అన్వేషించండి

TVK Vijay Target AIADMK MLAs 2026: అన్నాడీఎంకే ఖాళీ అవ్వడమే విజయ్‌కి కావాలా? టీవీకే ఉప ఎన్నికల ప్లాన్ వెనుక ద్రవిడ రాజకీయ రహస్యం ఇదే!

Tamil Nadu By Elections Vijay TVK Strategy: అన్నాడీఎంకేను ఖాళీ చేయడమే విజయ్ వ్యూహంగా మారింది. అయితే తన మెజార్టీ కోసం ఆయన ఈ పని చేయడం లేదు. దీని వెనుక దీర్ఘ కాలిక వ్యూహం ఉంది.

Vijay Master Plan To Destroy AIADMK:  తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం  శరవేగంగా పావులు కదుపుతోంది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను వరుసగా తన పార్టీలో చేర్చుకుంటూ, వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలనే విజయ్ నయా స్ట్రాటజీ ఇప్పుడు  పెను సంచలనం రేపుతోంది. సాధారణంగా ఒక కొత్త పార్టీ ఇలాంటి చేరికలను ప్రోత్సహిస్తే.. భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లేదా తన సంఖ్యాబలాన్ని మ్యాజిక్ మార్కుకు చేర్చడానికి అని అందరూ భావిస్తారు. కానీ  విజయ్ అసలు ప్లాన్ పూర్తిగా వేరు.

వేవ్ ఓట్లను నమ్మలేం.. కావాల్సింది సాలిడ్ బేస్! 

ఇటీవలి ఎన్నికల ట్రెండ్స్ ప్రకారం విజయ్ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ ఒక బలమైన రాజకీయ మార్పు కావాలనే వేవ్ లో వచ్చినవేనని స్వయంగా విజయ్ భావిస్తున్నారు. ఇలాంటి వేవ్ ఓట్లు తదుపరి ఎన్నికల నాటికి స్థిరంగా ఉంటాయనే నమ్మకం లేదు. అందుకే, తమిళనాడులో బలమైన క్యాడర్ బేస్ ఉన్న అన్నాడీఎంకే ఓటు బ్యాంక్‌ను పూర్తిగా తన వైపు తిప్పుకోవాలని విజయ్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే అన్నాడీఎంకేలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలపై టీవీకే ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రయోగించింది. ప్రస్తుతం ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో, ఆ బలహీనతను విజయ్ క్యాష్ చేసుకుంటున్నారు. 

 ఉప ఎన్నికల అస్త్రం.. సిట్టింగ్ సీట్లలో ‘దళపతి’ సవాల్! 

రాజీనామా చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల స్థానాల్లో రాబోయే ఉప ఎన్నికలు  తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే సిట్టింగ్ స్థానాల్లో టీవీకే అభ్యర్థులు గనుక భారీ మెజారిటీతో విజయం సాధిస్తే.. తమిళనాడులో డీఎంకే కు ప్రత్యామ్నాయం తామేననే విషయాన్ని విజయ్ నిరూపించినట్లవుతుంది.   అన్నాడీఎంకేలో మిగిలి ఉన్న అత్యధిక మంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు భవిష్యత్తు కోసం టీవీకే గూటికి చేరిపోవడం ఖాయం.

 డీఎంకే వర్సెస్ టీవీకే: అన్నాడీఎంకే ఖాళీ అయితే లాభమెవరికి? 

విజయ్ టార్గెట్ కేవలం అన్నాడీఎంకేను దెబ్బతీయడమే కాదు.. తద్వారా ద్రవిడ ముఖచిత్రంలో ఒక పెద్ద శూన్యతను  సృష్టించడం. అన్నాడీఎంకే బలహీనపడితే.. ఆ పార్టీలోని కొందరు నేతలు టీవీకేలో చేరడానికి ఇష్టపడక అధికార డీఎంకే వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది ఆ దిశగా అడుగులు వేస్తున్నారు కూడా. అయితే, నేతలు విడిపోయినా క్షేత్రస్థాయిలో ఉన్న యాంటీ-డీఎంకే  ఓటర్లంతా అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఉన్న విజయ్ వైపు మొగ్గు చూపుతారని దళపతి గట్టిగా నమ్ముతున్నారు. అంటే, అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడం ద్వారా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేతో నేరుగా ‘వన్-టు-వన్’ ఫైట్‌కు రావడమే విజయ్ అంతిమ వ్యూహం. 

రెండే పార్టీలు..ఒకటి టీవీకే..రెండు డీఎంకే 

మొత్తానికి విజయ్ కేవలం సినిమా స్టైల్ పాలిటిక్స్ కాకుండా, పక్కా గ్రౌండ్ లెవెల్ రియాలిటీని బట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో రెండే రాజకీయ శక్తులు ఉండాలని.. ఓ వైపు డీఎంకే ఉంటే..మరో వైపు తాము ఉండాలని విడయ్ భావన.  అన్నాడీఎంకేను పూర్తిగా తుడిచిపెట్టేయాలనే విజయ్  కత్తి  లాంటి ప్లాన్ ఎంతవరకు పారుతుందనేది ఈ ఉప ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి. పళనిస్వామి తన పార్టీని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమైతే.. తమిళనాడులో  AIADMK చాప్టర్ క్లోజ్ అవుతుంది. దశాబ్దాల పాటు పార్టీని నిలబెట్టుకోవడానికి విజయ్‌కు బేస్ దొరుకుతుంది.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget