Presidential elections : రాష్ట్రపతి ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డిదే అసలైన రికార్డు ! 1977లో ఏం జరిగిందంటే ?
రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పటి వరకూ ఒక్క సారే ఏకగ్రీవం అయ్యాయి. ఆ ఒక్కసారి కూడా గెలిచింది నీలం సంజీవరెడ్డి !
Presidential elections : రాష్ట్రపతి ఎన్నికలు పదిహేను సార్లు జరిగాయి. అయితే ఇప్పటి వరకూ 1977లో జరిగిన రాష్ట్రపతి ఎన్నిక మాత్రమే ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే ఆ ఒక్క సారి మాత్రమే రాష్ట్రపతి అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. ఏడోసారి మాత్రమే రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఇంతవరకూ ఆ రికార్డు చెరిగిపోలేదు. ఆ ఎన్నికలో మొత్తం 37 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, రిటర్నింగ్ అధికారి 36 నామినేషన్లను తిరస్కరించారు. దాంతో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడిన నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మి లేరు.
ఇందిరాగాంధీ మద్దతు లేక ఓ సారి ఓడిపోయిన నీలం సంజీవరెడ్డి
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసిన తెలుగువారు చాలా తక్కువ. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు, నీలం సంజీవరెడ్డి తదితరులు పోటీ చేశారు. జస్టిస్ కోకా సుబ్బారావు తన ప్రధాన న్యాయమూర్తి పదవి ఇంకా మూడు నెలలుండగానే వైదొలగి పోటీ చేశారు. 1967లో జరిగిన 4వ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. జాకీర్ హుస్సేన్ రాష్ట్రపతి అయ్యారు. అయితే ఆయన పదవీ కాలం మధ్యలోనే చనిపోవడంతో 1969లో జరిగిన 5వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన వీవీ గిరిపై అధికార కూటమి అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి పోటీచేసి ఓడిపోయారు.
ఎమర్జెన్సీ తర్వాత 1977లో ఇందిరా ఓటమి.. రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి గెలుపు !
కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డి నిబలడినా ఓడిపోవడం రాజకీయవర్గాల్లో సంచలనం. ఆయన్ను ఓడించడానికి ఉప రాష్ట్రపతి వీవీ గిరి ఇండిపెండెంటుగా రంగంలో దిగారు. రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున నిలబడినా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆయనకు మద్దతివ్వలేదు. అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీనే కానీ హైకమాండ్ కాదు. అప్పటి కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షాలైన స్వతంత్ర, జనసంఘ్ పార్టీలను తమ ద్వితీయ ప్రాధాన్య ఓట్లను నీలం సంజీవరెడ్డికి వేయాలని కోరారు. దీంతో ఇందిరా గాందీ అంతరాత్మ ప్రబోధంతో ఓటు చేయాలని తన పార్టీ వారికి పిలుపు ఇవ్వడంతో అందరూ ఆమె మనసు గుర్తించి వీవీ గిరికి ఓట్లేశారు.
రాష్ట్రపతి భవన్‌లో నివసించని నేత నీలం
1977లో ఇందిరా గాంధీ ఓడిపోయారు. నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికవడం విశేషం. సంజీవరెడ్డి రాష్ట్రపతి భవన్‌లో నివసించడానికి నిరాకరించడమే కాదు, నాడు దేశంలో పేదల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని తన జీతంలో తానే 70 శాతం కోత విధించుకున్నారు.నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ పదవికి ఎన్నికైనా వారంతా జులై 25వ తేదీనే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.