అన్వేషించండి

Uttar Pradesh BJP Political Situation: యూపీలో కమలం గ్రాఫ్ తగ్గుతోందా? యోగి ఆదిత్యనాథ్ అసలు ప్లాన్ అమలు చేయబోతున్నారా?

UP Assembly Election 2027: 2029 పార్లమెంట్ ఎన్నికలకు ముందు గేమ్ ఛేంజర్ లాంటి ఎన్నిక యూపీ అసెంబ్లీ ఎన్నికలు. అక్కడ బీజేపీ ఎదురీదుతోందన్న ప్రచారం ఊపందుకుంది.

Akhilesh Yadav vs Yogi Adityanath: దేశ రాజకీయాలకు దిక్సూచి లాంటి ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ  ఆధిపత్యం క్రమంగా సవాలును ఎదుర్కొంటోందన్న చర్చ అంతటా ఊపందుకుంది. 2017, 2022 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో తిరుగులేని జయభేరి మోగించిన బీజేపీకి.. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు షాక్ ఇచ్చారు. అక్కడితో ఆగలేదని  యూపీలో కమలదళం గ్రాఫ్ ఇంకా కిందకే జారుతోందని, ప్రతిపక్ష ఇండియా కూటమి ఊపందుకుంటోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  దీంతో 2027లో జరగబోయే అసెంబ్లీ సమరంలో బీజేపీకి హ్యాట్రిక్ విజయం సులభం కాదనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

క్రమంగా పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత                         

యూపీలో బీజేపీకి ప్రధానమైన ప్లస్ పాయింట్ యోగీ ఆదిత్యనాథ్ బుల్డోజర్ మార్కు  పాలన, పటిష్టమైన శాంతిభద్రతలు,  కేంద్ర-రాష్ట్ర సంక్షేమ పథకాలు. అయితే దశాబ్దకాలపు ప్రభుత్వ వ్యతిరేకత , యువతలో పెరుగుతున్న నిరుద్యోగిత, పేపర్ లీకేజీల నిరసనలు,  ద్రవ్యోల్బణం క్షేత్రస్థాయిలో ఓటర్లలో అసంతృప్తిని పెంచుతున్నాయి. వీటికితోడు ఓటర్లలో కనిపించే అలసట, స్థానిక నాయకులపై అసంతృప్తి పార్టీ స్థానాలు పడిపోవడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. కేవలం మతపరమైన ధ్రువీకరణ లేదా నరేంద్ర మోదీ-యోగీ ఆదిత్యనాథ్‌ల ఇమేజ్‌పైనే ఆధారపడటం యూపీలో ఇక వర్కవుట్ కాదనేది క్షేత్రస్థాయి ఓటర్లు ఇస్తున్న స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. 

అఖిలేష్ సోషల్ ఇంజినీరింగ్                           
 
మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రూపకల్పన చేసిన పిడిఏ వ్యూహం అంటే వెనుకబడిన తరగతులు, దళితులు, అల్పసంఖ్యాక వర్గాలు  సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం యూపీలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. గతంలో కేవలం యాదవ్-ముస్లిం సమీకరణలకే పరిమితమైన ఎస్పీ, ఇప్పుడు నాన్-యాదవ్ ఓబీసీలు, నాన్-జాతవ్ దళిత వర్గాలను తమవైపు తిప్పుకోవడంలో విజయం సాధించింది. కాంగ్రెస్‌తో జతకట్టి  ఇండియా  కూటమిగా పోటీచేస్తుండటంతో ఓట్లు చీలిపోకుండా ప్రతిపక్షం అత్యంత బలంగా నిలబడగలుగుతోంది. ఇక బీజేపీ అంతర్గత విభేదాలు, సమాజ్‌వాదీ పార్టీ బలపడటమే కాకుండా.. కుల గణన డిమాండ్లు, స్థానిక బీసీ నేతల అసంతృప్తి కమలనాథులను వేధిస్తున్నాయి.

ఇప్పటికీ బీజేపీ వైపే స్వల్ప మొగ్గు                          

 అయితే బీజేపీని తేలికగా తీసిపారేయడానికి వీల్లేదు. ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి నెట్‌వర్క్, బీజేపీ ఓటు బ్యాంకు మేనేజ్‌మెంట్ , ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్‌కు ఇప్పటికీ ఉన్న వ్యక్తిగత క్రేజ్  ఆ పార్టీకి అతిపెద్ద అడ్వాంటేజ్. యూపీలో బీజేపీ పరిస్థితి పూర్తిగా దిగజారకపోయినా, ఒకప్పటి ఏకపక్ష విజయాల శకం మాత్రం ముగిసిపోయింది. 2027 అసెంబ్లీ ఎన్నికల నాటికి నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, బీసీ వర్గాల ఆందోళనలను పరిష్కరించి.. నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే యూపీ పీఠాన్ని కాపాడుకోవడం బీజేపీకి అత్యంత కఠినమైన సవాలుగా మారనుందన్నది ఎక్కువ మంది అభిప్రాయం.              

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Vision 2046: అమరావతికి 20 ఏళ్ల మహా ప్రణాళిక.. రూ. 1.33 లక్షల కోట్ల బడ్జెట్, ఖజానాపై పైసా భారం లేకుండా సెల్ఫ్-సస్టైనబుల్ వ్యూహం!
అమరావతికి 20 ఏళ్ల మహా ప్రణాళిక.. రూ. 1.33 లక్షల కోట్ల బడ్జెట్, ఖజానాపై పైసా భారం లేకుండా సెల్ఫ్-సస్టైనబుల్ వ్యూహం!
CM Revanth Reddy Siddipet Meeting : గులాబీ కంచుకోటలో హస్తం దండయాత్ర: రేవంత్ సభకు ముందే హరీశ్ విమర్శల ఎటాక్ - సిద్దిపేటలో రాజకీయం రాజుకుందా?
గులాబీ కంచుకోటలో హస్తం దండయాత్ర: రేవంత్ సభకు ముందే హరీశ్ విమర్శల ఎటాక్ - సిద్దిపేటలో రాజకీయం రాజుకుందా?
Telangana Cabinet Reshuffle 2026: మూడేళ్ల పాలన వేళ కేబినెట్ ప్రక్షాళన వేడి - టీం రేవంత్‌కు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
మూడేళ్ల పాలన వేళ కేబినెట్ ప్రక్షాళన వేడి - టీం రేవంత్‌కు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
YSRCP 70 Constituency Incharges Change : 70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. ఆర్థిక బలవంతులు దొరుకుతారా?
70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. ఆర్థిక బలవంతులు దొరుకుతారా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
Embed widget