అన్వేషించండి

Iran War Updates: ముంచుకొస్తున్న ట్రంప్ డెడ్ లైన్ - పది పాయింట్ల శాంతి ప్రణాళిక ప్రతిపాదించిన ఇరాన్

Iran: శాంతి కోసం ఇరాన్ తాజాగా పది పాయింట్ల ప్రణాళికను అమెరికాకు పంపింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఈ చర్చలు జరుగుతున్నాయి.

Iran 10 point response to US : అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల శాంతి ప్రణాళికను తిరస్కరిస్తూ, ఇరాన్ తన సొంత 10 పాయింట్ల ప్రతిపాదన ను పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ద్వారా వాషింగ్టన్‌కు అందజేసింది. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. 

ఐదు వారాలుగా కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం ఒక కీలక మలుపు తిరిగింది. తాత్కాలిక కాల్పుల విరమణను తిరస్కరిస్తూ, శాశ్వత ప్రాతిపదికన యుద్ధం ముగియాలని కోరుతూ ఇరాన్ ఒక సమగ్ర ప్రణాళికను వెల్లడించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నప్పటికీ, తమ అంచనాలకు తగ్గట్టుగా లేదని వ్యాఖ్యానించారు.

 ఇరాన్ ప్రతిపాదించిన ప్రధాన అంశాలు 

ఇరాన్ తన రక్షణ కోసం కఠినమైన షరతులను విధిస్తూనే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హార్ముజ్ జలసంధిని  తిరిగి తెరిచేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
1.  రక్షణ హామీ:  భవిష్యత్తులో ఇరాన్‌పై ఎటువంటి దాడులు జరగవని అమెరికా గ్యారెంటీ ఇవ్వాలి.
2.  శాశ్వత శాంతి: తాత్కాలిక కాల్పుల విరమణ కాకుండా, యుద్ధాన్ని పూర్తిగా ముగించాలి.
3.  లేబనాన్‌పై దాడుల నిలిపివేత:  హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తక్షణమే ఆపేయాలి.
4.  ఆర్థిక ఊరట:  ఇరాన్‌పై ఉన్న అన్ని అమెరికా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలి.
5.  ప్రాంతీయ సహకారం: ఇరాన్ మిత్రపక్షాలపై జరుగుతున్న దాడులన్నింటినీ నిలిపివేయాలి.

హార్ముజ్ జలసంధి  ఫీజు నిబంధన 

అమెరికా పెట్టిన డెడ్ లైన్  కారణగా హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకల కోసం ఇరాన్ కొత్త నిబంధనలను తెచ్చింది. హార్ముజ్ జలసంధి దాటే ప్రతి నౌక నుంచి  2 మిలియన్ డాలర్ల ఫీజును వసూలు చేస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. ఈ ఫీజు ద్వారా వచ్చే ఆదాయాన్ని పొరుగు దేశమైన ఓమన్‌తో పంచుకుంటామని తెలిపింది. యుద్ధ పరిహారం కోరడానికి బదులుగా, ఈ ఫీజు ద్వారా వచ్చే ఆదాయాన్ని యుద్ధంలో దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం కోసం వినియోగిస్తామని స్పష్టం చేసింది.   

 
ఈ ప్రతిపాదనలపై చర్చలు కొనసాగుతుండగా, మంగళవారం రాత్రిలోగా హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని, లేనిపక్షంలో ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించడం ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్ ప్రతిపాదనలు యుద్ధాన్ని ముగింపు దశకు తీసుకెళ్తాయా లేక మరింత ఘర్షణకు దారితీస్తాయా అన్నది రానున్న కొన్ని గంటల్లో తేలనుంది.                                  

టాప్ హెడ్ లైన్స్

World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Embed widget