అన్వేషించండి

Jagan To Vizag : రాజధాని పేరు లేకుండా విశాఖ నుంచి పాలన - వైఎస్ఆర్‌సీపీ తాజా వ్యూహం ఇదే ?

రాజధాని పేరు లేకుండా విశాఖ నుంచి పాలనకు జగన్ సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మంత్రుల ప్రకటనలకు అదే అర్థం అని భావిస్తున్నారు.

 

Jagan To Vizag :  రెండు, మూడు నెలల్లో విశాఖ నుంచి పాలన అని ఉత్తరాంధ్ర మంత్రులు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే మూడు రాజధానుల అంశం కోర్టులో ఉందని ఇలా ఎలా ప్రకటనలు చేస్తారని ఇతర పార్టీల నేతలు స్పందిస్తున్నారు. కానీ ఇక్కడ మంత్రులు చెబుతున్నది రాజధానుల గురించి కాదు.. కేవలం పాలన గురించే. విశాఖ నుంచి జగన్ పాలన చేస్తారని చెబుతున్నారు. అప్పుడు అది అధికారికంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకపోవచ్చు కానీ అనధికారికంగా అవుతుందని అంటున్నారు. 

విశాఖ నుంచి జగన్ పాలన చేస్తారంటున్న మంత్రులు 

చట్టపరంగా ఎదురవుతున్న అడ్డంకులకు కొత్త దారిలో  పరిష్కారం వెదుక్కోవాలని జగన్ అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ మంత్రులు వ్యూహాత్మకంగా ప్రకటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో ఏప్రిల్ నుంచి రాజధాని అని చెప్పడం లేదు. జగన్ పాలన చేస్తారని చెబుతున్నారు. గతంలో తాము వాదించినట్లుగా.. సీఎం పాలన ఎక్కడి నుంచైనా చేయవచ్చని.. ఎవరూ అడ్డుకోలేరని వారు వాదించవచ్చు. సీఎం జగన్ రాజధాని నుంచే పరిపాలించాలని లేదు. అలాగని సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని కాదు. సీఎం జగన్ కర్నూలు లేదా విశాఖ నుంచి పరిపాలన చేస్తే ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. ఈ కోణంలోనే విశాఖ నుంచి ఆయన పరిపాలన చేయవచ్చని అంటున్నారు.

మంత్రి బొత్స మాటల అర్థం అదేనా..?

విశాఖ రాజధానిగా పాలనపై ఇప్పటికే మంత్రులు స్పష్టత ఇచ్చారు. త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన సాగిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విజయనగరంలో మాట్లాడారు. రెండు, మూడు నెలల్లోనే విశాఖ రాజధాని అవుతుందని చెప్పారు. “వచ్చే రెండు మూడు నెలల్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవ్వాలన్నది మా కోరిక. అది అవుతుంది కూడా. రాష్ట్ర ప్రజలు కూడా సమగ్ర అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఇదంతా జరుగుతుంది. భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన త్వరలోనే ఉంటుంది" అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం 2023 ఏప్రిల్ నుంచి సీఎం జగన్ విశాఖ నుంచి పాలన చేస్తారని గతంలోనే తెలియజేశారు...

చట్టపరంగా ఉండదు..!

సీఎం ఎక్కడ నుంచి అయినా పరిపాలించవచ్చని.. ఫలానా చోటే ఉండాలన్న రూలేం లేదని వైఎస్ఆర్సీపీ వర్గాలు కొంత కాలంగా వాదిస్తున్నాయి. అదే సమయంలో రాజ్యాంగంలో రాజధాని అనేదే లేదని అంటున్నారు. ఈ వాదనలతో.. సుప్రీంకోర్టులో అమరావతి అంశం తేలక పోయి నా విశాఖ నుంచి జగన్ పాలన చేయాలని నిర్ణయించుకున్నారు. అది చట్ట పరంగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. మరి జగన్ విశాఖ నుంచి పరిపాలన చేస్తే అదే రాజధాని అవుతుందా? వ్యవహారం కోర్టుల్లో ఉన్నప్పుడు ఓ ముఖ్య మంత్రి స్థానంలో ఉన్న నేత అలా చేయవచ్చా? అని ప్రతిపక్షాలు  ప్రశ్నించే అవకాశం ఉంది. 

సిద్ధమవుతున్న పభుత్వ భవనాలు...!

విశాఖ నుంచి పాలనకు అనుగుణంగా ప్రభుత్వ భవనాల ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రిషికొండపై నిర్మిస్తున్న భవనాలు సిద్ధం అయ్యాక ప్రభుత్వ శాఖల షిఫ్టింగ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల విశాఖలో వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా ఆ పార్టీ నేతలు శంకుస్థాపన చేశారు. మంత్రుల కామెంట్లు, ప్రభుత్వ పర చర్యలు చూస్తుంటే మరో రెండు, మూడు నెలల్లో విశాఖ నుంచి పాలన ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మూడు రాజధానులు బిల్లు మాటెలా ఉన్నా సీఎం జగన్ మాత్రం విశాఖలో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని వైసిపీ మంత్రులు పదేపదే చెబుతూ వస్తున్నారు. దానికి తగ్గట్టే పరిణామాలు అన్నీ వేగంగా జరిగిపోతున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

China Manja For Kites: పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
Nara Lokesh Gift: భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
Hari Hara Veera Mallu: వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
Sankranti 2025 Telugu Movies: సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbh Mela 2025 Day 1 Highlights | ప్రయాగలో కళ్లు చెదిరిపోయే విజువల్స్ | ABP DesamMahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
China Manja For Kites: పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
Nara Lokesh Gift: భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
Hari Hara Veera Mallu: వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
Sankranti 2025 Telugu Movies: సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
Jallikattu: చిత్తూరు జిల్లాలో జల్లికట్టు జోష్, ఎద్దులు రంకెలేసి దూసుకొస్తున్నా తగ్గేదేలే అంటున్న యువత
చిత్తూరు జిల్లాలో జల్లికట్టు జోష్, ఎద్దులు రంకెలేసి దూసుకొస్తున్నా తగ్గేదేలే అంటున్న యువత
Hyderabad Double Murder: సంక్రాంతి రోజు నార్సింగిలో జంట హత్యల కలకలం- యువతి, యువకుడిపై అంత పగ ఎవరికో?
సంక్రాంతి రోజు నార్సింగిలో జంట హత్యల కలకలం- యువతి, యువకుడిపై అంత పగ ఎవరికో?
Sankranti 2025: తెలంగాణకు పాకిన గోదావరి
తెలంగాణకు పాకిన గోదావరి "అతి" మర్యాదలు, శృతి మించుతున్న సంక్రాంతి అల్లుడి వెరైటీ విందులు
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
Embed widget