TRS Twitter : మోదీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేసిన టీఆర్ఎస్ !
ప్రధాని మోదీ తెలంగాణకు శత్రువంటూ టీఆర్ఎస్ ట్విట్టర్‌లో హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేసింది. యాభై వేలకుపైగా ట్వీట్లను టీఆర్ఎస్ కార్యకర్తలు చేశారు.
![TRS Twitter : మోదీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేసిన టీఆర్ఎస్ ! TRS has trended the hashtag on Twitter that Prime Minister Modi is an enemy of Telangana. More than fifty thousand tweets were made by TRS activists. TRS Twitter : మోదీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేసిన టీఆర్ఎస్ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/05/fdce87d14ca3ede11a9382621f3a9dbb_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫ్‌లైన్‌లో కాదు ఆన్‌లైన్‌లోనూ దూకుడుగా ఉంటోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజ్యసభలో చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసనలు చేపడుతున్నారు. అయితే ఆన్‌లైన్‌లోనూ ఈ నిరసనలు గట్టిగా వినిపించేలా ఆ పార్టీ చర్యలు తీసుకుంది. బుధవారం ట్విట్టర్‌లో తెలంగాణకు మోదీ శత్రువు అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు ట్రెండయ్యాయి.
#ModiEnimyOfTelangana @KTRTRS @krishanKTRS pic.twitter.com/8tHIMJ2VPt
— Gudipaka Satish KTRS (@SatishGudipaka1) February 9, 2022
తెలంగాణకు మోడీ శత్రువు అంటూ #ModiEnemyOfTelangana హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని తెలియచేశారు. కేవలం ఒక గంటలోనే 25వేలకు పైగా తెలంగాణ ప్రజలు ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా తమ నిరసనను తెలియజేశారు. దీంతో #ModiEnemyOfTelangana ట్విట్టర్ ట్రెండింగ్‌లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత ఇతర హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. మొత్తంగా #ModiEnemyOfTelangana యాబై వేలకుపైగా ట్వీట్లు చేశారు.
దశాబ్దాలుగా జరిగిన చర్చలు, వేసిన కమిటీలు, చేసిన వాగ్ధానాలు, పోయిన ప్రాణాలు సరిపోలేదంట, ఇంకా చర్చలు జరగాల్సిన అవసరం ఉండే అంట..ఇలాంటి తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే తెలంగాణ ద్రోహులు మన ఎంపీలు అవ్వడం మన దౌర్భాగ్యం..🤮#ModiEnimyOfTelangana @KTRTRS pic.twitter.com/Aumsrm3hZi
— Shiva Warangal (@SkWarangal) February 9, 2022
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ "ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ " అనే హాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేసింది. సుమారు 20 వేలకు పైగా ట్వీట్లు ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యేలా చూసుకుంది. అప్పుడు బీజేపీ కూడా వెంనటే రంగంలోకి దిగి "షేమ్ ఆన్ యు కేసీఆర్" హ్యాష్ ట్యాగ్‌తో ప్రధానికి ఆహ్వానం చెప్పని కేసీఆర్‌ను ప్రశ్నించారు. టీఆర్ఎస్ ట్రెండ్ చేసిన హ్యాష్ ట్యాగ్ కంటే ఎక్కువే వచ్చాయని బీజేపీ ప్రకటించుకుంది.
టీఆర్ఎస్ ఇటీవలి కాలంలో ట్విట్టర్ ట్రెండింగ్‌ల మీద ఎక్కువ దృష్టి పెట్టింది. నెగెటివే కాదు పథకాల విషయంలోనూ ట్రెండింగ్ చేస్తున్నారు. రైతు బంధు పథకం సంబరాలప్పుడు కూడా పార్టీ కార్యకర్తలందరూ ట్వీట్లు చేసి.. ట్విట్టర్ ట్రెండింగ్‌లో నిలబెట్టారు. ప్రస్తుత రాజకీయాల్లో ఆన్‌లైన్ ప్రచారాలూ కూడా అత్యంత కీలకమయ్యాయి. ఈ విషయంలో ఎవరికి వారు బలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ ట్రెండింగ్‌లు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)