Sharmila Vs Jagan: జగన్ ఓ నియంత- సీఎం అయ్యాక మారిపోయిన మీరు వైఎస్ వారసులెలా అవుతారు?
Sharmila Comments on CM Jagan Ruling: నియంత లాంటి జగన్ ప్రజల మనిషి అయిన జగన్ వారసుడు ఎలా అవుతారని పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. మమరింత
Sharmila Comments On Jagan Ruling: ఇది రైతు రాజ్యం కాదు.. వైఎస్సార్ సుపరిపాలన అంతకన్నా కాదని తేల్చి చెప్పారు షర్మిల. ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్‌లు ఇవ్వరు, 30 వేల టీచర్ ఉద్యోగ పోస్ట్‌లు భర్తీ చేయాల్సి ఉండగా నోటిఫికేషన్ లేదని కామెంట్ చేశారు. కాకినాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జగన్ నియంత - YS Sharmila Sensational Comments on CM Jagan
వైఎస్సార్ ప్రజల మనిషి ప్రజల మధ్యే బ్రతికాడని పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ ఒక నియంత పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రజలకు కనపడరు ఎమ్మెల్యేలను కలవరు అని అభిప్రాయపడ్డారు. మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అనుకున్న వాళ్లను దూరం చేశారు
వైఎస్సార్ నష్టపోతున్న కంపెనీలను ప్రభుత్వ పరం చేయించారని తెలిపారు షర్మిల. మీరు ఉన్న ఆస్తులను అమ్ముతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ పేరును చెడగొట్టింది మీరు.. ఎంతో మంది త్యాగాలు చేస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. నా అనుకున్న వాళ్ళను అందరినీ దూరం చేశారని దుయ్యబట్టారు. వైఎస్సార్ పాలనకు జగన్ ఆన్న పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.
ప్రేమను చూశాను
కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు తాము సోనియా గాంధీను కలిశానని... వాళ్ళు వైఎస్సార్‌పై పెట్టుకున్న ప్రేమ అభిమానాన్ని చూశానన్నారు షర్మిల. వైఎస్సార్ ఉంటే కాంగ్రెస్‌కి ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నారని తెలిపారు. వైఎస్సార్ కుటుంబంలో జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు.. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత కాంగ్రెస్‌లో పని చేసేందుకు ఒప్పుకున్నట్టు వివరించారు.
టార్గెట్ అవుతానని తెలుసు
నాన్న తనకు నేర్పించింది ప్రజల మధ్య ఉండాలనన్నారు షర్మిల. తనను కాంగ్రెస్ ఏపికి వెళ్ళమంటేనే పని చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. ఇక్కడ బీజేపీ చేస్తున్న తెర వెనుక రాజకీయాలను తెలుసుకున్నట్టు కామెంట్ చేశారు. ప్రజలకు జరుగుతుంది అన్యాయం కాబట్టి నేను ఇక్కడ పని చేయాలని అనుకున్నట్టు తెలిపారు. ఇది వ్యక్తిగత నిర్ణయం కానే కాదన్నారు. నా వ్యక్తిగత నిర్ణయం అయితే 2019 లోనే నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఈ నిర్ణయంతో నేను టార్గెట్ అవుతా అని తెలుసు నన్ను ఎటాక్ చేస్తారని కూడా తెలుసు అన్నారు. నా కుటుంబం నిట్టనిలువునా చీలుతుంది అని తెలుసన్నారు. అయినా నేను తీసుకున్న నిర్ణయం ప్రజల కోసమే అన్నారు షర్మిల.
Also Read: వైఎస్ ఫ్యామిలీ చీలిందంటే జగనే కారణం- దేవుడు, తల్లే సాక్ష్యం- షర్మిల సంచలన కామెంట్స్
Also Read: అప్పుడు ఏపీని, ఇప్పుడు మా కుటుంబాన్ని చీల్చి రాజకీయాలా? కాంగ్రెస్ పై సీఎం జగన్ విమర్శలు