Ayodhya Ram Mandir Darshan Timings: అయోధ్య రాముడి దర్శన వేళలు - పాటించాల్సిన నిబంధనలు ఇవే!
Ayodhya Ram Mandir : జనవరి 22 అయోధ్య ఆలయం ప్రారంభోత్సవం అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. మరి రాముడిని దర్శించుకునే సమయం, పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటో తెలుసా...
Ayodhya Ram Mandir Darshan Timings: జన్మభూమిలో దశరథరాముడు కొలువయ్యే సమయం ఆసన్నమవుతోంది. దశరథరాముడిని కన్నులారా దర్శించుకునేందుకు భక్తులు తపించిపోతున్నారు. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన సప్తమోక్షదాయక క్షేత్రాల్లో అయోధ్య ఒకటి కాగా... ఇప్పుడు రామయ్య కూడా కొలువుతీరుతుండడంతో ఆ క్షేత్ర దర్శనం ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. జనవరి 22న అయోధ్య రామ మందిరంలో రాముడు కొలువుతీరిన తర్వాత..నిత్యం భక్తులను అనుమతించనున్నారు. ప్రారంభోత్సవం తర్వాత నిత్యం దాదాపు 5 లక్షల మంది భక్తులు రామచంద్రుడిని దర్శించుకుంటారని అంచనా. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. మరి అయోధ్య రాముడి దర్శనానికి వచ్చే భక్తులకు దర్శన సమయం - నియమ నిబంధనలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి..
Also Read: సప్త పురాలు అంటే ఏవి - అయోధ్యదే ఫస్ట్ ప్లేస్ ఎందుకు!
భక్తులు రాముడిని దర్శించుకునే టైమింగ్స్ ఇవే
- ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 11:30 వరకు
- మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు
- ప్రత్యేక సందర్భాలలో.. పండుగల సమయాలలో దర్శన వేళల్లో మార్పులుంటాయి
రోజుకి రామయ్యకు మూడుసార్లు మంగళ హారతి
- ఉదయం 6 : 30 గంటలకు శృంగార్ హారతి
- మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి
- సాయంత్రం 07:30 గంటకు సంధ్యా హారతి
Also Read: ఆ రోజే బిడ్డను కంటాం - రామచంద్రా దీనిని భక్తి అంటారా!
ప్రత్యేక దర్శనాలున్నాయి
భక్తులందరికీ అయోధ్య రామమందిరంలోకి ప్రవేశం ఉచితమే కానీ ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. టిక్కెట్ ధర ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.300 వరకు ఉంటుంది. ఇంకా దర్శనం టికెట్లను విడుదల చేయలేదు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం. భక్తులకు ఉచిత ప్రసాదం అందించున్నారు.
Also Read: అయోధ్యలో రామమందిరంతో పాటూ ఇవన్నీ సందర్శించాల్సిన ప్రదేశాలే!
పాటించాల్సిన నియమ నిబంధనలు
- రామ మందిరంలోనికి ప్రవేశించేటప్పుడు భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్‌ను పాటించాల్సి ఉంటుంది
- ఆలయంలోనికి ప్రవేశించే సమయంలో భక్తులు సంప్రదాయ బద్ధమైన దుస్తులు మాత్రమే ధరించాలి
- పురుషులు ధోతీ, గంచా, కుర్తా-పైజామాను ధరించాల్సి ఉంటుంది. మహిళలు చీర లేదా సల్వార్ సూట్స్, పంజాబీ డ్రెస్ ధరించవచ్చు. జీన్స్ ప్యాంట్స్, షర్ట్స్, టాప్స్, షార్ట్స్ లేదా వెస్ట్రన్ డ్రెస్సులను అస్సలు అనుమతించరు.
- భక్తులు తమ వెంట మొబైల్ ఫోన్లను తీసుకుని వెళ్లడం నిషేధం
- పర్సులు, హ్యాండ్ బ్యాగులు, వాలెట్స్, ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు, రిమోట్‌తో కూడిన కీ- చైన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఆలయంలోనికి తీసుకెళ్లకూడదు
- గొడుగులు, బ్లాంకెట్లు, గురు పాదుకలను తీసుకెళ్లడంపైనా నిషేధం ఉంది
Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి!
జనవరి 22 వ తేదీన బాల రాముడి విగ్రహాన్ని రామ మందిరంలో ప్రతిష్ఠించేందుకు 7 రోజుల ముందు నుంచే పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జనవరి 16 వ తేదీన ప్రారంభం కానున్న ఈ కార్యక్రమాలు.. ప్రతిష్ఠాపన జరిగే రోజు వరకు కొనసాగనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార యాంత్రంగం దీనిపై నిత్యం సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవంగా దీన్ని నిర్వహించడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది.
Also Read: 100 ప్రాంతాల మట్టి, 7 కోట్ల వ్యయం - అయోధ్యలో వెలగనున్న అతి పెద్ద దీపం ప్రత్యేకతలివే!