అన్వేషించండి

Vizag Data Center Pollution Controversy: హైదరాబాద్‌లో డేటాసెంటర్లు మంచివి అయితే విశాఖలో కాలుష్యమా? - ఇలా ఎందుకు ఉద్యమాలు జరుగుతున్నాయి?

Andhra Pradesh Data Centers: విశాఖలో డేటా సెంటర్లపై పర్యావరణ నిరసనలు, తెలంగాణలో మద్దతు. ఏపీలో పెట్టుబడులను అడ్డుకునే రాజకీయాలు నడుస్తున్నాయా?

 AP Politics Investments vs Protests 2026:   విశాఖపట్నంలో ప్రతిపాదిత బిగ్ డేటా సెంటర్లు  కాలుష్యానికి, నీటి కొరతకు దారితీస్తాయంటూ కొన్ని పర్యావరణ పరిరక్షణ సంఘాలు, ప్రతిపక్ష మద్దతుదారులు సెమినార్లు, నిరసనలు నిర్వహిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో, హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న భారీ డేటా సెంటర్లకు తెలంగాణలో పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు.  ఒకే రకమైన ప్రాజెక్టులకు రెండు పొరుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భిన్నమైన వాతావరణం కనిపించడం వెనుక సాంకేతిక కారకాల కంటే రాజకీయ ,  సామాజిక సమీకరణాలే ఎక్కువగా పనిచేస్తున్నాయని భావిస్తున్నారు.

డేటా సెంటర్లకు అవసరమైన వాటిపై తప్పుడు ప్రచారాలు

ముఖ్యంగా విశాఖలో స్థానిక భౌగోళిక పరిస్థితులు, నీటి వనరుల లభ్యతపై వస్తున్న ఆందోళనలను కొందరు కాలుష్య కోణంలో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. డేటా సెంటర్ల నిర్వహణకు భారీగా సర్వర్ల కూలింగ్ కోసం నీరు, నిరంతర విద్యుత్ అవసరమవుతాయి. ఇప్పటికే తాగునీటి సరఫరాపై ఒత్తిడి ఉన్న వైజాగ్ నగరంలో ప్రైవేట్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేస్తే భవిష్యత్తులో స్థానిక ప్రజలకు ఇబ్బందులు వస్తాయని, ప్రాజెక్టుల వల్ల స్థానికంగా ఉద్యోగావకాశాలు తక్కువగా ఉంటాయనే ప్రచారాన్ని కొన్ని సంఘాలు ముందు వరుసలో నిలబెడుతున్నాయి. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ వాదనలను తీవ్రంగా ఖండిస్తూ.. పొలవరం పారిశ్రామిక కేటాయింపుల ద్వారా డేటా సెంటర్లకు ప్రత్యేకంగా నీటిని ఇస్తామని, తాగునీటి సరఫరాకు ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేస్తోంది.

హైదరాబాద్‌లో భారీ డేటా సెంటర్ 

అయితే తెలంగాణ విషయానికి వస్తే, హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ స్థాయి పారిశ్రామిక, ఐటీ మౌలిక వసతులతో  సిద్ధంగా ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల డ్రై లాండ్స్  ఎక్కువగా ఉండటం, కృష్ణా-గోదావరి నీటి కేటాయింపుల నెట్‌వర్క్ వ్యవస్థీకృతంగా ఉండటంతో అక్కడ పర్యావరణ ముప్పు అనే ప్రచారం రూపుదిద్దుకోలేదు. పైగా గత దశాబ్ద కాలంగా హైటెక్ ఐటీ హబ్‌గా ఎదిగిన హైదరాబాద్‌లో డేటా సెంటర్ల నిర్మాణం అనేది అభివృద్ధిలో ఒక భాగమనే స్పృహ  ప్రజల్లో బాగా పాతుకుపోయింది. ప్రతిపక్షాలు కూడా పెట్టుబడుల కల్పన, ఉపాధి ప్రాజెక్టులపై నిరసనలు చేయడం ద్వారా పొలిటికల్ మైలేజ్ రాదని భావించి మౌనంగా ఉంటున్నాయి.

ఏపీలో పెట్టుబడులపై వ్యతిరేక ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెట్టుబడుల చుట్టూ క్రమం తప్పకుండా పొలిటికల్ నెరేటివ్ నడవడం పాత ముచ్చటే. గతంలో కూడా విశాఖపట్నం, అమరావతి,  రాయలసీమకు వచ్చే భారీ ప్రాజెక్టుల విషయంలో అధికార-ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి రాజకీయం నడిచింది. ప్రభుత్వం మారినప్పుడల్లా ముందటి నిబంధనలను సవరించడం , ప్రాజెక్టులపై రీ-లాంఛ్ లేదా విచారణలు జరిపించిన చరిత్ర ఉంది. ఈ రాజకీయ అస్థిరత వల్లే కొందరు వైజాగ్ డేటా సెంటర్ల కాలుష్యం, సోర్సెస్ కరిగిపోతున్నాయంటూ ప్రచారం చేసి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఈ వేదికను వాడుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇన్వెస్టర్లతో మైండ్ గేమ్ ఏపీకే నష్టం

ప్రకృతి వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం సమంజసమే అయినప్పటికీ, ఏపీకి వచ్చే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లను అడ్డుకునే విధంగా కాలుష్య భయాలు సృష్టించడం వల్ల రాష్ట్ర ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. సాంకేతికంగా చూస్తే, ఆధునిక డేటా సెంటర్లు ఎయిర్-కూలింగ్ విధానాలు, రీసైకిల్డ్ వాటర్ , గ్రీన్ ఎనర్జీని   ఎక్కువగా వాడుతున్నాయి. అందువల్ల, ప్రభుత్వం పారదర్శకంగా పర్యావరణ నివేదికలను ప్రజల ముందుకు తెచ్చి, మైండ్ గేమ్‌లు , రాజకీయ విమర్శలకు చెక్ పెట్టకపోతే.. ఏపీకి రావాల్సిన గ్లోబల్ ఐటీ దిగ్గజాలు పక్క రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ముంచుకొస్తుంది.  

 


  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
AP MPTC ZPTC Elections Schedule: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Janasena Wins Darsi Municipal Chairman: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
Cockroach Janata Party South India: దక్షిణాదిలో తేలిపోయిన కాక్రోచ్ ఉద్యమాలు - ఉత్తరాది ట్రెండ్స్‌ను దక్షిణ భారత యువత తిరస్కరిస్తోందా?
దక్షిణాదిలో తేలిపోయిన కాక్రోచ్ ఉద్యమాలు - ఉత్తరాది ట్రెండ్స్‌ను దక్షిణ భారత యువత తిరస్కరిస్తోందా?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Embed widget