News
News
X

November 8th Horoscope: నవంబర్ 8 రాశి ఫలాలు - ఈ రాశులవారికి ధనయోగం

ఈ రాశుల్లోని ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
 

మేషరాశి

మేషరాశి వారికి ఈరోజు చాలా బాగుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన,ఆదాయ మార్గాలుంటాయి. నిరుద్యోగస్తులకు ఉద్యోగవకాశాలున్నాయి. కీలక వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకొనే అవకాశాలున్నాయి. చేసే పనిలో అత్యుత్తమమైన ఫలితాలు సాధిస్తారు. రుణ బాధలు తీరుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

వృషభ రాశి

ఈ రాశి వారు ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. పనిచేసే చోట ఉన్న సమస్యలను ఒత్తిడితో అధిగమిస్తారు. దూర ప్రాంత బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సంతానానికి విద్యావకాశాలున్నాయి. వ్యాపారస్తులకు అనుకూలం.

మిధున రాశి

వీరికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు చాలా బాగుంటాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉండదు. రాజకీయ రంగాల వారికి అనుకూలం. ప్రేమ వ్యవహారాలు లాభించవు. విద్యార్ధులు కష్టపడాల్సి వస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

కర్కాటక రాశి

ఈరోజు ఈ రాశి వారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చెప్పదగిన సూచన. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. అనారోగ్య సమస్యలున్నాయి.

News Reels

సింహ రాశి

సోదరుల నుంచి అనుకున్న సహాయం సమయానికి అందుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగంలో కీలక సమచారం అందుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు తిరిగి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలున్నాయి.

కన్య రాశి

ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో పేరు ప్రతిష్టతలు కలుగుతాయి. బంధువర్గంలో విశేష ఆదరణ లభిస్తుంది. వ్యాపారంలో స్వల్ప ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు గడిస్తారు. చేసేపనిలో కొంత జాప్యం జరిగినా పని పూర్తిచేస్తారు.

తుల రాశి

వీరికి ఈరోజు ఇంటా బయటా అనుకూల పరిస్థితులున్నాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు చేసే సూచనలున్నాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సోదరులతో సఖ్యంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు పనిచేసే చోట ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి

ఈ రాశి వారికి ఈ రోజు పనిచేసే చోట అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. మిత్రులతో నూతన వ్యాపారం గురించి చర్చలు జరుపుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి తగిన ధనం సహాయకంగా అందుతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.

మకర రాశి

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వస్తువాహనాలు కొంటారు. ఇంట్లో, బయటా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కుంభ రాశి

కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనుకొనే మీ కల నెరవేరవేరే అవకాశం ఉంది. పనిచేసే చోట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పనుల్లో శారీరక శ్రమ తప్పదు. ముఖ్యమైన పనులను అతికష్టంతో పూర్తి చేస్తారు. అనుకోని ప్రయాణాలున్నాయి.

మీన రాశి

పనిచేసే చోట మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అవి మీకు అనుకూలంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ప్రేమవ్యవహారాలు లాభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలం. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది.

గమనిక: ఈ రాశుల్లోని ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Published at : 08 Nov 2022 12:38 AM (IST) Tags: Horoscope daily horoscope Horoscope Today astrological predictions for November 2022 November 8th 8th November 2022 Rashifal 8th November horoscope today horoscope 8th November 2022 8th nov horoscope

సంబంధిత కథనాలు

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Love Horoscope Today 2nd December 2022: ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Love Horoscope Today 2nd December 2022:  ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Horoscope Today 2nd December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

Horoscope Today 2nd  December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో శక్తి పీఠం?

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో శక్తి పీఠం?

Sri Krishna Temple: దక్షిణ అభిముఖ శైలి ఉన్న కృష్ణుడి ఆలయం- మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్న అరుదైన గుడి!

Sri Krishna Temple: దక్షిణ అభిముఖ శైలి ఉన్న కృష్ణుడి ఆలయం- మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్న అరుదైన గుడి!

టాప్ స్టోరీస్

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

TS Govt :  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?