Chanakya niti in telugu: ఈ గుణాలున్న భర్త ఉంటే భార్య అదృష్టవంతురాలు
అమ్మాయిలూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, ఈ లక్షణాలున్న అబ్బాయిని పెళ్లాడితే మీ జీవితం చాలా సుఖంగా ఉంటుందని చాణక్యుడు చెప్పాడు.
Chanakya niti in telugu: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి, నీతి శాస్త్రంలో మానవ జీవితం గురించి వివరించాడు. ఇందులో ఒక వ్యక్తి జీవితంలోని గతం, వర్తమానం, భవిష్యత్తు గురించిన సమస్త సమాచారం ఉంటుంది. దీనితో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాల గురించి కూడా ప్రస్తావించాడు. అమ్మాయిలు.. అబ్బాయిల్లో ఎలాంటి లక్షణాలు ఇష్టపడతారో చాణక్య నీతిలో వివరించాడు. ఈ 4 లక్షణాలు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకున్న అమ్మాయిలు నిజంగా అదృష్టవంతులేనని తెలిపాడు. అలాంటి అబ్బాయిలను పెళ్లి చేసుకున్న అమ్మాయిల జీవితాలు మారిపోతాయని చెప్పాడు. మగవారిలో ఉండే ఏ లక్షణాలను అమ్మాయిలు ఇష్టపడతారో ఇప్పుడు చూద్దాం.
1. పనిచేసేందుకు ఇష్టపడే అబ్బాయిలు
కాయకమే కైలాసమని, అంటే పని మన జీవితంలో ప్రధానమని తెలిసిన అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం ఆడపిల్లల అదృష్టం. అలాంటి అబ్బాయిలు తమ కష్టార్జితంతో భారీ సంపద సంపాదిస్తారు. అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అదృష్టం మారిపోతుంది.
2. సూటిగా మాట్లాడే అబ్బాయిలు
సూటిగా మాట్లాడే అబ్బాయిని భర్తగా పొందిన అమ్మాయి అదృష్టవంతురాలు. అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే, పెళ్లి తర్వాత వారి వైవాహిక జీవితం ఆనందంగా, మధురంగా ఉంటుంది. అమ్మాయిలు అలాంటి వ్యక్తిని ప్రేమిస్తారు.
3. కష్టపడి పనిచేసే అబ్బాయిలు
కష్టపడి పని చేసే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. అలాంటి వారు హఠాత్తుగా ఉద్యోగం మార్చుకోరు. అలాంటి అబ్బాయిలతో అమ్మాయిలు చాలా త్వరగా ప్రేమలో పడతారు. అలాంటి పురుషుడిని భర్తగా పొందడం ఆడపిల్లల అదృష్టమని చాణక్యుడు చెప్పాడు. అలాంటి అబ్బాయిలను పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిలు ఆనందకరమైన జీవితం పొందుతారని తెలిపాడు.
4. ప్రశాంతంగా ఉండే అబ్బాయిలు
అమ్మాయిలు ప్రశాంతంగా ఉంటూ, స్త్రీలను గౌరవించే అబ్బాయిలను త్వరగా ఇష్టపడతారు. ఆడపిల్లల కలల రాకుమారుడిలా ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వారి వైవాహిక జీవితం ఆనందంగా, ఆనందమయంగా ఉంటుంది.
చాణక్య నీతి ప్రకారం మిమ్మల్ని పేదరికంలోని నెట్టేసే 5 అలవాట్లు
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక వ్యక్తి తన రోజువారీ అలవాట్లను మెరుగుపరచుకోవాలని పేర్కొన్నాడు. అప్పుడే అతను విజయం సాధించగలడు. రోజువారీ పనుల్లో ప్రతిరోజూ దంతాలు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. చాణక్య నీతి ప్రకారం, రోజూ పళ్లు తోముకుని శుభ్రం చేసుకోని వ్యక్తిపై లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది. ఫలితంగా అతను పేదరికాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.
ఎప్పుడూ పరుషమైన మాటలు మాట్లాడే వారిపై లక్ష్మీ కటాక్షం ఉండదు. ఎప్పుడూ కఠినమైన పదాలతో ఎదుటివారితో మాట్లాడేవారు ఎంతో కష్టపడి పనిచేసినా.. వారిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. ఎందుకంటే మధురమైన మాటలు లేని వ్యక్తికి లక్ష్మి దేవి ప్రసన్నం కాదు.
సాయంత్రం పూట నిద్రపోకూడదని మన పెద్దలు తరచుగా చెబుతుండటం మీరు వినే ఉంటారు. దీని వెనుక బలమైన కారణం ఏంటో తెలుసా..? చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి సాయంత్రం నిద్రపోకూడదు, ఎందుకంటే సాయంత్రం నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు, అందువల్ల ఆ ఇంట్లోని వ్యక్తి పేదవాడు అవుతాడు.
చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి అవసరమైనంత మాత్రమే ఆహారం తీసుకోవాలి. తనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకునే వ్యక్తి పేదరికం అనుభవిస్తాడు. దీంతో పాటు అనారోగ్య సమస్యలు అతడిని వేధించడం ప్రారంభిస్తాయి.
మోసం, చెడు పనులలో నిమగ్నమైన వ్యక్తి లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందలేడని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. అలాంటి వ్యక్తి త్వరలోనే విధ్వంస బాటలో పయనిస్తాడని పేర్కొన్నాడు.
Also Read: మీకు సంతోషం కావాలా? చాణక్యుడు చెప్పింది వింటే తప్పకుండా దక్కుతుంది