IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

Akshaya Tritiya 2022: మే ౩న అక్షయ తృతీయ, ఆ రోజు ఇలా చేస్తే చాలా మంచిది

వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అంటారు. ఈ రోజు బంగారం కొనుగోలు చేసినా, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజ చేసినా కలిగే శుభాన్ని మాటల్లో చెప్పలేం అంటారు పండితులు....ఆ రోజు ఏం చేయాలంటే..

FOLLOW US: 

అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయడం ద్వారా అప్పుడు, తిప్పలు, కష్టాలు, నష్టాలు తొలగి ఆర్థికంగా ఓ మెట్టు పెకెక్కుతామని విశ్వసిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శుక్ల పక్షం అంటే చంద్రుని వృద్ధి చెందుతున్న దశలో మూడవ రోజు తృతీయ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. అక్షయ తృతీయ లక్ష్మీదేవికి , లక్ష్మీ నరసింహ స్వామికి  ప్రీతికరమైన రోజు. ఈ రోజు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించి ఆవునేతితో దీపారాధన చేసి, తియ్యటి పదార్థం నైవేద్యం పెడితే మీ జీవితంలో ఉన్న చెడు, బాధ అన్నీ తొలగి సకల శుభాలు కలుగుతాయని చెబుతారు. 

Also Read: కొత్తగా ఏం ప్రారంభించినా విజయమే....ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకతే అది...
  
ఇదే రోజు లక్ష్మీనరసింహ స్వామికి కూడా చాలా ఇష్టమైన రోజు. సింహాచలంలో అక్షయ తృతీయ రోజున లక్ష్మీ నరసింహ స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. సింహాచలంలో సాయంత్రంవేళ స్వామివారికి చందనోత్సవం జరుగుతుంది. అందుకే  అక్షయ తృతీయ రోజున లక్ష్మీ నరసింహస్వామికి చందనం అలంకరించి పూజిస్తే మంచి జరుగుతుందని చెబుతారు. లక్ష్మీనరసింహ స్వామివారికి మాత్రం పానకం, వడపప్పు, చలిమిడి నైవేద్యంగా సమర్పిస్తారు. అక్షయ తృతీయ రోజు లక్ష్మిదేవి, వరాహనారసింహుడితో పాటూ కుబేరులను కూడా కొందరు పూజిస్తారు. 

Also Read:  ఇది ఆచార్య ధర్మస్థలి కాదు రియల్ ధర్మస్థలి, ఎక్కడుందంటే!

ఈ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయడమే కాదు దాన ధర్మాలు కూడా చేయడం ద్వారా ఆర్థిక, అనారోగ్య, కుటుంబ సమస్యల నుంచి బయటపడొచ్చని అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు. విసనికర్ర, నూతన వస్త్రాలు, గుమ్మడికాయ, గొడుగు, పాదరక్షలు, పండ్లు..ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలను బట్టి దానం చేస్తే గ్రహబాధల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతారు.  బంగారం లాంటి విలువైన వస్తువులు కొనుగోలు చేసే స్తోమత లేని వాళ్ళు భక్తితో పూజించినా చాలు...

‘లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం’

అనే శ్లోకాన్ని పఠించాలి. ఇవేవీ కుదరకపోతే ‘ఓం హ్రీం ఐం మహాలక్ష్మైనమః’ అనే మూలమంత్రాన్ని జపిస్తూ ఆ తల్లిని అర్చించాలి.

Also Read: ఇంట్లో కనక వర్షం కురిపించే స్తోత్రం, నిత్యం చదివితే ఆర్థిక సమస్యలే ఉండవు

Published at : 28 Apr 2022 06:07 PM (IST) Tags: Akshaya Tritiya akshaya tritiya 2022 chandanotsavam simhachalam 2022

సంబంధిత కథనాలు

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!

Chatushashti Kalalu: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే

Chatushashti Kalalu: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే

Someshwara Temple: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే

Someshwara Temple:  శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే

Astrology: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

Astrology: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

Today Panchang 18th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వినాయక శ్లోకం

Today Panchang 18th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వినాయక శ్లోకం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Damodara Rao: ఎవరీ దామోదరరావు, టీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీ పదవి ఎందుకు ఇచ్చారు?

Damodara Rao: ఎవరీ దామోదరరావు, టీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీ పదవి ఎందుకు ఇచ్చారు?

IBA Womens World Boxing: జరీన్‌ 'పంచ్‌' పటాకా! ప్రపంచ బాక్సింగ్‌ ఫైనల్‌ చేరిన తెలంగాణ అమ్మాయి

IBA Womens World Boxing: జరీన్‌ 'పంచ్‌' పటాకా! ప్రపంచ బాక్సింగ్‌ ఫైనల్‌ చేరిన తెలంగాణ అమ్మాయి

KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్‌ వెళ్తారా? ఓడి టెన్షన్‌ పడతారా!

KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్‌ వెళ్తారా? ఓడి టెన్షన్‌ పడతారా!

China Plane Crash: ఎంత పనిచేశారు పైలట్లు! 132 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు!

China Plane Crash: ఎంత పనిచేశారు పైలట్లు! 132 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు!