![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
YSRCP 9th List: వైసీపీ ఇంఛార్జ్‌ల 9వ జాబితా వచ్చేసింది, ఈసారి విజయసాయిరెడ్డికి చోటు
YSRCP News: త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికలకుగానూ సమన్వయకర్తల 9వ జాబితాను వైఎస్సార్ సీపీ విడుదల చేసింది. అనూహ్యంగా విజయసాయిరెడ్డికి అవకాశం ఇచ్చారు.
![YSRCP 9th List: వైసీపీ ఇంఛార్జ్‌ల 9వ జాబితా వచ్చేసింది, ఈసారి విజయసాయిరెడ్డికి చోటు YS Jagan YSRCP releases 9th List of incharges for AP Elections 2024 YSRCP 9th List: వైసీపీ ఇంఛార్జ్‌ల 9వ జాబితా వచ్చేసింది, ఈసారి విజయసాయిరెడ్డికి చోటు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/01/a5050483e0b2a1218ea4dc167c820ae61709309458827233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YSRCP 9th List: అమరావతి: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం అధికార పార్టీ వైఎస్సార్ సీపీ 9వ జాబితా విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిల నియమిస్తూ లిస్ట్‌ను రిలీజ్ చేశారు. నెల్లూరు ఎంపీ స్థానానికి ఇంఛార్జ్‌గా, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిని నియమించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎండీ ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్), మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యని నియమిస్తూ వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో గంజి చిరంజీవిని మంగళగిరికి సమన్వయకర్తగా నియమించగా.. తాజాగా ఆయనను తప్పిస్తూ, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు లావణ్యకు అవకాశం ఇచ్చారు జగన్.
స్థానం - సమన్వయ కర్త
నెల్లూరు పార్లమెంట్ - వి.విజయసాయిరెడ్డి
మంగళగిరి - మురుగుడు లావణ్య
కర్నూలు - ఎండీ ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్)
జాబితాల వారీగా ఎంత మందికి ఛాన్స్ ఇచ్చారంటే...
వైసీపీ ఇంఛార్జ్‌ల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జిలను జగన్ ప్రకటించారు. రెండో జాబితాలో మరో 27 స్థానాలకు (మూడు ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు (ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో లిస్టులో ఎనిమిది స్థానాలకు (ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ) ఇంఛార్జీలను ప్రకటించారు. ఐదో జాబితాలో ఏడు స్థానాలకు (3 అసెంబ్లీ, 4 ఎంపీ) కొత్త ఇంఛార్జిలను నియమించారు. 6వ జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటిస్తూ వైసీపీ జాబితా విడుదల చేసింది. 7వ జాబితాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించారు. 8వ జాబితాలో 2 పార్లమెంట్, 3 అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జ్‌లను వైఎస్ జగన్ నియమించారు. తాజాగా రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి వైసీపీ సమన్వయ కర్తల్ని ప్రకటించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)