అన్వేషించండి

YSRCP Local Body Elections : ఏపీ స్థానిక పోరు - వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేశం.. కంగారులో క్యాడర్‌ను బలి కోరుతోందా?

YSRCP Cases: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ స్థానిక నేతలు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. రక్తం పారిస్తాం, రక్తాభిషేకం చేస్తామనే ప్రకటనలు ఆ పార్టీకి సమస్యగా మారుతున్నాయి.

AP Local Elections TDP vs YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ తీవ్రమైన ఒత్తిడికి, కంగారుకు గురవుతున్నట్లు స్పష్టమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి కోలుకోకముందే ఎదురవుతున్న స్థానిక పోరులో ఉనికి కాపాడుకోవడం ఆ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. ఈ క్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకత్వం శాంతియుత ప్రజాస్వామ్య పోరాటాలను ఎంచుకోవడానికి బదులుగా,  రక్తాభిషేకాలు, నరుకుతాం, చంపుతాం  వంటి తీవ్రమైన ఆవేశపూరిత వ్యాఖ్యలతో క్యాడర్‌ను రగల్చే ప్రయత్నం చేయడం రాజకీయ వర్గాల్లో  చర్చనీయాంశమవుతోంది.

క్యాడర్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా?

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు వీధి పోరాటాల పేరిట ఇస్తున్న పిలుపులు, వాడుతున్న భాష క్షేత్రస్థాయి శ్రేణులను మరింత ఇరకాటంలో పడేస్తున్నాయి. గత ఐదేళ్ల పాలనలో నమోదైన అక్రమ కేసులు, అధికార మార్పిడి తర్వాత చోటుచేసుకున్న చట్టపరమైన పరిణామాలతో ఇప్పటికే వందలాది మంది వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటువంటి సున్నితమైన సమయంలో  తిరగబడండి, తెగబడండి అంటూ నాయకత్వం ఇచ్చే ఆవేశపూరిత ఉపన్యాసాలు క్యాడర్‌ను శాంతింపజేయడానికి బదులు, మరిన్ని కొత్త కేసుల్లోకి నెట్టివేసే ప్రమాదం ఉంది.

వైసీపీకి ఎందుకింత కంగారు? 

ఈ తరహా ఆవేశపూరిత రాజకీయం వెనుక వైఎస్‌ఆర్‌సీపీ తీవ్రమైన కంగారు, అభద్రతా భావం దాగి ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమంపై వేగంగా అడుగులు వేస్తుండటంతో పాటు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు లేదా ఏకపక్ష విజయాలు సాధిస్తే వైసీపీ క్యాడర్ పూర్తిగా ఖాళీ అయిపోతుందనే భయం ఆ పార్టీని వెంటాడుతోంది. ప్రజాదరణతో ఎన్నికలను ఎదుర్కోవడానికి తగినంత గ్రౌండ్ వర్క్ లేకపోవడంతో, ఘర్షణ పూరిత వాతావరణాన్ని లేదా సెంటిమెంట్‌ను రగల్చడం ద్వారా ఎన్నికలను వాయిదా వేయించడమో, లేదా వైలెంట్ నేరేటివ్‌తో ఉద్రిక్తతలు సృష్టించి ప్రభుత్వంపై వేధింపుల ముద్ర వేయడమో ఒకే ఒక్క మార్గంగా వైసీపీ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.  ఈ తీవ్రమైన వ్యాఖ్యలు పార్టీకి మైలేజ్ ఇవ్వడం కంటే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. కేసుల్లో ఇరుక్కుని జైలుపాలు లేదా కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తే, తమను ఆదుకోవడానికి ఏ సీనియర్ నాయకుడూ ముందుకు రాడనే నిజం ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి అర్థమైంది. 

నాయకులు బాగానే ఉంటారు..క్యాడర్‌కే సమస్యలా?

నాయకులు మైకుల ముందు ఆవేశంగా మాట్లాడి వెళ్ళిపోతారు, కానీ చట్టపరమైన పరిణామాలు అనుభవించాల్సింది క్షేత్రస్థాయి కార్యకర్తలే. దాంతో నాయకత్వం ఎంత రగిల్చినా, క్యాడర్ మాత్రం మళ్లీ కేసులు కొనితెచ్చుకోవడానికి సిద్ధంగా లేదు. అంతిమంగా, హింస లేదా రెచ్చగొట్టే రాజకీయాలను నమ్ముకోవడం ద్వారా ఏ పార్టీ కూడా సుదీర్ఘకాలం నిలబడలేదు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే దానికి చట్టపరంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎదురుతిరగాలి తప్ప.. నరకడం, చంపడం వంటి పదజాలంతో రాజకీయం చేస్తే పార్టీ మరింత బలహీనపడటంతో పాటు సామాన్య ప్రజల్లో మరింత వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తుంది. స్థానిక పోరు వేళ వైఎస్‌ఆర్‌సీపీ అనుసరిస్తున్న ఈ ఆవేశపూరిత వ్యూహం పార్టీని పునరుద్ధరించడానికి బదులు, ఉన్న క్యాడర్‌ను కూడా దూరం చేసే ప్రమాదంలో పడేస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

UP Elections 2027 Analysis: ఒవైసీ–చంద్రశేఖర్ ఆజాద్ సామాజిక పరివర్తన మోర్చా .. దళిత, ముస్లిం ఓట్ల చీలికతో ఎస్పీ–కాంగ్రెస్‌కు దెబ్బ, బీజేపీకి లాభమా?
ఒవైసీ–చంద్రశేఖర్ ఆజాద్ సామాజిక పరివర్తన మోర్చా .. దళిత, ముస్లిం ఓట్ల చీలికతో ఎస్పీ–కాంగ్రెస్‌కు దెబ్బ, బీజేపీకి లాభమా?
Invest Telangana Global Summit 2026: కరువు వేళ గ్లోబల్ సమ్మిట్ అవసరమా? 400 మంది మేధావుల లేఖ - రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది?
కరువు వేళ గ్లోబల్ సమ్మిట్ అవసరమా? 400 మంది మేధావుల లేఖ - రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది?
YS Sharmila Invitation Controversy: పెళ్లి పిలుపుపైనా రాజకీయమా? చంద్రబాబుతో షర్మిల భేటీపై వైసీపీ దాడి రివర్స్ అవుతోందా!
పెళ్లి పిలుపుపైనా రాజకీయమా? చంద్రబాబుతో షర్మిల భేటీపై వైసీపీ దాడి రివర్స్ అవుతోందా!
CM Revanth Reddy Siddipet Public Meeting: సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
CM Revanth Reddy Siddipet Public Meeting: సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Samantha : బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
Litton Das World Record:  టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
Nara Lokesh: తిరుపతిలో 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్- మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
తిరుపతిలో 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్- మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
Embed widget