్శించే నృత్యం దాండియా.

దాండియాకు, గార్బాకు మధ్య తేడాలు ఇవే:

  • గార్బా నృత్యం కీర్తనలు, భజనలకు చేస్తారు. ఇది భక్తి దాండియా కంటే కూడా భక్తి, ఆకర్శణ కలిగిన నృత్యం.
  • దాండియా హారతి తర్వాత సాయంత్రం ఆనందంగా చేసే నృత్యం.
  • గర్భా చేతులు ఉపయోగించి ఆడే నృత్యం. మధ్య మధ్య చప్పట్లు కొడుతూ రకరకాలుగా కాళ్లు చేతులతో విన్యాసం చేస్తూ చేస్తారు.
  • రంగురంగుల దాండియా కర్రలు ఉపయోగించి దాండియా ఆడతారు.
  • దాండియా ఆడేందుకు బృందంలో సరి సంఖ్యలో వ్యక్తులు ఉండాలి. గార్బాకు అలాంటి అవసరం ఉండదు.
  • గార్బా పాటలన్నీ కూడా దేవిని స్తుతిస్తూ ఉంటాయి. దాండియా పాటలు కృష్ణ లీల గురించి ఉంటాయి.

గార్బా, దాండియా రెండూ కూడా నవరాత్రి సమయంలో చేసినప్పటికీ రెండింటిలోనూ ఇలా కొన్ని తేడాలు ఉంటాయి.

Also read : లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ ఫొటోను ఇంట్లో పెట్టుకోవచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
One Nation One Elections: వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
Amazon Great Indian Festival 2024: అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
KTRs Corruption allegations against Revanth : బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలుమైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులుకర్ణాటకలో తిరుమల లడ్డు వివాదం ఎఫెక్ట్, అన్ని ఆలయాల్లో నందిని నెయ్యిSinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
One Nation One Elections: వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
Amazon Great Indian Festival 2024: అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
KTRs Corruption allegations against Revanth : బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
YSRCP : ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
Best Safety Cars in India: రూ.10 లక్షల్లోపు టాప్-5 సేఫెస్ట్ కార్లు ఇవే - రోడ్డుపై రక్షణ ముఖ్యం కదా!
రూ.10 లక్షల్లోపు టాప్-5 సేఫెస్ట్ కార్లు ఇవే - రోడ్డుపై రక్షణ ముఖ్యం కదా!
Telangana: మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
Chandra Babu: అన్ని దేవాలయాల్లో తనిఖీలు-రివర్స్ టెండరింగ్‌తో సర్వనాశనం చేశారు: చంద్రబాబు
అన్ని దేవాలయాల్లో తనిఖీలు-రివర్స్ టెండరింగ్‌తో సర్వనాశనం చేశారు: చంద్రబాబు
Embed widget