అన్వేషించండి

Vizianagaram News: విజయనగరం ఎంపీ సీటుకు టిడిపిలో పోటీ.. ప్రముఖంగా ఆ ఇద్దరి పేర్లు

టిడిపి, జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించేదిగా ఇరు పార్టీల అగ్ర నాయకులు దృష్టి సారించారు. పొత్తుపై స్పష్టత వచ్చిన సీట్ల నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించే దిశగా ఇరు పార్టీలు సిద్ధమవుతున్నాయి.

Vizianagaram Tdp : సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతోంది. అధికార వైసిపి జోరుగా అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో టిడిపి, జనసేన కూటమి నుంచి కూడా అభ్యర్థులను ప్రకటించేదిగా ఇరు పార్టీల అగ్ర నాయకులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే పొత్తుపై స్పష్టత వచ్చిన కొన్ని సీట్ల నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించే దిశగా ఇరు పార్టీలో సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో విజయనగరం పార్లమెంటు స్థానం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాన్ని కేటాయించేలా ఒప్పందం జరిగినట్టు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి డెంకాడ ఎంపీపీగా పని చేస్తున్న కంది చంద్రశేఖర్ తోపాటు వెంకటేష్ పేర్లను తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తోంది. వీరిలో ఒకరికి సీటు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. వీరు కాకుండా  పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న మరో ఇద్దరు సీనియర్ నాయకులు కూడా తమ స్థాయిలో తీవ్రంగా ప్రయత్నాలను సాగిస్తున్నారు.

 అశోక్ కుటుంబం నుంచి నిరాసక్తత

 గత ఎన్నికల్లో విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి అశోక్ గజపతిరాజు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి పోటీ చేసేందుకు ఆయన తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు అలియాస్ శ్రీనును బరిలోకి దించేందుకు వైసిపి ఆలోచన చేస్తోంది. వీరిద్దరిలో ఎవరికి సీటు కేటాయించాలన్న దానిపై వైసీపీ నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడి అభ్యర్థిని బట్టి  కూటమి అభ్యర్థిగా బలమైన వ్యక్తిని బరిలోకి దించాలని టిడిపి భావిస్తోంది. ప్రస్తుతం పరిశీలిస్తున్న వెంకటేష్, చంద్రశేఖర్ తోపాటు విదేశాల ఉంటున్న ఒక ఎన్నారై పేరును తెలుగుదేశం పరిశీలిస్తోంది. బొత్స కుటుంబం నుంచి ఎవరైనా బరిలోకి దిగితే  వారిని ధీటుగా  ఎదుర్కొనేందుకు ఆర్థిక, అంగ బలం ఉన్న వ్యక్తులను ఇక్కడ బరిలోకి దించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఆర్థిక స్తోమతతోపాటు సామాజిక సమీకరణాల లెక్కలను అధిష్టానం వేస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించితే విజయావకాశాలు పుష్కలంగా ఉంటాయన్న ఉద్దేశంతోనే చంద్రశేఖర్  పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. జనసేన కూడా ఈ స్థానం పట్ల ఆసక్తిని చూపించకపోవడంతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయడం కన్ఫామ్ అయింది.

 టిడిపిలోకి చేరే ఛాన్స్

 వైసీపీలో సీట్ల వ్యవహారం కొలిక్కి వస్తే అసంతృప్తితో ఉండే కొందరు నేతలు టిడిపిలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ జాబితాలో ఎస్.కోటకు చెందిన ఒకరిద్దరు ముఖ్య నాయకులతోపాటు చీపురుపల్లి నుంచి కూడా సీటు రాకపోతే కీలక నేత టిడిపిలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఆ నేత టిడిపిలో చేరితే ఇబ్బందులు ఉంటాయని భావిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ.. సదరు నేత సీటుకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో విజయనగరం ఎంపీ సీటు దక్కించుకోవడంపై  ఇరు పార్టీల్లోనూ పోటీ నెలకొనడం అధిష్టానాలకు ఇబ్బందికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఇరు పార్టీల అభ్యర్థులుగా ఎవరు బరిలో ఉంటారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

టాప్ హెడ్ లైన్స్

Municipal Elections 2026 Reservations: ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల
ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
AP Coalition MLAs Controversies: ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Embed widget