అన్వేషించండి

CM Jagan Name in YS Viveka Case : సీఎం జగన్‌ను సీబీఐ విచారణకు పిలుస్తుందా ? - వివేకా హత్య కేసులో సంచలనాలు తప్పవా ?

వైఎస్ వివేకా హత్య కేసులో తర్వాత ఏం జరగబోతోంది ?సీఎం జగన్ పేరు ప్రస్తావనతో కేసు కీలక మలుపు తిరిగిందా ?సీఎం జగన్‌ను సీబీఐ ప్రశ్నిస్తుందా ?

CM Jagan Name in YS Viveka Case :   వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మొదటి నుండి ఏపీ రాజకీయాల్లో సంచలనమే. సీబీఐ విచారణ ఆగుతూ సాగుతోంది. మధ్యలో సుప్రీంకోర్టు ఆలస్యమవుతోందని దర్యాప్తు అధికారిని మార్చారు. అయితే ఇప్పుడు కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో ప్రస్తావించింది. వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయారని ముందుగా తెలిసినట్లుగా చెబుతున్న ఎంవీ కృష్ణారెడ్డి కంటే చాలా ముందుగానే సీఎం జగన్‌కు తెలుసని అఫిడవిట్‌లో సీబీఐ స్పష్టం చేసింది. టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా ఓ సీఎంపై సాదాసీదాగా ఇలాంటి అఫిడవిట్లను సీబీఐ దాఖలు చేయదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ కేసులో తదుపరి ఏం జరగబోతోందన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. 

సీఎం జగన్‌ను సీబీఐ ప్రశ్నిస్తుందా ?

ఈ కేసులో ఇప్పటి వరకూ సీఎం జగన్ గురించి సీబీఐ ఎలాంటి ప్రస్తావన తీసుకు రాలేదు. తొలి సారి ఆయన పేరును ప్రస్తావించారు. అది కూడా విస్తృతమైన కుట్రను వెలికి తీసే క్రమంలో .. చేస్తున్న దర్యప్తులో భాగంగా ఈ అంశంపై దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. అంటే వైఎస్ వివేకాను హత్య చేసిన తర్వాత పీఏ కృష్ణారెడ్డి ఉదయమే వచ్చి చూడక ముందే అసలు హత్య జరిగిపోయిందని బయట కొంత మందికి తెలిసింది. అదేలా అన్నది ఇప్పుడు సీబీఐ తేల్చాల్సి ఉంది. అలా జరిగిందని తెలిసిన వారే కుట్ర దారులు కావొచ్చన్న అనుమానాలు సహజంగానే దర్యాప్తు సంస్థలు వ్యక్తం చేస్తాయి. ఈ క్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. 

రాజీనామాకు విపక్ష నేతలు డిమాండ్ చేసే అవకాశం ! 

సీఎం జగన్ పేరు కౌంటర్ అఫిడవిట్‌లో ఉండటంతో విపక్ష పార్టీ నేతలు సీఎం జగన్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. సొంత బాబాయ్ హత్య కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని ఇప్పటికే వైఎస్ సునీత సహా పలువురు ఆరోపించారు. అందుకే కోర్టుకు వెళ్లి సీబీఐ కి కేసు వెళ్లేలా చేశారు. ఇప్పుడు నేరుగా సీఎం పేరును సీబీఐ కూడా ప్రస్తావించడంతో ఆయనపై మరింత ఘాటు విమర్శలు చేసే అవకాశం ఉంది. ఒక వేళ సీబీఐ ఆయనను ప్రశ్నించడానికి నోటీసులు ఇస్తే రాజీనామాకూ పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. సీబీఐ అధికారులు ఈ విషయంలో ఎంత టెక్నికల్ ఎవిడెన్స్ తో కోర్టులో గట్టి వాదనలు వినిపిస్తారన్నది ఏపీ రాజకీయాల్లోనూ కీలక పరిణామాలకు కారణయ్యే అవకాశం ఉంది. 

సీబీఐ అఫిడవిట్‌పై వైఎస్ఆర్‌సీపీ స్పందన ఎలా ఉంటుంది ?

సీబీఐ అఫిడవిట్‌పై జగన్ తరపు లాయర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని దీని వెనుక కుట్ర ఉందని చెప్పినట్లుగా మొదట్లో ప్రచారం జరిగింది. అయితే తర్వాత న్యాయపరమైన అంశం కావడం.. కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ కావడంతో.. ఆ స్పందనను వెనక్కి తీసుకున్నారు. న్యాయపరంగా ఏం చేయాలన్నదానిపై ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఓ సీఎంపై ఆషామాషీగా ఇలాంటి ఆరోపణలు చేయదని.. భావిస్తున్నారు. అందుకే ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ ఏర్పడుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
AP Coalition MLAs Controversies: ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
Revanth Reddy Governance Criticisms: రాజకీయాల్లో దూకుడు - పథకాల అమల్లో ఆలస్యం - రేవంత్ పాలనలో వెనుకబడుతున్నారా?
రాజకీయాల్లో దూకుడు - పథకాల అమల్లో ఆలస్యం - రేవంత్ పాలనలో వెనుకబడుతున్నారా?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
Embed widget