Gannavram Venkat Rao : టీడీపీ నేతలతో మాట్లాడలేదు - గన్నవరం రాజకీయాల్లోనే ఉంటానన్న యార్లగడ్డ వెంకట్రావు !
గన్నవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారడం లేదన్నారు. వంశీని విలన్‌గా ప్రకటించారు.
Gannavram Venkat Rao : తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్‌సీపీలోకి మారిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరంలో రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువవుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ తరపున పోటీ చేసి ఇటీవలికాలంలో ఎక్కువగా అమెరికాలో ఉంటున్న యార్లగడ్డ వెంకట్రావు మళ్లీ గన్నవరం వచ్చారు. వంశీపై అసంతృప్తి వ్యక్తం చేశఆరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విలన్ తో పోటి చేశానని. అతన్ని పార్టీలోకి తీసుకునే సమయంలో వ్యతిరేకించాను.. ప్రతిసారి నేను అధిష్టానం తో పోరాటం చేయలేనని యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పై హాట్ కామెంట్స్ చేశారు. తాను నిత్యం కార్యకర్తలతో అందుబాటులో ఉన్నాను. వారు ఏ శుభ , అశుభ కార్యక్రమాలకు అహ్వనించిన పాల్గొంటున్నాను అన్నారు.
తన వ్యక్తిగత పని మీదా ఒక 6 నెలల అమెరికా వెళ్లాను ఆసమయంలో ఎంతోమంది నాపై దుష్ప్రచారం చేశారని.. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటి చేసేది అనేది అధిష్టానం నిర్ణయస్తుందని ఉహగానాలు అనవసరమని కొట్టిపడేశారు. జగన్మోహన్ రెడ్డి తనకు కెడిసిసి ఛైర్మన్ పదవి ఇచ్చారని 11 నెలలు పాటు కష్టపడి పనిచేసి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి 43శాతం వృద్ధి సాధించే విధంగా కృషి చేశానని గుర్తు చేశారు. తనకు ఏదైనా బాధ్యత ఇస్తే పని చేసి చూపిస్తాం ఇవ్వకుండా ఎలా చేస్తామని ఆయన మీడియాను ప్రశ్నించారు.
తనపై ఎంతో మంది ప్రచారం చేస్తున్నారు వాటి అన్నింటికీ సమాధానం చెప్పలేననని యార్లగడ్డ స్పష్టం చేశారు. తాను నియోజకవర్గ ఇంచార్జి ఉన్నప్పుడు ఒక తట్టమట్టి తవ్వలేదు కనీసం ఒక్క పైసా అవినీతి కి పాల్పడలేదు అన్నారు. మట్టి తవ్వినట్లు నిరూపిస్తే దేవుడు దగ్గర ప్రమాణం చేయటానికి నేను సిద్ధమని సవాల్ చేశారు. రాజకీయ చేయాల్సిన సమయంలో రాజకీయం చేస్తానని స్పష్టం చేశారు. టీడీపీ నేతలతో మంతనాలు జరిపేనని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకవచ్చారని అయన వెంటే నడుస్తానని ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటి చేస్తారు. ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారనే అంశంపై ప్రచారం చేస్తున్నారు కాబట్టే నా ఇమేజ్ బాగా పెరిగింది అనుకుంటున్నాని యార్లగడ్డ వెంకట్రావు అంటున్నారు.
గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావుతో పాటు .. దుట్టా రామచంద్రరావు అల్లుడు శివభరత్ రెడ్డి కూడా వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఉన్నారు. వారిద్దరూ వంశీకి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వవొద్దని అంటున్నారు.