చిన్నారికి బర్త్ డే విషెస్ చెప్పిన త్రిపుర సీఎం- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ట్వీట్!
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదివారం సీఎం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఓ చిన్న పాప ఆయనను కలిసింది. ఆ పాప పేరు శ్రియాదితా దాస్.
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదివారం సీఎం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఓ చిన్న పాప ఆయనను కలిసింది. ఆ పాప పేరు శ్రియాదితా దాస్. తాను 4 వ తరగతి చదువుతున్నట్లు, కుమార్ ఘాట్ నుంచి అగర్తలాకు ప్రయాణిస్తున్నట్లు ముఖ్యమంత్రితో జరిపిన సరదా సంభాషనలో తెలిపింది.
అలా చాలాసేపు వారిద్దరూ మాట్లాడుకున్న తరువాత ఆ పాప తన పుట్టిన రోజు ఆగస్టు 6న వస్తుందని తెలిపింది. దానిని గమనించిన ముఖ్యమంత్రి..ఆగస్టు 6 అంటే ఆదివారం నాడే. అందుకే ఆమెకు ప్రత్యేకంగా విషెస్ చెప్పి సర్ ప్రైజ్ చేద్దామనుకున్నారు. అందుకు ఆయన తన సోషల్ మీడియాలో పాప పేరును ప్రస్తావిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
దాని గురించి తెలుసుకున్న పాప కుటుంబ సభ్యులు ఎంతో ఆనంద పడడంతో పాటు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా సాధారణంగా తనతో పాటు రైలులో ప్రయాణించిన ఒక పాపకు విషెస్ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని గమనించిన వారంతా ముఖ్యమంత్రి చేసిన పనికి సంతోషపడుతున్నారు.
సీఎం స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి సాధారణ వ్యక్తిలా రైలు ప్రయాణం చేయడమే కాకుండా తన తోటి ప్రయాణికులతో ముచ్చటించడం వంటి పని ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఒక చిన్న పాపతో జరిపిన సంభాషణ అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ముఖ్యమంత్రి డౌన్ టు ఎర్త్ స్వభావాన్ని అందరూ కొనియాడుతున్నారు.
ఆయన స్వభావానికి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలా ప్రజలకు దగ్గరవ్వడాన్ని అందరూ కొనియాడుతున్నారు.
ముఖ్యమంత్రి తన ఫేసుబుక్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు..'' నేను కుమార్ ఘాట్ నుంచి అగర్తలాకు రైలులో తిరుగు ప్రయాణం చేస్తున్నప్పుడు.. నేను నాల్గో తరగతి చదువుతున్న ఈ చిన్న స్నేహితురాలు శ్రియాదితా దాస్‌తో మాట్లాడాను. ఆదివారం ఆమె పుట్టిన రోజని తెలుసుకున్నాను. ఆ చిన్నారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆమె ఉజ్వల భవిష్యత్తు కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ రాసుకొచ్చారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial