అన్వేషించండి

No More PK For TRs : ఐప్యాక్‌కు గుడ్ బై చెప్పేసిన కేసీఆర్ ! పీకే సర్వేలు నచ్చలేదా ? స్ట్రాటజీలా?

ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ సేవలకు టీఆర్ఎస్ గుడ్ బై చెప్పింది. దీనికి కారణం ఏమిటన్నదానిపై తెలంగాణ రాజకీయాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.

 

No More PK For TRs :   పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌పై కేసీఆర్ కురిపించిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. అటు ఫాం హౌస్‌లో ఇటు ప్రగతి భవన్‌లో పీకేతో గంటల తరబడి చర్చించారు. ఐ ప్యాక్ టీంతో కలిసి పని చేస్తున్నామని.. ఆయన ఉచితంగా పని చేయడానికి అంగీకరించారని కేసీఆర్ ప్రకటించారు. ఆయన ఉచితమా.. రుసుములు వసూలు చేస్తారా అన్న విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం .. తెలంగాణ నుంచి  వెళ్లిపోయింది. కేసీఆర్‌కు ఎలాంటి సేవలు అందించడం లేదు. సర్వేలు కూడా చేయడం లేదు. ఈ విషయం బయటకు రావడంతో పీకేకు.. కేసీఆర్‌కు ఎక్కడ చెదిండన్న చర్చలు ప్రారంభమయ్యాయి. 

తెలంగాణ నుంచి వెళ్లిపోయిన ప్రశాంత్ కిషోర్ టీమ్స్ !

ఐ ప్యాక్ అంటే తిరుగులేని పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ. దేశంలో ఉన్న ప్రతీ పార్టీ సేవలు అందుకోవాలని అనుకుంటుంది. అయితే గెలిచే పార్టీకే పీకే తన ఐప్యాక్‌తో ఒప్పందం చేసుకుంటారనే సెటైర్లు ఉన్నా.. అలా గెలిచే పార్టీని ఎంపిక చేసుకోవడం ఆయన నైపుణ్యం అనుకోవచ్చు. ఇటీవలి కాలంలో ఆయన బీహార్‌లో తన రాజకీయ భవిష్యత్‌ను వెదుక్కుంటున్నారు. ఐ ప్యాక్‌ను ఆయన శిష్యులు నడుపుతున్నారు. అయితే తెలంగాణ విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి దిగారు. కేసీఆర్ కోసం పని చేస్తున్నారు. తన టీముల్ని మానిటర్ చేస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకం కాబోతున్నారు కాబట్టే పీకే ఇలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని అనుకున్నారు. కానీ ఏమైందో కానీ హఠాత్తుగా పీకే టీములు తెలంగాణను వదిలి వెళ్లిపోయాయి. 

పీకే సేవలు వద్దనుకున్న మొదటి పార్టీ టీఆర్ఎస్సే !

ఓ సారి కాంట్రాక్ట్ తీసుకుని పని చేయడం ప్రారంభించిన తర్వాత మొదటి సారి పీకే టీం సేవల్ని వద్దనుకున్నది టీఆర్ఎస్సే అనుకోవచ్చు. వారికి ఉన్న ట్రాక్ రికార్డు అలాంటిది. అయితే ఇలా ఎందుకు అనేది మాత్రం సస్పెన్స్ గా మారింద. తెలంగాణ కోసం ఐ ప్యాక్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి మరీ రిక్రూట్ చేసుకుంది. కనీసం ఐదు వందల మంది వరకూ ఫిల్డ్ టీముతోపాటు ఎనలిస్టుల్ని కూడా నియమించుకుంది. ఇక సోషల్ మీడియా స్ట్రాటజీలకు పెద్ద టీమ్ ఉంది. అయితే వీరంతా తెలంగాణ వదిలి వెళ్లిపోయారు. సర్వేలు టీములు ఏపీకి వెళ్లిపోగా.. ఇతర చోట్లకు మరికొందర్ని పంపేశారు. అధికారికంగా ఇప్పుడు టీఆర్ఎస్‌కు ఐ ప్యాక్ ఎలాంటి సేవలు అందించడం లేదు. 

సర్వేలు లీకయ్యాయని కేసీఆర్ క్యాన్సిల్ చేశారా ?

ఐప్యాక్ సంస్థ సర్వేలు చేస్తోందని కేసీఆర్ చాలా సార్లు చెప్పారు. ఈ సర్వే రిపోర్టులతో పీకే స్వయంగా కేసీఆర్ ను కూడా కలిశారు. అయితే ఇవే రిపోర్టులు తర్వాత ఇతర పార్టీలకు లీకయ్యాయని ప్రచారం జరిగింది. పీకే  సర్వేల్లో మెరుగైన ఫలితం వచ్చిన వారికే టిక్కెట్లు ఇస్తామని కేటీఆర్ కూడా పలుమార్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వే రిపోర్టులు లీక్ కావడంతో  పీకేను కేసీఆర్ నమ్మలేకపోయారని.. వెంటనే సర్వేలు నిలిపివేసి తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని ఐ ప్యాక్ టీంను ఆదేశించారని చెబుతున్నారు. సర్వేలు అవసరం లేదని.. సోషల్ మీడియా స్ట్రాటజీలు చూస్తే చాలని చెప్పినట్లుగా భావిస్తున్నారు. అయితే పీకే టీం ఆ బాధ్యతలు కూడా చూడటం లేదని చెబుతున్నారు. 

తెలంగాణకు పీకే స్ట్రాటజీలు వర్కవుట్ కావని భావించారా ?

కేసీఆర్ స్వయంగా ఢక్కామొక్కీలు తిన్న వ్యూహకర్త. ఆయన రాజకీయం అనూహ్యంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపించారు. అలాంటి  రాజకీయనాయకుడు  ఇతర స్ట్రాటజిస్టుల వ్యూహాల ప్రకారం నడుచుకోవడం కష్టం. కానీ పీకే ప్రోగ్రెస్ కార్డు చూసి అంగీకరించారు.కానీ ఆచరణలోకి వచ్చే సరికి ఆయన వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందనే అంచనాకు వచ్చినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో రాజకీయానికి తెలంగాణలో రాజకీయానికి చాలా తేడా ఉంటుందని..  ఇక్కడ కులాల మధ్య రాజకీయం వర్కవుట్ కాదని అనుకుంటున్నారు. అందుకే గందరగోళానికి తావు లేకుండా ఆయన  సేవల్ని పక్కన పెట్టేశారని అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Viral Video: 'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Pamban Rail Bridge: దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
Embed widget