Tirupati: అన్నమయ్య సంకీర్తనలన్నీ ఒకే చోట - క్షేత్ర స్థాయిలో సనాతన ధర్మ ప్రచారం
Tirupati News: సనాతన ధర్మాన్ని క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని , ప్రత్యేక యూట్యూబ్ చానెల్ ద్వారా అన్నమయ్య సంకీర్తనలన్నీ ఒకేచోట అందించాలన్నారు సూచించారు టీటీడీ ఈవో జె.శ్యామలరావు..ఇంకా...

Tirupati: తిరుపతి శ్రీ పద్మావతీ గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో HDPP, శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్, శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్, పబ్లికేషన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్, ఎపిక్ స్టడీస్ , దాస సాహిత్య ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. ఈ సమీక్షలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
భగవద్గీతలో ముఖ్యమైన ఘట్టాలను సరళతరంగా, సులంభగా ఉండేలా కార్టూన్, వీడియోల రూపంలో అందించడం వల్ల సులువుగా అందరకీ చేరువ అవుతుందని అభిప్రాయపడ్డారు.
హిందూ ధర్మం విశిష్టత, ధార్మిక, ఆధ్యాత్మిక, మానవీయత, నైతిక విలువల గురించి నేటి తరానికి తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలన్నారు.
మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేలా ధార్మిక కార్యక్రమాలు రూపొందించాలి. విద్యార్థులలో దైవభక్తి, నైతిక విలువలు పెంచేలా వారు క్రమశిక్షణ, ఉమ్మడి కుటుంబవ్యవస్థ తదితర అంశాలపై నేర్చుకునేలా ఇప్పటి నుంచి ప్రణాళికలు రూపొందించాలన్నారు
భజన మందిరాలు ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయో సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు శ్యామలరావు. హిందూ ధార్మిక ప్రచార పరిషత్ ద్వారా ఇప్పటి వరకు అమలు చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుని మరింత నాణ్యంగా అందించేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ధార్మిక కార్యక్రమాల నిర్వాహకులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేలా సంబంధిత ప్రతినిథులతో చర్చించమని ఆదేశించారు.
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు పచ్చదనం పెంచమని ప్రోత్సహిస్తూ ‘శ్రీవారి వన నిధి’ ద్వారా ఓ మొక్కను ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు.
శ్రీవేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ పనితీరుపై సమీక్షించిన టీటీడీ ఈవో..TTD వెబ్ సైట్ లోని ప్రత్యేక యూ ట్యూబ్ చానెల్ లో తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తలను అన్నింటినీ ఒకే చోట ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అన్నమయ్య సంకీర్తనల్లో బాగా పాపులర్ అయిన వాటిని ముందుగా పొందు పరిచి..ఆ తర్వాత దశలవారిగా అన్ని సంకీర్తనలు పొందుపరచాలని సూచించారు. కొత్తగా పొందుపరిచిన సంకీర్తనలు కూడా పాపులర్ అ్యేలా ప్లాన్ సిద్ధం చేయమని చెప్పారు
అన్నమయ్య 32 వేల సంకీర్తనల్లో 14, 932 సంకీర్తలు లభ్యమయ్యాయి..వాటిలో ఎన్ని రికార్డ్ అయ్యాయి? ఇంకా ఎన్ని రికార్డ్ చేయాల్సి ఉంది? వెబ్ పేజీలో ఎన్ని అప్ లోడ్ చేశారు? ఇంకా ఎన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంది? వీటిపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు శ్యామలరావు
TTD పబ్లికేషన్ శాఖ పనితీరుపైనా సమీక్షించిన ఈవో TTD ముద్రించిన అన్ని పుస్తకాలు TTD బుక్ స్టాల్స్ లో లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అందరకీ అర్థమయ్యేలా, సులభతలంగా ఉండేలా కథనాలు రాసి ముద్రించాలన్నారు. ఇప్పటి వరకు TTD ఎన్ని పుస్తకాలు ముద్రించింది, TTD ఈ బుక్స్ లో ఎన్ని అప్ లోడ్ చేశారు? పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఈ బుక్స్ లో విశేష ఆదరణ పొందిన పుస్తకాలను ముద్రించి భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు
తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు- పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమల అలిపిరి మెట్లదారిలో ఈ అద్భుతాలను గమనించారా..మీరెన్ని చూశారు
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















