Home Remedies: ఇంట్లో అశాంతికి కారణమయ్యే 8 అలవాట్లు ! వెంటనే వీటిని వదిలించుకోవడం బెటర్!
Vastu Dosha: చిన్న మార్పులతో సమస్యలు తొలగిపోతాయి, సంతోషం వస్తుంది. కొన్ని అలవాట్లు మానుకుంటే ఇంట్లో సానుకూల శక్తి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు

Home Remedies: ఒక వ్యక్తి జీవితంలో అత్యంత ప్రశాంతమైన ప్రదేశం ఇల్లు. కానీ కొన్నిసార్లు, కొన్ని కారణాల వల్ల, మనం ఇంటి వాతావరణంలో ఒత్తిడి, గందరగోళం ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. మనం రోజువారీ జీవితంలో చేసే కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఉదాహరణకు, వస్తువులను నిర్వహించే విధానం లేదా ఇంటి వాతావరణంలో మురికిని వ్యాప్తి చేయడం వంటివి ఇంట్లో ప్రతికూల శక్తిని తెస్తాయి. ఇలాంటి అనేక చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, వీటిని మనం విస్మరిస్తాము. కానీ ఆ విషయాలు ఇల్లు మరియు కుటుంబ వాతావరణంపై ప్రభావం చూపుతాయి. ఆ కారణాలేం టో, వాటిని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.
1. ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం
సూర్యుడు ఉదయించే ముందు మీరు లేవకపోతే..ఇది రోజంతా శక్తిని తగ్గిస్తుంది. ఈ అలవాటు మీ ఇంట్లో సోమరితనం అశాంతిని ప్రోత్సహిస్తుంది. అందుకే సూర్యోదయానికి ముందే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి
2. నీరు కారడం
ఇంటి కుళాయి నుంచి నీరు కారుతున్నట్లయితే ఇది నీటిని వృధా చేయడమే కాకుండా, దాని తేమ, మురికి , చిందించే శబ్దం ఇంటి వాతావరణాన్ని అసమతుల్యం చేస్తుంది. నిత్యం ఇంట్లో ఇలా జరిగితే మీరు ఎంతసంపాదించినా చేతిలో సొమ్ము నిలవదు అని చెబుతారు వాస్తు నిపుణులు
3. ఎలక్ట్రానిక్స్ చెడిపోయిన వస్తువులను ఉంచడం
ఇంట్లో ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ఏదైనా చెడిపోయిన లేదా విరిగిన వస్తువు ఉంటే, అది ప్రతికూలతను వ్యాప్తి చేస్తుంది. ఇది ఇంటిపైనే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. విరిగిన వస్తువులు ఎప్పటికప్పుడు వదిలించుకోవడం మంచిది
4. ఇంట్లో చిరిగిన చెప్పులు , బూట్లు ఉంచడం
ఏదైనా చిరిగిన చెప్పులు లేదా బూట్లు ఇంట్లో ఉంచడం వల్ల ఇంటి పరిశుభ్రత దెబ్బతింటుంది . అశాంతి ఏర్పడుతుంది. ఇది ఇంట్లోకి ప్రవేశించే సానుకూల శక్తిని నిరోధిస్తుంది..ఇంట్లో భారాన్ని పెంచుతుంది. చినిగిన బూట్లు, ఊడిన చెప్పులు పడేయండి
5. పూజలు చేయకపోవడం
ఇంట్లో పూజలు చేయడం, దీపాలు వెలిగించడం వల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా చేయకపోతే, ఇంట్లో ప్రతికూలత ఇబ్బందులు పెరుగుతాయి. నిత్యం దీపం వెలిగించే ఇంట్లో వాస్తు దోషాలు కూడా పెద్దగా ప్రభావం చూపవని వాస్తు నిపుణులు చెబుతారు
6. ఇంట్లో దుమ్ము పేరుకుపోవడం
ఇంట్లో ఎక్కడైనా దుమ్ము లేదా మురికి పేరుకుంటే, అది వ్యక్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది..ఇల్లంతా అస్తవ్యస్తంగా మారిపోయింది అనిపిస్తుంది. ముఖ్యంగా పేరుకుపోయిన దుమ్ము మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది
7. బట్టలు బయట వదిలివేయడం లేదా పిండి ఉంచడం
బట్టలు ఆరిన తర్వాత కూడా రాత్రంతా వాటిని బయట వదిలివేయడం లేదా పిండేసి ముద్దలా ఉంచేయడం వల్ల ప్రతికూలతను వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి అలవాట్లు ఇంటిని అశాంతిగా చేస్తాయి.
8. తలుపులు కిటికీల నుంచి శబ్దం రావడం
ఇంటి కిటికీలు , తలుపుల నుంచి వచ్చే శబ్దం వ్యక్తి మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తుంది ... ఇంటి వాతావరణంలో అశాంతిని కలిగిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















