కొత్త పింఛన్ దరఖాస్తులను సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 16 వరకు స్వీకరిస్తారు. ఈ కాలంలో దరఖాస్తు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు eKYC పూర్తి చేయాలి.
NTR Bharosa Scheme: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్.. కొత్త దరఖాస్తుల స్వీకరణ, అర్హతలు, దరఖాస్తు విధానం ఇవే!
NTR Bharosa Scheme: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. అర్హతలు, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు తెలుసుకుందాం.

- అధికారుల సిఫార్సుపై బడ్జెట్ ఆమోదంతో పింఛన్లు మంజూరు.
NTR Bharosa Pension Scheme: ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తుంది. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, ఇతర చేతివృత్తుల వారు కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ముఖ్య తేదీలు
- సెప్టెంబర్ 7 నుండి 16 వరకు - కొత్త పింఛన్ దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, eKYC పూర్తి చేయడం
- సెప్టెంబర్ 17 నుండి 21 వరకు - కామన్ ఎలిజిబిలిటీ వాలిడేషన్
- సెప్టెంబర్ 22 నుండి 24 వరకు - అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన, సిఫార్సులు
- సెప్టెంబర్ 25 నుండి 26 వరకు - బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ తుది ఆమోదం
అర్హతలు
ఆదాయ పరిమితి - గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలవారీ ఆదాయం రూ. 10,000 లోపు ఉండాలి. పట్టణాల్లో కుటుంబ నెలవారీ ఆదాయం రూ. 12,000 లోపు ఉండాలి.
భూమి పరిమితి - కుటుంబానికి ప్రభుత్వ నిబంధనలకు మించి సొంత భూమి ఉండకూడదు.
ప్రభుత్వ ఉద్యోగం/పింఛను- కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగిగా గానీ, ఇతర రిటైర్డ్ పెన్షనర్గా గానీ ఉండకూడదు.
ఆదాయపు పన్ను- కుటుంబంలో ఏ వ్యక్తి కూడా ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారుడు అయి ఉండకూడదు.
అవసరమైన పత్రాలు
వృద్యాప్య పెన్షన్ల కోసం కావాల్సిన పత్రాలు:
1) ఆధార్ కార్డు
2) రేషన్ కార్డు (లేదా) ఇన్కమ్ సర్టిఫికెట్
3) కరెంటు బిల్లు
4) కుల ధృవీకరణ పత్రం
5) ఓటు గుర్తింపు కార్డు
6) పాస్పోర్ట్ సైజ్ ఫోటో
7) ఆధార్ అప్డేట్ హిస్టరీ
వికలాంగుల కొత్త పెన్షన్ కోసం కావాల్సిన పత్రాలు
1) ఆధార్ కార్డు
2) వికలాంగుల ధృవీకరణ పత్రం
3) రేషన్ కార్డు (లేదా) ఇన్కమ్ సర్టిఫికెట్
4) కరెంటు బిల్లు
5) కుల ధృవీకరణ పత్రం
6) ఓటు గుర్తింపు కార్డు
7) ఆధార్ అప్డేట్ హిస్టరీ
8) పాస్పోర్ట్ సైజ్ ఫోటో
Also read: యూట్యూబర్ నందనను ఎందుకు అరెస్ట్ చేయలేదు? - నోటీసులిచ్చి పంపేశారు... లీగల్ ప్రొసీడింగ్స్ ఏంటంటే?
వితంతు కొత్త పెన్షన్- కావాల్సిన పత్రాలు
1) ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు
2) భర్త మరణ దృవపత్రం
3) రేషన్ కార్డు (లేదా) ఇన్కమ్ సర్టిఫికెట్
4) కరెంటు బిల్లు
5) కుల ధృవీకరణ పత్రం
6) ఓటు గుర్తింపు కార్డు
7) ఆధార్ అప్డేట్ హిస్టరీ
8) పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- వితంతు పింఛన్ - భర్త మరణ ధృవీకరణ పత్రం
- దివ్యాంగుల పింఛన్- సదరమ్ సర్టిఫికెట్
- చేనేత, మత్స్యకార, కల్లుగీత ధృవీకరణ పత్రాలు
Also Read: చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
దరఖాస్తు విధానం, పరిశీలన
- అర్హులైన అభ్యర్థులు తమ పరిధిలోని స్వర్ణ గ్రామ లేదా స్వర్ణ వార్డు ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు ఫారాన్ని సమర్పించాలి.
- సచివాలయ సిబ్బంది అభ్యర్థి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, eKYC ప్రక్రియను పూర్తి చేస్తారు.
- ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ద్వారా అర్హతలను క్రాస్ చెక్ చేస్తారు.
- వాలిడేషన్ పూర్తైన తర్వాత, సంబంధిత సిబ్బంది లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి సమాచారాన్ని, డాక్యుమెంట్లు తనిఖీ చేసి రిపోర్ట్ ఇస్తారు.
- ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ అర్హులైన జాబితాను పరిశీలించి పై అధికారులకు సిఫార్సు చేస్తారు.
పింఛన్ మంజూరు
- క్షేత్రస్థాయి అధికారులు సిఫార్సు చేసిన దరఖాస్తులను రాష్ట్రస్థాయిలో పరిశీలించి, బడ్జెట్ కేటాయింపు ఆధారంగా ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది.
- దరఖాస్తు చేసిన తేదీ నుంచి బకాయిల రూపంలో పింఛను చెల్లిస్తారు. SERP ద్వారా పోర్టల్లో పింఛను ఎనేబుల్ చేసిన నెల నుంచే నెలవారీ చెల్లింపులు ప్రారంభమవుతాయి.
Also Read: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన
Frequently Asked Questions
కొత్త పింఛన్ దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















