అన్వేషించండి

Bathukamma Wishes 2022: మీ బంధుమిత్రులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Bathukamma Wishes 2022: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక 'బతుకమ్మ' పండుగ. ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఈ పండుగ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.

Happy Bathukamma 2022 Greetings: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో  ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఈ పండుగ. అంటు వ్యాధులు, కరువు కాటకాల బారినుంచి ప్రజల్ని కాపాడాలని ప్రార్థిస్తూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుకే ఇది. ప్రకృతిలో లభించే ప్రతీ పూవును ఏరికోరి బతుకమ్మలను తయారు చేయడం, వాటిని ఇంటి ముందు, వీధుల్లో, ఆలయాల ముందు ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ ఆడిపాడడం ఎంతో ఆనందాన్నిస్తుంది. గుమ్మడి పూలలోని పసుపు వర్ణంలో ఉన్న దిద్దుని గౌరీ దేవిగా భావిం చి అందులో పసుపు గౌరమ్మను నిల్పి  ముస్తాబు చేస్తారు. మహిళలు, పిల్లలు అనే వయోబేధం లేకుండా ఆడిపాడుతారు.తెలంగాణ పల్లె పల్లెల్లో జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు ఎల్లలు దాటి దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు. అక్టోబరు 3 సోమవారం రోజు సద్దుల బతుకమ్మతో ఈ వేడుక ముగుస్తుంది...ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని కొటేషన్స్..

Also Read: మీ బంధుమిత్రులకు దసరా శుభాకాంక్షలు చెప్పేయండిలా!

1.తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

2.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా పూజలను పూజిస్తూ బతుకమ్మ జరుపుకుంటున్న మహిళలకు పండుగ శభాకాంక్షలు

3.అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే బతుకమ్మ పండుగ వేళ మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

4.తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

5.తెలంగాణ ఆచార సంప్రదాయలకు ప్రతీక
మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చూపే పూల వేడుక
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

6.తీరొక్క పూలతో తీర్చిదిద్ది 
ఆటపాటలు, కోలాటాలు
అవధుల్లేని ఆనందంతో జరుపుకునే
సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

7.ఆడపడుచుల ఆకుపచ్చని సంబంరం
పల్లెకు కొత్తఅందాన్ని తీసుకొచ్చే పూల వైభవం
బతుకమ్మ పండుగ శుభాకాలంక్షలు

8.ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
ఉమ్మెత్త పువ్వొప్పునే గౌరమ్మ ఉమ్మెత్త కాయప్పునే
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

9.రామ రామ నంది ఉయ్యాలో రాగమేత్తరాదు ఉయ్యాలో..
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో నేలవన్నేకాడ ఉయ్యాలో..
పాపిటలో చంద్రుడా ఉయ్యాలో బలాకుమరుడా ఉయ్యాలో..
తెలంగాణ ఆటపాటల పండుగ బతుకమ్మ శుభాకాంక్షలు

10. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

11. తంగేడు పూల సందమామ..
మల్లెన్నడు వస్తావు.. సందమామ..
గునుగు పూల సందమామ..
బతుకమ్మ పోతుంది.. సందమామ..
మీకు మీ కుటుంబ సభ్యులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

12. ఉసికెలో పుట్టే గౌరమ్మ..ఉసికెలో పెరిగే గౌరమ్మ..
కుంకుమలో పుట్టే గౌరమ్మ..కుంకుమలో పెరిగే గౌరమ్మ..
పసుపులో పుట్టే గౌరమ్మ..పసుపులో పెరిగే గౌరమ్మ..
మీ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

బతుకమ్మ పండుగ చివరి రోజు ఆఖరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. బతుకమ్మలను సాధారణ రోజుల కంటే పెద్ద పరిమాణంలో తయారు చేసి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగను దుర్గా అష్టమి రోజు జరుపుకుంటారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget