అన్వేషించండి

TS Congress : ఠాగూర్‌ను తప్పిస్తే సీనియర్లు సర్దుకుపోతారా ? తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరగబోతోంది ?

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ను తప్పిస్తే సీనియర్లు సర్దుకుపోతారా ? మరో కొత్త డిమాండ్ పెడతారా ?


TS Congress :  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ అస్త్ససన్యాసం చేశారు. సీనియర్లు చేస్తున్న రాజకీయం తట్టుకోలేక తన వల్ల కాదని రాహుల్ గాంధీకి చెప్పేశారని.. వెంటనే తెలంగాణ కాంగ్రెస్‌తో ఉన్న సమాచార సంబంధాలను తెంచేసుకున్నారని అంటున్నారు. ఇందులో నిజం ఎంతో కాంగ్రెస్ పార్టీ అధికారిక  ప్రకటన చేస్తే తప్ప తెలియదు కానీ సీనియర్ల అసంతృప్తి మాత్రం పార్టీని ఏదో ఓ వైపు  నెట్టేస్తుందని మాత్రం తాజా  పరిణామాలతో స్పష్టమవుతోంది. 

హైకమాండ్ తీసుకునే నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్న సీనియర్లు 

ఉవ్వేత్తున్న ఎగిసిపడిన కాంగ్రెస్ సీనియర్లు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.  రేవంత్ రెడ్డి ఉంటే తాము కొనసాగడం కష్టమని తేల్చి చెప్పిన వారు ఇప్పుడు నోరు తెరవడం లేదు. భట్టి విక్రమార్క రేవంత్ కలిసి వేదిక పంచుకున్నారు. కానీ ఆయన ఆ సమావేశంలోనూ సెటైర్లు వేశారు.  ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయం కోసం ఎెదురు చూడటమే.  జీ-9 నేతలకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కొన్ని హామీలు ఇచ్చారు.   టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్ల అసమ్మతి పెరిగిపోయి తాడో పేడో తేల్చుకునేందుకు సీనియర్లు సిద్ధమవుతున్న తరుణంలోనే దిగ్విజయ్ సింగ్ రంగ ప్రవేశం చేశారు.  నేతలందరినీ లెక్కపెట్టి విడివిడిగా దిగ్విజయ్ మాట్లాడారు. ఢిల్లీ వెళ్లి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. 

సమస్యల పరిష్కార ఫార్ములానూ దిగ్విజయ్ సింగ్ సూచించారా ?

దిగ్విజయ్ సింగ్ సీనియర్లు ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు. పార్టీలో అందరూ సమానమేనని చెప్పారు. సీనియర్ల కంటే రేవంత్ ఎక్కువేమీ కాదని తేల్చారు. అదే మాట తర్వాత ప్రెస్ మీట్ లో కూడా వెల్లడించారు. పార్టీలో ఎవరూ సీనియర్లు కాదు ఎవరూ జూనియర్లు కాదని పరిస్థితులను బట్టి ఎవరి పాత్ర వారు పోషించాల్సి ఉంటుందని చెప్పారు. ఒక్కొక్కరితో విడిగా మాట్లాడినప్పుడు సీనియర్ల తప్పొప్పులను ఆయన విశ్లేషించినట్లు చెబుతున్నారు. వాఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు. అన్యాయం జరుగుతోందని భావించిన పక్షంలో అధిష్టానం దృష్టికి తీసుకురావచ్చని అందుకు తాజా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా ఢిల్లీ నేతలంతా అందుబాటులో ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ప్రతీ విషయానికి మీడియా కెమెరాల ముందుకు వెళితే వాళ్లే పలుచనైపోతారని దిగ్విజయ్ సీరియస్ సూచించినట్లుగా చెబుతున్నారు. 

సీనియర్లు ఇతర పార్టీల వైపు చూస్తున్నారా ? 

 కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ కూడా ఒక్కరిద్దరు నేతలతో ఫోన్లో మాట్లాడి పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే తెలంగాణలోనూ జాతీయ స్థాయిలోనూ వరుసగా రెండు సార్లు ఓడిపోయామని మరోసారి ఓటమి పాలైతే అందరికీ ఇబ్బందేనని వివరించారు. సంఘీభావమే బలమన్నది మరిచిపోకూడదని అగ్రనేతలు హితబోధ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే తమకు ఇతర పార్టీల్లో చేరే ఆలోచన ఏదీ లేదని కానీ.. పార్టీనే నమ్ముకుని ఉన్న తమకు అవమానాలు జరుగుతున్నాయని సీనియర్లు అంటున్నారు. పరిష్కారంగా.. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ ను మార్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే సీనియర్ల సమస్య అసలు ఇంచార్జ్..  టీ పీసీసీ పదవా అన్నదానిపై క్లారిటీ లేదు. ఇంచార్జ్ తో ఏ సమస్యా లేదని.. అనుకున్నపదవి రాకపోతే  కొత్తగా వచ్చే ఇంచార్జిపైనా నిందలేస్తారని కొంత మంది వాదిస్తున్నారు. కారణం ఏదైనా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో జరగబోయే పరిణామాలు కీలకమైనవిగా మారాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
AR Rahman - Mohini Dey: గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
Gautam Adani Charged In New York: గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
Embed widget