Adi Shankaracharya Jayanti 2024: నేడు జగద్గురు ఆది శంకరాచార్యులు 1236వ జయంతి.. అద్వైత సిద్దాంతకర్త గూర్చి ఈ విషయాలు మీకు తెలుసా?
Adi Shankaracharya Jayanti 2024: హిందూమత ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం చూపిన త్రిమతాచార్యుల్లో జగద్గురు ఆది శంకరాచార్యులు ప్రథముడు. శంకరాచార్యుల జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం.
Adi Shankaracharya Jayanti 2024: సాక్షాత్తు పరమ శివుడి అవతారంగా భావించే ఆది శంకరుల కృపే ఈరోజు హిందూధర్మంలో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత, ఉన్నాయడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందరో మహర్షులు, బుుుషుల నోట అంతర్యామి వాక్కులుగా పలికిన శక్తి వేదాలుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి, మరెవరో పరిశీలన చేసి, విమర్శలు చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలం నుంచి స్వయంగా మహాపురుషుల నోట వచ్చిన సచ్చిదానంద వేదాలు. హిందువులను సంఘటితం చేయడంలో ఆదిశంకరాచార్యులు ముఖ్యపాత్ర పోషించారని భావిస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం పరమ శివుడి మరో అవతారమే ఆదిశంకరాచార్యులని నమ్ముతారు.
జగద్గురు ఆది శంకరాచార్యులు హిందూత్వాన్ని చాటిచెప్పేందుకు దేశమంతటా పర్యటించారు. అతిచిన్న వయస్సులోనే ఎన్నో గొప్ప పనులు చేశారు. వైశాఖ మాసపు శుక్ల పక్ష పంచమి ఆదిశంకరాచార్యుల ఏటా మే 12న 1236వ జయంతి జరుపుకుంటారు.
ఆదిశంకరాచార్య ఎవరు?
ఆది శంకరాచార్య ఒక హిందూ తత్వవేత్త. వేదాలకు కూడా వక్ర భాష్యం చెప్పి భారతీయ సమాజంలో విబజన కలిగించి మూఢచాందస భావాలను ప్రేరేపించి అన్యమతాల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో అలాంటి పరిస్థితిని చక్కదిద్దడానికి శంకరులు కాలడిలో శివగురుశక్తితో ఆర్యాంబ గర్భంలో ఉత్తరాయణ పుణ్యకాలం వైశాఖ శుద్ధ పంచమినాడు అవతరించాడు ఆదిశంకరాచార్యుడు. సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడానికి, ఆదిశంకరాచార్య భారతదేశంలో 4 మఠాలను స్థాపించారు. వీటిలో తూర్పున గోవర్ధన్, జగన్నాథపురి (ఒరిస్సా), పశ్చిమాన ద్వారకా శారదామత్ (గుజరాత్), ఉత్తరాన జ్యోతిర్మఠం (ఉత్తరాఖండ్), శృంగేరి మఠం, రామేశ్వరం ఉన్నాయి. తమిళనాడు) దక్షిణాన ఉన్నాయి.
చిన్న వయసులోనే గొప్పపనులు:
788 క్రీ.పూ కేరళలోని కలాడిలో జన్మించాడు. రెండేళ్ల వయసులోనే ఈ పిల్లవాడు సంస్కృతం అనర్గళంగా మాట్లాడటం, రాయడంలో ప్రావీణ్యం సంపాదించాడు. నాలుగేళ్ళ వయసు వచ్చేసరికి వేదాలన్నీ పఠించి 12 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చిన్నతనంలో శంకరాచార్యులు ప్రస్తుతం ఉన్న హిందూ మతం సూత్రాలకు మించి అద్వైత తత్వశాస్త్రం గురించి ప్రజలకు జ్ఞానోదయం చేయడం ప్రారంభించాడు. చిన్న వయస్సులో కూడా అతను ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పునఃస్థాపించడానికి దేశవ్యాప్తంగా పర్యటించడం ప్రారంభించాడు. ఎంతో మంది తన వద్ద శిష్యులుగా చేరారు.
12 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వయస్సు వరకు ఆ 20 సంవత్సరాలలో, అతను హిందూత్వాన్ని రక్షించడానికి భారతదేశంలోని నాలుగు మూలలకు - ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పశ్చిమం వరకు అనేక పర్యటనలు చేశాడు. మఠాలలో శంకరాచార్యుల సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇది హిందూ మతంలో అత్యున్నత స్థానంగా పరిగణించబడుతుంది.
త్యాగి, దండి సన్యాసి, సంస్కృతం, చతుర్వేదం, వేదాంత బ్రాహ్మణుడు, బ్రహ్మచారి, పురాణాలలో జ్ఞానం కలిగి ఉండటం ఒక వ్యక్తికి శంకరాచార్య పదవిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. దీనితో పాటు, వారు తమ గృహ జీవితంలో, ముండన్, పిండ్ దాన్, రుద్రాక్ష ధరించడంలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. శంకరాచార్యుడు కావడానికి, బ్రాహ్మణుడు కావడం తప్పనిసరి, అతను నాలుగు వేదాలు, ఆరు వేదాంగాలను తెలుసుకోవాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.