By: ABP Desam | Updated at : 10 Mar 2022 04:41 PM (IST)
ఇక బీజేపీ గురి తెలుగు రాష్ట్రాలపైనేనా ?
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అధికార వ్యతిరేకత పెరుగుతోందని వస్తున్న అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఉత్తరాదిన ఆ పార్టీకి తిరుగులేదని అర్థమైపోయింది. ఇప్పుడు ఆ పార్టీ దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఇతర రాష్ట్రాల్లోనూ తనదైన ముద్ర వేయడానికిచాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఈ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో మరింత అడుగు ముందుకేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాల్లో ఫైర్ కనిపించే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. కానీ పట్టు చిక్కడం లేదు. అందు కోసం ఒక ఓటు.. రెండు రాష్ట్రాలు అనే తీర్మానం చేసి.. సమయం చూసి రెండు రాష్ట్రాలుగా విడగొట్టడానికి సహకరించింది. బీజేపీకి ఈ పరిణామం బాగా ఉపయోగపడుతోంది. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెల్చుకుని సంచలనం సృష్టించిన బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. బీజేపీ ఇప్పటికే ఫుల్ స్వింగ్‌లో ఉంది. టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటోంది. ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో లభించిన విజయంతో ... ముఖ్యంగా యూపీలో లభించిన విజయంతో బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణలో రాజకీయాలు చేసే అవకాశం ఉంది.
కేంద్రంలో ఉన్న అధికార పార్టీగా బీజేపీకి ఓ స్టైల్ ఉంది. ఏదైనా రాష్ట్రంలో జెండా పాతాలంటే...తనదైన స్టైల్‌లో ఎంట్రీ ఇస్తుంది. తెలంగాణలో ఇప్పుడు ఆ ఎంట్రీ అయిపోయింది. రైజ్ మాత్రమే మిగిలింది. అధికార పార్టీ టీఆర్ఎస్‌ను ... బీజేపీ హైకమాండ్ చాలా గట్టిగా గురి పెట్టిందన్న ప్రచారం కొంత కాలంగా ఢిల్లీలో జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ కార్యాచరణ ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీజేపీ గురి పెడితే ముందుగా దర్యార్తు సంస్థలు వస్తాయి.. ఆ తర్వాత ఫిరాయింపులు జరుగుతాయి. చివరికి బీజేపీ జెండా పాతేస్తుంది. బెంగాల్ లాంటి చోట్ల తప్పితే మిగతా చోట్ల అదే జరిగింది. తెలంగాణలోనూ గురి తప్పకూడదని భావించే అవకాశం ఉంది. అయితే జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయని..అవి పూర్తయిన తర్వాతే తెలంగాణలో అసలైన యాక్షన్ ప్రారంభమవుతుందన్న అభిప్రాయం బీజేపీలో కూడా వినిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ముందు తెలంగాణపై దృష్టి సారించే అవకాశం ఉంది. అయితేఏపీలో ఎలాంటి వ్యూహం అవలంభిస్తుందన్నదానిపై క్లారిటీ లేదు. తెలంగాణలో బీజేపీకి పొటెన్షియల్ లీడర్లు ఉన్నారు. కానీ ఏపీలో అలాంటివారే కరవయ్యారు. పైగా అధికార పార్టీ బీజేపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ కూడా బీజేపీతో విరోధం కోరుకోవడం లేదు. దీంతో ఏపీలో బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందనేది.. అంచనా వేయడం కష్టమే. ముందు తెలంగాణను టార్గెట్ చేసుకుని అక్కడ లక్ష్యాన్ని రీచ్ అయిన తర్వాత బీజేపీ నేతలు... ఏపీవైపు దృష్టి సారించే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు.
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
దమ్ముంటే సిట్‌కు బీజేపీ నేతలు ఆధారాలు ఇవ్వాలి- మంత్రి జగదీశ్ రెడ్డి
Congress: భట్టి విక్రమార్క పాదయాత్రలో వర్గపోరు - నేతల మధ్య తోపులాట! కన్నీళ్లు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్సీ
Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!
Warangal Politics : సిట్టింగ్ లకే సీట్లైతే గులాబీ పార్టీలో ముసలం తప్పదా? ఓరుగల్లులో మారనున్న రాజకీయ సమీకరణాలు
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం
Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?