అన్వేషించండి

TVK Vijay: పొత్తులను పట్టించుకోకపోవడమే టీవీకే విజయ్‌కు సమస్య - అందరూ మూడో స్థానమేనని ఎలా అంచనా వేస్తున్నారు?

Tamil Nadu: టీవీకే విజయ్ ప్రధాన పోటీదారుగా నిలబడలేకపోతున్నారు. మొదటి నుంచి ఫ్యాన్స్ బలాన్ని చూసుకుని ఆయన పొత్తులను నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు వెనుకబడిపోయారన్న ప్రచారం జరుగుతోంది.

Tamil Nadu Assembly Elections: తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కళగం పార్టీతో ఒక సంచలనంలా మెరిసినప్పటికీ, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ క్షేత్రస్థాయిలో ఆయన ఎదుర్కొంటున్న సవాళ్లు ఆయన్ని వెనుకబడిపోయేలా చేస్తున్నాయి.  ఏప్రిల్ 23, 2026న జరగనున్న పోలింగ్‌కు ముందు తమిళనాడు రాజకీయ చిత్రం ప్రధానంగా DMK-నేతృత్వంలోని కూటమి ,  AIADMK-BJP కూటమి మధ్యే కేంద్రీకృతమైంది.  

ఒంటరి పోరు - అతివిశ్వాసమా? వ్యూహలోపమా?

విజయ్ తన పార్టీని స్థాపించినప్పటి నుండి ఎటువంటి కూటముల్లో చేరకుండా 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో గత 50 ఏళ్లుగా ఏదో ఒక ప్రధాన ద్రావిడ పార్టీతో కూటమి లేకుండా గెలవడం అసాధ్యమనేది చరిత్ర చెబుతున్న సత్యం. విజయ్ ఈ విషయాన్ని విస్మరించి, కేవలం తనకున్న  స్టార్ ఇమేజ్  తోనే గట్టెక్కవచ్చని భావించడం ఆయనకు పెద్ద మైనస్ అయింది. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలు లేకపోవడం, జిల్లాల్లో బలమైన రెండో శ్రేణి నాయకత్వం కరువవ్వడం విజయ్ పార్టీని బలహీనపరుస్తోంది.

ఓట్ల చీలిక - స్టాలిన్‌కు వరమా?                      

విజయ్ ప్రధానంగా DMKని తన బద్ధశత్రువుగా ప్రకటించుకున్నారు. అయితే, విశ్లేషకుల ప్రకారం విజయ్ చీల్చే ఓట్లు ప్రతిపక్షమైన AIADMK లేదా తటస్థ ఓటర్లవే అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, అంతిమంగా ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌కే మేలు జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. విజయ్‌ను బి-టీమ్ గా చిత్రీకరించే ప్రయత్నం కూడా జరుగుతోంది, ఇది తటస్థ ఓటర్లలో సందిగ్ధతను పెంచుతోంది.

కూటముల బలం - విజయ్ ఏకాకి

ప్రస్తుతం DMK కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు వంటి బలమైన భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. అటు AIADMK కూడా BJP , PMK వంటి పార్టీలతో పటిష్టమైన పొత్తు కుదుర్చుకుంది. ఈ రెండు పెద్ద కూటముల మధ్య విజయ్ ఒక  X-Factor  గా మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. విజయ్ కనీసం 15-20% ఓట్లు సాధించినా, అవి సీట్లుగా మారే అవకాశం తక్కువని, కేవలం కింగ్ మేకర్ కావాలని ఆయన ఆశించినా అది కూడా కష్టమేనని సర్వేలు చెబుతున్నాయి.

అనుభవలేమితోనే సమస్య 

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా విజయ్ కీలక రాష్ట్ర సమస్యలపై  స్పష్టమైన వైఖరి తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం అవినీతి నిర్మూలన అనే సాధారణ నినాదంతో ఓట్లు పడవని, ప్రజలకు ఒక  విజన్  చూపించడంలో ఆయన విఫలమయ్యారని తమిళ విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 2025లో జరిగిన ఒక తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ వంటి చట్టపరమైన చిక్కులు కూడా ఆయన ప్రచార సమయాన్ని వృధా చేశాయి. విజయ్ సభలకు జనం విపరీతంగా వస్తున్నా, ఆ జనం ఓట్లుగా మారుతారా అనేది పెద్ద ప్రశ్న. ఎంజీఆర్, జయలలిత కాలం నాటి సినిమా గ్లామర్ పాలిటిక్స్ ఇప్పుడు పని చేయడం లేదు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ఒక లాంగ్ టర్మ్ ' ప్రాజెక్టుగా భావిస్తే ఈ ఎన్నికలు ఆయనకు ఒక పాఠంలా మిగులుతాయి.  

టాప్ హెడ్ లైన్స్

Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Telangana Graduate MLC Elections 2027: పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget