అన్వేషించండి

Bengal Assembly elections 2026: రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?

Trinamool Congress: బెంగాల్‌లో మమతా బెనర్జీ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చెప్పిన వారికే టిక్కెట్లు కేటాయించారు.

Abhishek Banerjee as successor in Trinamool Congress:  పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్  అధినేత్రి మమతా బెనర్జీ తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సుమారు 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు నిరాకరించడం ద్వారా ఆమె తన సొంత పార్టీలోనే ఒక పెద్ద  ప్రయోగం చేస్తున్నారు. 

అధికార వ్యతిరేకతపై సర్జికల్ స్ట్రైక్

వరుసగా  సార్లు పర్యాయాలు అధికారంలో ఉన్నందున సహజంగానే వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను   తుడిచిపెట్టడమే మమత ప్రధాన లక్ష్యం. క్షేత్రస్థాయిలో పనితీరు సరిగ్గా లేని వారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు,  ప్రజలకు దూరమైన నేతలను ఆమె నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు. 74 మంది ఎమ్మెల్యేలను తొలగించడం అనేది టీఎంసీ చరిత్రలోనే అత్యంత భారీ మార్పుగా అభివర్ణించవచ్చు. దీని ద్వారా తప్పు చేసిన వారు ఎవరైనా సరే.. పార్టీలో చోటు లేదు అనే బలమైన సందేశాన్ని ఆమె ఓటర్లలోకి పంపగలిగారు.

అభిషేక్ బెనర్జీ మార్క్.. యువతకు పెద్దపీట

ఈ టిక్కెట్ల కోత వెనుక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. పాత తరం నేతలను తగ్గించి, సుమారు 45% సీట్లను 50 ఏళ్ల లోపు ఉన్న యువ నేతలకు కేటాయించడం ద్వారా పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాలని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా దేవంగ్షు భట్టాచార్య వంటి యువ ప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, యంగ్ బెంగాల్ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది. ఇది పార్టీలో పాత-కొత్త తరాల మధ్య కొంత ఘర్షణకు దారితీసినప్పటికీ, భవిష్యత్తు నాయకత్వం కోసం ఈ మార్పు అనివార్యమని అధిష్టానం నమ్ముతోంది.

వివాదాస్పద నేతలపై వేటు

ఉపాధ్యాయ నియామక కుంభకోణం, రేషన్ కుంభకోణం వంటి కేసుల్లో చిక్కుకున్న వారు , జైలులో ఉన్న మాజీ మంత్రులు  ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. గతంలో సినీ తారలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే టీఎంసీ, ఈసారి స్టార్ పవర్ కంటే గ్రౌండ్ పవర్ మిన్న అని భావించి పలువురు నటులకు  సీట్లు నిరాకరించింది. ఇది పార్టీ ఇమేజ్‌ను ప్రక్షాళన చేసే ప్రక్రియలో భాగమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతర్గత అసమ్మతి - పొంచి ఉన్న ముప్పు

అయితే, ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం టీఎంసీకి అగ్నిపరీక్ష వంటిదే. టిక్కెట్లు దక్కని 74 మంది నేతల్లో కొందరు ఇప్పటికే అసమ్మతి రాగంతో ఉన్నారు. కొందరు స్వతంత్రులుగా పోటీ చేస్తామని హెచ్చరిస్తుంటే, మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ అసమ్మతి నేతలు గనుక రెబెల్స్ గా మారి ఓట్లను చీలిస్తే, అది గట్టిపోటీ ఉన్న స్థానాల్లో టీఎంసీకి నష్టం కలిగించవచ్చు. ముఖ్యంగా హుగ్లీ, మాల్దా వంటి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని  భావిస్తున్నారు. 

వ్యూహాత్మక స్థానచలనం

మరోవైపు, 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను వారి పాత నియోజకవర్గాల నుండి మార్చి కొత్త చోట పోటీకి దించడం ద్వారా స్థానిక వ్యతిరేకతను అధిగమించాలని మమత ప్లాన్ చేశారు. ముఖ్యంగా మమత స్వయంగా తన పాత కోట భవానీపూర్‌కు తిరిగి రావడం, అక్కడ బీజేపీ నేత సువేందు అధికారితో తలపడటం ద్వారా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. మొత్తానికి, ఈ గ్రేట్ రిఫార్మ్  మమతకు నాలుగోసారి అధికారాన్ని కట్టబెడుతుందో లేక సొంత పార్టీలోనే సంక్షోభానికి దారితీస్తుందో మే 4న వచ్చే ఫలితాలే తేల్చాలి.  

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget