News
News
X

Chardham Yatra 2023: చార్ ధామ్ యాత్రకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది, ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు!

చార్ ధామ్ యాత్ర 2023: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. మీరు కూడా నమోదు చేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

Chardham Yatra 2023:  ఆధ్యాత్మిక చింతనతో పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ సాగే తీర్థయాత్ర ఎంతో పావనమైనది. హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే అత్యంత ముఖ్యమైన తీర్థయాత్రలలో చార్ ధామ్ యాత్ర ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న నాలుగు పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తూ సాగే పవిత్ర యాత్ర ఇది. యమునోత్రి , గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ అనే నాలుగు క్షేత్రాలను కలుపుతూ చేసే యాత్రను చార్ ధామ్ యాత్ర అంటారు. ఈ యాత్ర కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, యాప్స్, వాట్సాప్ నంబర్లను వెల్లడించింది. ఫిబ్రవరి 21 మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది.

Also Read: శవాల బూడిదతో హోలీ వేడుకలు ఆరంభం, 5 రోజుల పాటూ కన్నులపండుగా రంగుల పండుగ

రిజిస్ట్రేషన్ లేకుండా ప్రయాణం సాధ్యం కాదు
భక్తుల సౌకర్యార్థం గతేడాదిలా ఈసారి కూడా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. ఇది లేకుండా చార్ ధామ్ యాత్ర సాధ్యం కాదు. ఈ రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం యాత్ర ప్రారంభానికి రెండు నెలల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు

బద్రీనాథ్ - కేదార్నాథ్ ఎప్పుడు తెరుచుకుంటాయంటే
చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతుంది. కేదార్‌నాథ్ యాత్ర ఏప్రిల్ 25 నుంచి, బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 27న తెరుస్తారు. అందుకే మొదటి దశలో కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు వెళ్లే యాత్రికుల నమోదు మాత్రమే జరుగుతోంది. ప్రస్తుతం, గంగోత్రి, యమునోత్రి పోర్టల్‌లను తెరిచే తేదీని వెల్లడించలేదు. ఈ రెండు ధామ్ ల పోర్టల్ తేదీలు వెల్లడించిన తర్వాత వీటి  రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది.

ఇలా నమోదు చేసుకోండి

ఈసారి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి పర్యాటక శాఖ నాలుగు ఆప్షన్‌లు ఇచ్చింది.

  •  చార్‌ధామ్ యాత్ర కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ టూరిజం డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ registrationandtouristcare.uk.gov.in
  • WhatsApp నంబర్ 8394833833
  • టోల్ ఫ్రీ నంబర్ 1364
  • మొబైల్ యాప్ టూరిస్ట్‌కేర్ ఉత్తరాఖండ్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. భక్తులు తమ సౌలభ్యం ప్రకారం ఏదైనా వెబ్‌సైట్, వాట్సాప్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ మరియు మొబైల్ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు.

Also Read: హోలీ రోజు మీరు చల్లే రంగు మీ మనసులో ఏముందో చెప్పేస్తుంది

కేదార్‌నాథ్
ఏప్రిల్ 25వ తేదీ కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ఏటా శీతాకాలంలో ఇక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది. ఆ సమయంలో ఆలయాన్ని మూసేస్తారు. చలికాలం ముగియగానే మళ్లీ తెరుస్తారు. ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 6.30 నిముషాలకు ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని అధికారులు వెల్లడించారు. అంతకు ముందు తెల్లవారు జామున 4 గంటలకు ఓంకారేశ్వర్ ఆలయంలో మహాభిషేక పూజ నిర్వహిస్తారు.

బద్రీనాథ్ 
బద్రీనాథ్ ధామ్ సందర్శించకుండా చార్ ధామ్ యాత్ర పూర్తి కాదు. ఇది శ్రీ మహావిష్ణువు నివాసంగా చెబుతారు. 'జో జాయే బద్రీ, వో నా ఏ ఓదారీ'. అంటే బద్రీనాథ్‌ని దర్శించుకున్న వ్యక్తికి పునర్జన్మ ఉండదు ముక్తి లభిస్తుందని అర్థం.

గంగోత్రి 
గంగోత్రి గంగానదికి మూలం. గంగోత్రి నుంచి రెండు నదులు పుడతాయి. ఒకటి భాగీరథి, మరొకటి కేదార్ గంగా. గంగోత్రిలో ఉన్న గౌరీ కుండ్‌లో గంగే స్వయంగా శివునికి ప్రదక్షిణలు చేస్తుందని చెబుతారు.

యమునోత్రి 
యమునోత్రిలో స్నానమాచరిస్తే ఏడు తరాలకు సరిపడా మోక్ష లభిస్తుందని భక్తుల విశ్వాసం. చార్ ధామ్ యాత్ర యమునోత్రి ధామ్ నుంచి ప్రారంభమవుతుంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం యమునా నది ఇక్కడ నుండి ఉద్భవించింది.

చార్ ధామ్ యాత్రకు కేవలం భారతీయులు మాత్రమే కాదు..విదేశీయులు కూడా భారీగా తరలివెళతారు. హరిద్వార్ నుంచి ప్రారంభమయ్యే చార్ ధామ్ యాత్రను పూర్తి చేయడానికి కేవలం సంకల్ప బలం మాత్రమే సరిపోదు. దీనితో పాటు, మెరుగైన శారీరక ఆరోగ్యం కూడా అవసరం.  న్యూఢిల్లీతో సహా భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రోడ్డు లేదా రైలు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. విమానాశ్రయం ఉన్న డెహ్రాడూన్ నుంచి రోడ్డు మార్గంలో కూడా చేరుకోవచ్చు. చార్ ధామ్ యాత్రకు పట్టే సమయం మరియు సౌకర్యాల ప్రకారం యాత్రికుల కోసం అనేక రకాల   ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. చార్ ధామ్ యాత్ర కోసం హరిద్వార్ నుంచి డెహ్రాడూన్ ముస్సోరీ మీదుగా బార్కోట్ చేరుకుంటారు. దారిలో కెంప్టీ ఫాల్స్  చూసుకుంటూ ఆ తర్వాత యాత్రికులు...చార్ ధామ్ యాత్ర మొదటి స్టాప్ అయిన యమునోత్రికి బయలుదేరుతారు. ఆ తర్వాత ఉత్తరకాశీలో గంగోత్రి, రుద్రప్రయాగ్‌లోని కేదార్‌నాథ్, ఆపై బద్రీనాథ్ ఆలయాలను సందర్శించుకుంటారు.

గతేడాది కన్నా ఈ సంవత్సరం ఎక్కువ మంది యాత్రికులు చార్‌ధామ్‌ను సందర్శిస్తారని భావిస్తోంది అక్కడి ప్రభుత్వం. అందుకే రెండు నెలల ముందుగా సన్నాహాలు ప్రారంభించారు. 

Published at : 22 Feb 2023 03:49 PM (IST) Tags: kedarnath Badrinath Yamunotri Gangotri Chardham Yatra 2023 Chardham Yatra 2023 online registration Char Dham Yatra 2023 Packages Uttarakhand’s spiritual tour how to register for Uttarakhand

సంబంధిత కథనాలు

ఇది 9 సార్లు వరుసగా 9 రోజులు భక్తితో పారాయణం చేస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయి

ఇది 9 సార్లు వరుసగా 9 రోజులు భక్తితో పారాయణం చేస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయి

Sri Rama Navami 2023: కష్టాలు, ఇబ్బందులు తొలగించి మానసిక ప్రశాంతత, సంతోషాన్నిచ్చే శ్రీరామ రక్షా స్త్రోత్రం

Sri Rama Navami 2023: కష్టాలు, ఇబ్బందులు తొలగించి మానసిక ప్రశాంతత, సంతోషాన్నిచ్చే శ్రీరామ రక్షా స్త్రోత్రం

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

2023 ఏప్రిల్ నెల రాశిఫలాలు - ఈ 6 రాశులవారు ఆర్థికంగా ఓ మెట్టెక్కుతారు, అన్నీ అనుకూల ఫలితాలే!

2023 ఏప్రిల్ నెల రాశిఫలాలు - ఈ 6 రాశులవారు ఆర్థికంగా ఓ మెట్టెక్కుతారు, అన్నీ అనుకూల ఫలితాలే!

మహిళలూ, ఈ పరిహారాలు పాటిస్తే విజయాలు మీ వెంటే!

మహిళలూ, ఈ పరిహారాలు పాటిస్తే విజయాలు మీ వెంటే!

టాప్ స్టోరీస్

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!