అన్వేషించండి

Bheeshma Neeti: ఉన్నత పదవుల్లో ఎవరిని నియమించాలి, ధర్మరాజుకి భీష్ముడు ఏం చెప్పాడంటే!

Bhishma Neeti: అంపశయ్యపై ఉన్న భీష్ముడు తనని చూసేందుకు వచ్చిన ధర్మరాజుకి చాలా విషయాలు బోధించాడు. వాటిలో ఉన్నత పదవులలో ఎవరిని నియమించాలో, ఎవర్ని నియమించకూడదో వివరిస్తూ ఓ కథ చెప్పాడు.

Bheeshma Neeti: ఉన్నత పదవులలో ఎలాంటివారిని నియమించాలనే  అనుమానం వచ్చింది ధర్మరాజుకి. దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ భీష్ముడిని కోరాడు. అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు.

ధర్మరాజుకి భీష్ముడు చెప్పిన కథ
పూర్వం అడవిలో ఓ ముని తపస్సు చేసుకునేవాడు. ఓ కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని తనతో పాటే ఉండనిచ్చేవాడు. వీరి అనుబంధం ఇలా కొనసాగుతుండటా ఓరోజు ఆ కుక్క ఓ పులి కంటపడింది. అంతే! ఆ పులి తన పంజా విసురుతూ కుక్కని బలిగొనబోయింది. వెంటనే ఆ కుక్క పరుగుపరుగున పోయి మునీశ్వరుని వెనుక నక్కింది. తనను నమ్ముకున్న కుక్క ఆ పులికంటే బలహీనంగా ఉండటం వల్లే కదా, దానికి ఆపద కలిగింది- అనుకున్నాడు మునీశ్వరుడు. దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు. ఆ ఘటనను చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది. కానీ పులిగా మారిన కుక్క జీవితం అక్కడి నుంచి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే మరోసారి దాని మీదకి ఓ ఏనుగు దూసుకువచ్చింది. యథాప్రకారం పులిరూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చివేశాడు ఆ మునివర్యుడు. ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ముని. 

Also Read: 'అట్ల తదియ' ఆంతర్యం ఏంటి, మొదటగా ఈ నోము నోచిందెవరు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటి!

అలా బెబ్బులిలా మారిన కుక్క ఇక తన మీద దాడి చేసేంతటి శక్తి మరో జంతువుకి లేదన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది. కానీ అలా తిరుగుతుండగా దాని మనసులో ఓ ఆలోచన మొదలైంది- ‘మునివర్యులు నా మీద జాలిచూపారు కాబట్టి, నన్ను అన్నింటికంటే శక్తిమంతమైన జంతువుగా మార్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ రేపు మరో జంతువు ఏదన్నా మునీంద్రుని శరణువేడితే నా పరిస్థితి ఏంటి? అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తలవంచాల్సిందే కదా!’ అనుకుంది. ‘అసలు ఆ మునీశ్వరుని చంపిపారేస్తే, అతను మరో జంతువు మీద జాలి చూపే అవకాశం ఉండదు,’ అని పన్నాగం పన్నింది. ‘‘కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు యోచనలు చేస్తూ ఏమీ ఎరగనట్లు ముని ముందరకి వచ్చి కూర్చుంది. కానీ కుక్కను బెబ్బులిగా మార్చినవాడు, దాని మనసులో ఏముందో గ్రహించలేడా! మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దురాలోచనను పసిగట్టాడో వెంటనే తిరిగి దానిని కుక్కగా మార్చేశాడు! అది మళ్లీ తన పూర్వజీవితంలోకి వచ్చేసింది. 

Also Read: కర్వా చౌత్(అట్ల తదియ) ఎప్పుడొచ్చింది, ఆ రోజు ప్రత్యేకత ఏంటి!

కాబట్టి ధర్మనందనా! దుర్మార్గులకు ఉన్నతపదవులు ఇస్తే వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది. అందుకే యోగ్యతని అనుసరించి పదవులను అందించాలి. అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్నయినా సాధించగలడు అని చెప్పాడు భీష్ముడు. అంటే తమకు నచ్చారనో, భారీగా ముట్టచెప్పారనో, ఇంకేవో కారణాలతో అర్హత లేని పదవులు కట్టబెడితే దానివల్ల నష్టమే కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని వివరించాడు భీష్ముడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
జైనూరు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
జైనూరు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Crime News: కన్నతండ్రి కాదు కామాంధుడు, భార్య లేని టైం చూసి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి
Crime News: కన్నతండ్రి కాదు కామాంధుడు, భార్య లేని టైం చూసి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Embed widget