Navagraha Temples: కుంభకోణం చుట్టూ కొలువైన నవగ్రహ దేవాలయాలు! వివాహం, సంతానం అన్ని సమస్యలకు పరిష్కారం!
Navagraha Temples near to Kumbhakonam: నవగ్రహ ఆలయాలన్నీ తమిళనాడు కుంభకోణం చుట్టుపక్కలే కొలువయ్యాయి...ఈ ఆలయాలను సందర్శిస్తే గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం

Navagraha Temples: తమిళనాడు కుంభకోణం క్షేత్రానికి సమీపంలో నవగ్రహ ఆలయాలున్నాయి. వీటిని దర్శించుకుంటే గ్రహ పీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వీటినే నవగ్రహ స్థలాలు అంటారు.
సూర్య దేవాలయ- Suryanar Kovil Temple (Surya)
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు.. సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత మాత్రమే కాదు ఐశ్వర్య ప్రదాత కూడా. కుంభకోణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది సూర్య దేవాలయం. 1100వ సంవత్సరంలో కులోత్తుంగ చోళ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఏటా పంటలు చేతికి వచ్చే జనవరిలో సూర్యునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ విశేషమైన ఉత్సవం నిర్వహిస్తారు. తమిళులు దీనిని సూర్యనార్ కోవిల్ అంటారు.
చంద్ర దేవాలయ - Kailasanathar Temple (Chandra)
తిన్గాలూర్ కోవిల్ అని పిలచే చంద్రుడి దేవాలయం తిరువైయూర్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఆలయ దర్శనం సుఖాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుందని నమ్మకం. ఏటా సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో వచ్చే పురుట్టాసి ,మార్చి –ఏప్రిల్ లో వచ్చే ఫల్గుని నక్షత్ర సమయాల్లో చంద్ర కాంతి ఇక్కడి ఆలయంలో శివలింగంపై ప్రసరించటం విశేషం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానసిక ఒత్తిడి ,దుఖాన్ని తగ్గించే వాడు చంద్రుడని చెబుతారు
అంగారక ఆలయం- Vaitheeswaran Koil Temple (Angaragan)
తిరువైయార్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది కుజ దేవాలయం. వైతీశ్వరన్ కోవిల్ అని పిలిచే ఈ ఆలయంలో స్వామివారి దర్శనంతో వ్యాధులు నయం అవుతాయని విశ్వాసం .ధైర్యం విజయం శక్తికి కారకుజు అంగారకుడే. జటాయువు, గరుడుడు ,సూర్యుడు అంగారకుని పూజించిన ప్రదేశం ఇదే అని స్థలపురాణం. పెళ్లి ఆలస్యం అయితే ఈ క్షేత్రాన్ని దర్శించుకుని వస్తే వెంటనే పెళ్లి జరుగుతుంది
బుధుడి ఆలయం - Swetharanyeswarar Temple (Budha)
కుజుడి ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది బుధుని దేవాలయం. ఇక్కడ స్వామిని స్వేతారన్యేశ్వరుడు అని అమ్మవారిని బ్రహ్మ విద్యాంబికా దేవిగా పూజిస్తారు .వాల్మీకి రామాయణంలో ఈ ఆలయం గురించి ఉందని చెబుతారు. అంటే 3వేల ఏళ్లనాటిది అని..ఇక్కడ బుధుడి దర్శనం తెలివితేటలను ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం
బృహస్పతి దేవాలయం- Apatsahayesvarar Temple (Guru)
కుంభకోణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలన్గుడిలో గురు దేవాలయం ఉంది. ఇక్కడ స్వామివారిని అరన్యేశ్వరుడిగా పూజిస్తారు. ఇది స్వయంభు లింగం. అమ్మవారు ఉమా దేవి . గురుస్థానంగా చెప్పే ఈ ఆలయంలో దక్షిణా మూర్తి ఆరాధన చేస్తారు .
శుక్ర దేవాలయం- Agniswarar Temple (Sukran)
శుక్రుడి క్షేత్రం కంచానూర్ లో సూర్య దేవాలయానికి 3 కిలో మీటర్లలో ఉంది. దీనినే పలాశ వనం ,బ్రహ్మ పరి ,అగ్నిస్థలం అని కూడా పిలుస్తారు. ఇక్కడే బ్రహ్మ దేవుడు పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని దర్శించుకున్నాడని.. భార్యల ఆరోగ్యం కోసం భర్తలు ఇక్కడకు వచ్చి పూజలు చేస్తారట
శని స్థలం- Tirunallar Saniswaran Temple (Shani)
కుంభకోణానికి 53 కిలోమీటర్ల దూరంలో కరైకాల్ కు 5 కిలోమీటర్ల దూరంలో తిరునల్లార్ లో ఉంది శనీశ్వరుడి ఆలయం. లక్షాలాది భక్తులు శనిగ్రహానుగ్రహం కోసం ఇక్కడికి వచ్చి పూజలు నిర్వర్తిస్తారు .ఇక్కడే నల మహా రాజును శని పట్టుకుని పీడించాడని స్థలపురాణం. అందుకు గుర్తుగా ఇక్కడ నలతీర్థం ఉంటుంది...ఇందులో స్నానం ఆచరిస్తే పాపాలన్నీ కొట్టుకుపోతాయి
రాహుస్థలం- Naganathar Temple (Rahu)
కుంభకోణానికి 5 కిలోమీటర్ల దూరం లో తిరు నంగేశ్వరంలో రాహువు ఆలయం ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు నాగ నాద స్వామిగా, అమ్మవారు గిరి గుజాంబికా దేవిగా పూజలందుకుంటున్నారు. ఇక్కడ ఆదిశేషుడు ,దక్షుడు, కర్కోటకుడు శివుడిని అర్చించారని చెబుతారు
కేతు స్థలం - Naganathaswamy Temple (Ketu)
పల్లం అనే చోట పూం పుహార్ కు 2 కిలో మీటర్ల దూరంలో ఉంది కేతు ఆలయం. ఇక్కడ రాహు కేతువులు జంట సర్పాకారంలో కలిసి ఉండి , క్షీర సాగర మధనం లో శివునికి సాయం చేశారని స్థలపురాణం
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. సమాచారాన్ని అమలు చేయాలి అనుకున్నప్పుడు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించడం మంచిది.























