Garuda puranam: గరుడ పురాణం: అలాంటి బ్రాహ్మణులతో పూజలు చేయించకూడదట!
Garuda puranam: మన సంప్రదాయంలో పూజలు, హోమాలు నిర్వహించాలంటే బ్రాహ్మణులను ఆశ్రయించడం సర్వసాధారణం. ఎలాంటి బ్రాహ్మణులు ఇలాంటి కార్యక్రమాలు చేయాలో గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు.
Garuda puranam: మన భారతీయ సంస్కృతిలో పూజ-పునస్కారం, హోమం-హవనం సర్వసాధారణం. అయితే పూజ, హోమం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. గరుడ పురాణంలో కొందరు బ్రాహ్మణులు లేదా పండితుల సమక్షంలో పూజలు, హోమం-హవనాలు చేయకూడదని చెప్పారు. ఐతే మనం పూజ, హోమం ఎలాంటి బ్రాహ్మణులతో చేయించకూడదు..?
కాలానుగుణంగా పూజలు, యాగాలు నిర్వహించడం చాలా కాలంగా వస్తున్న ఆచారం. పూజ లేదా హోమం చేస్తున్నప్పుడు, పవిత్రమైన ముహూర్తం నుంచి, పూజ లేదా హోమానికి అవసరమైన ప్రతిదానిని చాలా జాగ్రత్తగా ఎంచుకుంటాము. అయితే, పూజ లేదా యాగాలు చేసేటప్పుడు ఎలాంటి పండితులను ఎన్నుకోవాలి. ఏ పండితులు ఈ పనులను చేయకూడదు అనే దానిపై మనం పెద్దగా శ్రద్ధ చూపించం. సాధారణ జీవితాన్ని గడుపుతూ, అందరికీ శ్రేయస్సు కోరుతూ ధర్మ మార్గాన్ని అనుసరించే వ్యక్తిగా గ్రంథాలలో పండితులు లేదా బ్రాహ్మణులను వర్ణించారు. అయితే ఇటీవలి కాలంలో వీటిలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. గరుడ పురాణం ప్రకారం, కొంతమంది పండితులు లేదా బ్రాహ్మణులు పూజలు, హోమం చేయకూడదని స్పష్టంగా చెప్పారు.
Also Read : వీటిని ఇంట్లో అలంకరించుకుంటే దుష్టశక్తులు దరి చేరవు
మంత్రగాళ్లు
మంత్రవిద్య లేదా భూతవైద్యం చేసే పూజారులు ఎప్పుడూ యాగం, పూజ లేదా శ్రాద్ధ కర్మలు చేయకూడదు. ఈ పండితుడిని శ్రాద్ధ కార్యక్రమాలకు ఎంచుకుంటే పూర్వీకులు నిరాదరణకు గురవుతారని గరుడ పురాణం చెబుతోంది. వారిలో ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు అలాంటి వారి చేత పూజ, హోమం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఫలితంగా ఇది సమస్యలను పెంచుతుంది.
ఈ 4 రకాల బ్రాహ్మణులు
మేకలు మేపే బ్రాహ్మణుడు, బొమ్మలు గీసే బ్రాహ్మణుడు, బ్రాహ్మణ వైద్యుడు, జ్యోతిష్యంలో నిమగ్నమైన వారు ఎలాంటి పూజలు, హోమాలు చేయకూడదు. ఈ నాలుగు రకాల బ్రాహ్మణులతో పూజలు, హోమాలు చేయించడం వల్ల మనం చేసే పూజ ఫలించదు.
అత్యాశ, అజ్ఞానం ఉన్నవారు
వేదాలు చదవని, అంటే వేదాల గురించి తక్కువ జ్ఞానం ఉన్న బ్రాహ్మణుడిని పూజించకూడదు. ధనాపేక్షతో హోమం చేసే పండితులచే పూజలు చేస్తే వృథా అవుతాయి. అటువంటి పండితులు కేవలం ధనాపేక్షతో పూజ, హోమాలు చేస్తారు తప్ప పూజా ఫలితాల కోసం కాదు.
అసూయపడే వారు
ఇతరుల సంతోషానికి అసూయపడే, చెడు చేసే బ్రాహ్మణుడిని పూజ-పునస్కారాలు, హోమం-హవనాలకు ఎన్నుకోకూడదు. అలాంటి పండితులు ఇతరుల సంతోషం కోసం పూజించరు. బదులుగా, వారికి చెడు జరగాలని కోరుకుంటూ పూజలు చేస్తారు. కాబట్టి అలాంటి వారిని పూజకు ఎంపిక చేసుకోకండి.
హింస చేసే బ్రాహ్మణులు
ఎప్పుడూ ఇతరుల సొమ్ము తీసుకునేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, హింస చేసేవాడు మంచి పండితుడు కాలేడని గరుడ పురాణం చెబుతోంది. ఈ పండితులు లేదా బ్రాహ్మణులు ఎప్పుడూ పూజ చేయకూడదు, మనం ఈ తప్పు చేస్తే వారి పాప కర్మలలో పాలుపంచుకుంటాము.
Also Read : ఈ పనులు చేస్తే ఆర్థిక సమస్యలు దరిచేరవు
దుష్ట లక్షణాలు ఉన్నవారు
ఎప్పుడూ ఇతరులను విమర్శించేవాడు, మత్తులో ఉన్నవాడు అంటే ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవాడు, అటువంటి దుష్ట పండితులు లేదా బ్రాహ్మణులు చేసే పూజలు, యాగాలు లేదా శ్రాద్ధ కర్మలను పొందడం వల్ల సంబంధిత వ్యక్తి నరకానికి వెళతాడు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.